Search
  • Follow NativePlanet
Share
» »లూథియానాలో ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు

లూథియానాలో ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు

లూథియానాలో ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు

పంజాబ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరం లూథియానా. ఇది సట్లెజ్ నది ఒడ్డున ఉంది. లోధీ రాజవంశం పతనం తరువాత మొఘలులు ఆధీనంలో ఈ ప్రాంతం ఉంది. రాచరిక వ్య‌వ‌స్థ‌ క్షీణించిన తరువాత ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలన వచ్చింది. 1857 తిరుగుబాటు సమయంలో ఈ నగరం కీలక పాత్ర పోషించింది.

భగత్ సింగ్ మరియు రాజ్‌గురులతో పాటు బ్రిటిష్ వారిచే ఉరితీయబడిన స్వాతంత్య్ర‌ సమరయోధుడు సుఖ్‌దేవ్ యొక్క స్వస్థలం కూడా ఇదే. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు వేసవి నెలలు మినహాయించి, ఏడాది పొడవునా ప‌ర్య‌ట‌న‌కు నగరం అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. లూథియానాలో సందర్శించద‌గిన కొన్ని ఉత్తమ ప్ర‌దేశాల‌ను ప‌రిశీలిద్దాం.

లోధి కోట

లోధి కోట

లోధీ కోటను సుమారు 500 సంవత్సరాల క్రితం ముస్లిం చక్రవర్తి సికందర్ లోధీ నిర్మించారు. ఈ కోట సట్లెజ్ నది ఒడ్డున ఉంది. 1809లో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. ఈ కోట ఒకప్పుడు గొప్ప ముస్లిం రాజు యొక్క గంభీరమైన నివాసంగా ఉంటూ.. రాచ‌రిక‌పు ఠీవీని ప్ర‌ద‌ర్శించేంది. త‌ద‌నంత‌ర కాలంలో నిర్లక్ష్యం కారణంగా కోట శిథిలావస్థకు చేరుకుంది. దీంతోపాటు ప్ర‌కృతివైప‌రీత్యాల కార‌ణంగా తీవ్రంగా దెబ్బ‌తింది. అయిన‌ప్ప‌టికీ, చారిత్ర‌క ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తి ఉన్న‌వారు ఎక్కువ సంఖ్య‌లో ఈ కోట‌ను సంద‌ర్శించేందుకు వ‌స్తూ ఉంటారు.

పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మ్యూజియం

పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మ్యూజియం

దీనినే అజైబ్ ఘర్ అని కూడా పిలుస్తారు. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ మ్యూజియం సంద‌ర్శ‌న ద్వారా 18వ మరియు 19వ శతాబ్దాలలోని లూథియానాలోని ప్రజల జీవ‌న విధానం గురించి తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. ఈ మ్యూజియం ఏటా జరిగే కిసాన్ మేళా యొక్క రంగుల పండుగకు వేదికగా మారుతుంది. మ్యూజియంలో వివిధ గ్రామీణ వ్యవసాయ ఉపకరణాలు మరియు వస్తువులతోపాటు 18వ మరియు 19వ శతాబ్దానికి చెందిన అనేక ఇతర కళాఖండాలను ప్ర‌ద‌ర్శ‌నకు ఉంచుతారు.

ఫిల్లౌర్ కోట

ఫిల్లౌర్ కోట

షేర్ షా సూరి పాలనలో లూథియానా సమీపంలోని ఫిల్లౌర్‌లో సరాయ్ నిర్మించబడింది. షాజహాన్ హయాంలో ఈ నిర్మాణాన్ని సైనిక కోటగా మరియు పోస్టాఫీసుగా మార్చబడింది. ఈ కోటను బ్రిటిష్ వారు సైనిక కంటోన్మెంట్‌లో భాగంగా ఉపయోగించారు. కోటలో ఇప్పుడు పోలీసు శిక్షణా అకాడమీ మరియు ఫింగ‌ర్‌ప్రింట్‌ బ్యూరో విభాగాల‌కు వినియోగిస్తున్నారు.

మహారాజా రంజిత్ సింగ్ మ్యూజియం

మహారాజా రంజిత్ సింగ్ మ్యూజియం

ఈ మ్యూజియం జీటీ రోడ్ వద్ద ఉంది. మహారాజా రంజిత్ సింగ్ పేరు మీద సింహాసనంపై కూర్చున్న విగ్రహం ప్రవేశ ద్వారం వద్ద ఉంది. గంభీర‌మైన ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు క‌ళ్లూ స‌రిపోవు. మ్యూజియంలో పురాతన చరిత్ర మరియు స్వాతంత్య్రం తర్వాత రెండు విభాగాలతో మొత్తం 12 గ్యాలరీలు సంద‌ర్శ‌న నిమిత్తం ఉంచారు.

టైగర్ జూ

టైగర్ జూ

జీటీ రోడ్డు వద్ద ఉన్న టైగర్ జూ 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జూ 1993లో స్థాపించబడింది. అప్పటి నుండి లూథియానాలో ప్ర‌సిద్ధ‌ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. సేఫ్టీ వాహ‌నాల ద్వారా సఫారీలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. లోపల నుండి బహిరంగ ప్రదేశంలో పులులను చూడవచ్చు. సఫారీ సోమవారం మినహా అన్ని రోజులు అందుబాటులో ఉంటాయి.

More News

    Read more about: ludhiana punjab
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+