Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» లుధియానా

లుధియానా - సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రం!

సట్లేజ్ నది ఒడ్డుపై ఉన్న లుధియానా, భారతీయ రాష్ట్రమైన పంజాబ్ లోని అతిపెద్ద నగరం. ఈ రాష్ట్ర నగర నడిబొడ్డున ఉన్న ఈ నగరం న్యూ సిటీ, ఓల్డ్ సిటీ గా విభజించబడింది. లోధి వంశ పేరుమీద ఈ నగరం 1480 లో స్థాపించబడింది. కెనడా, యుకె, ఆస్ట్రేలియా, యుఎస్ లో ఉన్న అనేకమంది NRI లు ఈ నగరం నుండి వచ్చినవారే. లుధియానాలో ఉండే స్థానికులు, మర్యాదకు పేరుగాంచారు.

23

లుధియానా లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఈ నగరం సందర్శకులకు వినోదాన్ని అందించే అనేక పర్యాటక ఆకర్షణలకు నిలయం. గురుద్వారా మంజీ సాహిబ్, గురు నానక్ భవన్, ఫిల్లార్ ఫోర్ట్, మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం, గురు నానక్ స్టేడియం, రాఖ్ బాగ్ పార్కు, మొదలైనవి కొన్ని లుధ్ధియానాలోని పర్యటకంలో ప్రసిద్ధమైనవి. ఇవికాకుండా, ఇక్కడ అనేక ఆకర్షణీయమైన తోటలు, ఉదయం, సాయంత్రం నడకకు ప్రత్యేకమైన పార్కులు కూడా ఉన్నాయి. విరామ సమయంలో, పర్యాటకులు లుధియానా పర్యటకంలో ఒకభాగమైన వివిధ వినోదాలను అందించే పార్కులు, జంతుప్రదర్శన శాలను కూడా చూడవచ్చు.

లుధియానా షాపింగ్ కు పంజాబ్ లోని ఉత్తమ నగరాలలో ఒకటి. ప్రత్యేకంగా, ఈ నగరంలో అంతర్జాతీయ, స్థానిక బ్రాండ్ దుకాణాలు ఉన్న 20 కంటే ఎక్కువ మాళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా, లుధియానా ప్రజల ఆహారాన్ని ఇష్టపడతారు, ఈ నగరంలో రెస్టారెంట్ల సంఖ్యా బాగా పెరగడం దీనికి కారణం. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ పంజాబీ పానీయం లస్సి, ఇది స్వీట్, సాల్ట్ రెండు రూపాలలో దొరుకుతుంది. లుధియానా ఊహాత్మక ప్రదేశం కావడం వల్ల, ఇక్కడ అనేక సమీపంలో

 

అనేక పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది. చండీగర్, కసులి, మేక్లేయోడ్గంజ్, ధర్మసాలా, షిమ్ల, కుఫ్రి మొదలైన కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలను రోడ్డుమార్గం ద్వారా నాలుగు గంటల కంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

లుధియానా లో పండుగలు, సంప్రదాయాలు, ఉత్సాహాలు

సంస్కృతి, వారసత్వం లో బాగా పేరుగాంచిన లుధియానాను నెహ్రు సిద్ధాంత్ కేంద్ర ఆడిటోరియం, గురు నానక్ భవన్, పంజాబీ భవన్ వద్ద ప్రధానంగా నిర్వహించే ధార్మిక సంఘటనలకోసం పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా, గ్రామీణ సంగీతం, నృత్యం, ఆటలు, తాడు-నృత్యం, వివిధ ఇతర అద్భుతమైన కార్యకలాపాలను ఆనందించే అవకాశాన్ని అందించే సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకుల కోసం ఏర్పాటుచేయబడతాయి. పంజాబ్ లో బాగా ప్రసిద్ది చెందిన లోహరి పండుగను పొహ్ చివరి రోజు జరుపుకుంటారు. వసంత పంచమి, హోలీ, వైశాఖి, లుధియాన పర్యటనను నిజంగా, ఉత్సాహంగా వర్ణించే గురుపురాబ్ వంటి ఇతర పండుగలను కూడా జరుపుకుంటారు.

లుధియానా చేరుకోవడం ఎలా

లుధియానా, రహదారి ద్వారా షుమారు 5 గంటల ప్రయాణంతో ఉన్న ఢిల్లీ నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే అనేక రైళ్ళు ఉన్నాయి. రిక్షాలు, బస్సుల సహాయంతో ఈ నగరంలో ప్రయాణించడం చాలా సౌకర్యవంతం.

లుధియానా సందర్శనకు ఉత్తమ సమయం

లుధియానా లో మితిమీరిన వాతావరణ పరిస్థితులు ఉండవు, అందువల్ల సందర్శకులకు ఇదొక ప్రయోజనం. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఈ నగరాన్ని సందర్శించడం ఉత్తమం.

లుధియానా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లుధియానా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లుధియానా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లుధియానా

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in లుధియానా
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా: ఫ్రాన్టీర్ మెయిల్, జమ్మూ తావి, శతాబ్ది ఎక్స్ప్రెస్ వంటి అనేక రైళ్ళు న్యూ ఢిల్లీ-అమ్రిత్సర్ దారిగుండా వెళ్లి లుధియానాలో ఆగుతాయి. లుధియానా నుండి జమ్మూ, జలంధర్, అమ్రిత్సర్, పటియాల, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి అనేక భారతీయ నగరాలకు రోజువారీ, వారానికొకసారి రైళ్ళు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా: GT రహదారిపై ఉన్న సహ్నేవాల్ విమానాశ్రయం (లుధియానా విమానాశ్రయం) ప్రధాన నగర౦ నుండి షుమారు 12.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర పేరొందిన విమానాశ్రయాలు, భారతదేశ విమానాల ద్వారా రోజువారీ విమాన సర్వీసులతో పర్యాటకులు న్యూ ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుండి లుధియానా కు సౌకర్యవంతంగా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue