Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసా

ఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసా

ఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి

భారత దేశంలో శివలింగాన్ని ఆ పరమశివుడి ప్రతి రూపంగా భావిస్తారు. అందుకే ప్రతి రోజూ పూజలు చేస్తారు. ఇక శివరాత్రి, సోమవారం, శ్రావణ మాసం తదితర విశేష రోజుల్లో ఈ పూజలు మరింత విశిష్టతనకు కలిగి ఉంటాయి. ఈ శివలింగాల్లో కొన్ని విశిష్టమైనవి ఉన్నాయి. ఇప్పటికే మనం అర్థనారీశ్వరంగా ఉన్న శివలింగం, రక్తం కారే శివలింగం, కుళ్లిన మాసం వాసన వచ్చే శివలింగం తదితరాల గురించి తెలుసుకొన్నా. ఇటువంటి శివలింగాలు ఉన్న క్షేత్రాలు అన్నీ ఎంతో ప్రాచూర్యం చెందాయి. హిందు భక్తులే కాక నాస్తికులు కూడా వీటి మీద పరిశోధనలు చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాలకు చేరుకొంటున్నారు. అనేక సంవత్సరాలు పరిశోధన చేసినా ఫలితం మాత్రం లేకుండా పోతోంది. ఈ కథనంలో కూడా అటువంటి శివలింగం గురించే తెలుసుకొందాం.

నిత్యం కదులుతూ ఉంటుంది

నిత్యం కదులుతూ ఉంటుంది

ఆశ్చర్యకరమైన విషయమైనా ఇక్కడ శివలింగం నిత్యం కదులుతూ ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం ఉత్తర ప్రదేశ్ లోని దియోరియా జిల్లాలోలని రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలోని శివలింగాన్ని దుగ్దేశ్వర నాథ శివలింగం అని పిలుస్తారు.

ఉప లింగం

ఉప లింగం

P.C: You Tube

అదే విధంగా ఈ దుగ్దేశ్వరనాథ శివలింగాన్ని మధ్యప్రదేశ్ లోని మహా కాళేశ్వరం జ్యోతిర్లింగానికి ఉప లింగం అని భక్తులు భావిస్తారు. సాధారణంగా శివలింగం పానవట్టం మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న శివలింగం నేరుగా భూమి పై ఉంటుంది.

స్వయంభువు

స్వయంభువు

P.C: You Tube

అంతేకాకుండా ఈ శివలింగం ఎవరూ స్థాపించినది కాదు. స్వయంభువగా చెప్పబడుతుంది. అంటే భూమి పొరల నుంచి నేరుగా ఇది భూమి పై భాగానికి వచ్చిందని చెబుతారు. ఈ శివలింగం అత్యంత ప్రత్యేకత కలిగినది.

మరెక్కడా లేదు

మరెక్కడా లేదు

P.C: You Tube

ఈ ఇటువంటి శివలింగం భూ ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఇక్కడి వారు చెబుతారు. ఈ శివలింగం తనంతకు తానుగా కదులుతూ ఉంటుంది. ఇలా కదలం ప్రారంభించిన తర్వాత 3 నుంచి 24 గంటల పాటు ఏకదాటిగా కదులుతుంది.

ఒకసారి కదలడం నిలిచిపోతే

ఒకసారి కదలడం నిలిచిపోతే

P.C: You Tube

ఒక సారి కదలడం నిలిచిపోయిన తర్వాత ఈ శిలింగం మరిక కదలదు. భక్తులు, పూజారులు ఎంత ప్రయత్నించినా ఒక ఇంచు కూడా ఈ శివలింగం కదలదు. ఇందుకు గల కారణాలలను మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఈ శివాలయం అత్యంత ప్రాచీనమైనది.

దాదాపు 5000 ఏళ్లు

దాదాపు 5000 ఏళ్లు

P.C: You Tube

ఈ శివలింగం ఉద్భవించి దాదాపు 5000 సంవత్సరాలు అయిఉంటుందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా వారు చూపుతారు. ముందే చెప్పుకొన్నట్లు ఈ దుగ్దేశ్వరనాథ శివలింగం స్వయంభువు.

ఎంతమేరకు

ఎంతమేరకు

P.C: You Tube

ఇది భూమి లోపల ఎంత మేర విస్తరించి ఉందన్న విషయాన్ని ఇంతవరకూ ఎవరూ కనుగొనలేదు. చాలా కాలం క్రితం భూమి లోపలి పొరల్లో ఎంత మేరకు విస్తరించి ఉందన్న విషయం కనుగొనడానికి ఈ శివలింగానికి సమాంతరంగా ఒక గొయ్యి తీసారు. అయినా కూడా కనుగొనలేకపోయారు.

పాలభిషేకం

పాలభిషేకం

P.C: You Tube

దీంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. ఈ శివలింగానికి అభిషేకం చేయడం పూర్వ జన్మఫలం అని నమ్ముతారు. ఇక శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ పాలు అత్యంత పవిత్రమైపోతాయని భక్తుల నమ్మకం.

ఔషద గుణాలు

ఔషద గుణాలు

P.C: You Tube

అంతేకాకుండా ఆ పాలకు అనేక ఔషధ గుణాలు వస్తాయని చెబుతారు. అందుకే ఈ పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. ఈ దుగ్దేశ్వరనాథ దేవాలయ ప్రవేశ ద్వారాన్ని ఒక రాతితో నిర్మించడం విశేషం.

గణేషుడి ప్రతిమ

గణేషుడి ప్రతిమ

P.C: You Tube

ఈ ద్వారం పై గణేషుడి ప్రతి మ కూడా ఉంది. ఈ దేవాలయంలో జరిగిగే విస్మయాన్ని చూడటానికి ఉత్తరభారత దేశం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇక శ్రావణ మాసం వంటి పవిత్రమైన రోజుల్లో విదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులకు వేల సంఖ్యలో వస్తుంటారు.

పున:నిర్మించారు

పున:నిర్మించారు

P.C: You Tube

అత్యంత పురాతనమైన ఈ దేవాలయాన్ని మొదట నిర్మించనవారి గురించి వివరాలు తెలియదు. అయితే ఛత్రపతి శివాజీ కదిలే శివలింగం ఉన్న ఈ దుగ్దేశ్వర నాథ దేవాలయాన్ని పున: నిర్మించారని చెబుతారు. ఈ దుగ్దేశ్వరనాథ దేవాలయం చుట్టు పక్కల అనేక ప్రఖ్యాతి చెందిన విద్యాలయాలు ఉన్నాయి.

విదేశీ విద్యార్థులు

విదేశీ విద్యార్థులు

P.C: You Tube

ఇందులో చాలా వరకూ విదేశీ విద్యార్థులు చదువుకొంటూ ఉన్నారు. ఈ దుగ్దేశ్వరనథ దేవాలయంలో అత్యంత పురాతనమైన బావి, కాళీమాత, యోగ శాలలు కూడా చూడదగినవి. ఈ దేవాలయంలో సందర్శకులను తెల్లవారుజాము 4 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకూ అనుమతిస్తారు.

ఇలా వెళ్లవచ్చు.

ఇలా వెళ్లవచ్చు.

P.C: You Tube

అదే విధంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరక భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. ఈ కదిలే శివలింగం ఉన్న దుగ్దేశ్వరనాథ దేవాలయానికి దగ్గర్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రంయ ఉంది. ఇక్కడి నుంచి దుగ్దేశ్వరనాథ దేవాలయానికి కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+