ఐఆర్‌సిటిసి పర్యాటకుల కోసం నిత్యం ఏదో ఒక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు, చారిత్రక కట్టడాలకు ప్యాకేజీలను అందిస్తోంది. దేశంలోని ప్రసిద్దిచెందిన అయోధ్య రామయ్య దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా అయోధ్య బాలరాముని దర్శనంతోపాటు కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ హోలీ ఉత్తర్‌ప్రదేశ్ యాత్ర పేరుతో ఆపరేట్ అవుతోంది. ఈ ప్యాకేజీలో భాగంగా హైదారబాద్ నుంచి ప్రయాణం ఉంటుంది. ఈ టూర్‌లో వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ వంటి ప్రదేశాలను సందర్శించొచ్చు. ఈ టూర్ మొత్తంగా ఐదు రాత్రులు, ఐదు పగళ్లతో ఉంటుంది. ఆదివారం ఈ టూర్ ప్రారంభమవుతుంది.
టూర్ షెడ్యూల్ ఇదే...
ప్యాకేజీలో భాగంగా మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్‌లో 12791 అనే నెంబర్‌గల దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభమవుతుంది. ఆ రోజు నైటంతా జర్నీ ఉంటుంది. ఇక, రెండో రోజు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యాక ఆ రోజు సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి చూస్తారు. ఆ నైటంతా వారణాసిలోనే స్టే చేస్తారు. మరుసటి రోజు అల్పాహారం ముగించుకుని వారణాసిలో ఆలయాలను చూస్తారు.

కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్, బిర్లా మందిర్ల సందర్శన ఉంటుంది. అనంతరం అయోధ్యకు ప్రయాణం మొదలుపెడతారు. అయోధ్య హోటల్లో చెకిన్ అయ్యాక, ఆ నైటంతా స్టే చేస్తారు. నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ అయ్యాయక అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహల్‌ను సందర్శన ఉంటుంది. మధ్యహ్నం ప్రయాగరాజ్‌కు బయలుదేరి నైట్ అక్కడే స్టే చేస్తారు. ఇక, ఐదో రోజు తెల్లవారుజామున త్రివేణి సంగమ సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి హోటల్‌కి వచ్చి టిఫిన్ చేశాక, మధ్యాహ్నం హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అనంతరం ఆనంద్ భవన్, ఖుస్రో బాగ్ సందర్శన ఉంటుంది. అదే రోజు సాయంత్రానికి ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ వెళ్తారు. రాత్రి 7:45నిమిషాలకు సికింద్రాబాద్‌కు ట్రైన్ బయలుదేరుతుంది. ఆ నైటంతా ప్రయాణం ఉంటుంది. ఇక, ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది.

టూర్ ధరలివే..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ధరలు ఇలా ఉన్నాయి. కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 41,460/ చెల్లించాల్సి ఉంటుంది. అదే ట్విన్ షేరింగ్ అయితే రూ. 24,530గా నిర్ణియించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 19,840 చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఐదు నుంచి పదకొండేళ్ల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 14,780 ఉంటుంది. విత్ అవుట్ బెడ్ అయితే రూ. 13,540చెల్లించాలి.
ఇక స్టాండర్డ్ క్లాస్ విషయానికి వస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 21,990 చెల్లించాలి. ట్విన్ షేరింగ్‌కు రూ. 17,410 గా నిర్ణయించారు. అదే ట్రిపుల్ ఆక్యుపెన్సీకయితే రూ.16,830 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 13వేలు కట్టాల్సి ఉంటుంది. విత్ అవుట్ బెడ్ అయితే రూ. 11,760 ఉంటుంది.

అదనపు సౌకర్యాలు..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు 3 ఏసీ/ స్లీపర్ క్లాస్‌లను ఎంచుకోవచ్చు. ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ గదులు, వాహనాన్ని వారే ఏర్పాటు చేస్తారు. మూడు రోజులకు గాను బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ వారే అందుబాటు కల్పిస్తారు. ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉంటే మాత్రం సందర్శకులే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 22, అక్టోబర్ 6, 13, 20, 27వ తేదీలలో పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













