Search
  • Follow NativePlanet
Share
» »క్విట్ ఇండియా ఉద్యమానికి సాక్ష్యాలు.. ముంబైలోని ఈ చారిత్రక ప్రదేశాలు!

క్విట్ ఇండియా ఉద్యమానికి సాక్ష్యాలు.. ముంబైలోని ఈ చారిత్రక ప్రదేశాలు!

భార‌త‌దేశ స్వాతంత్య్రోద్య‌మంలో 1942 క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో కీల‌క‌మైందని మ‌న‌కు తెలుసు. అలాంటి పోరాట స‌మ‌యంలో ముంబై న‌గ‌రం పాత్ర వెల‌క‌ట్ట‌లేనిది. నేటికీ ఇక్క‌డి చారిత్ర‌క ప్ర‌దేశాలు అల‌నాటి ఉద్య‌మ స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యాలుగా ప‌ల‌క‌రిస్తున్నాయి. మ‌హాత్ముని వ్యూహ‌ర‌చన‌లు, ఉద్య‌మ‌కారుల నిర‌స‌న‌లు, స్ఫూర్తినిచ్చే ప్ర‌సంగాలు ముంబై న‌గ‌ర ప‌రిస‌రాల‌ను చారిత్ర‌క ఘ‌ట్టాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుపుతోంది. ఆగ‌స్టు 15 స‌మీపిస్తున్న వేళ భారతదేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో మ‌హ‌నీయులు న‌డియాడిన ముంబై నేల‌పై ఉన్న అలాంటి చారిత్ర‌క ప్రాంతాల‌ను ఒక్క‌సారి గుర్తుచేసుకుందాం.. దేశ‌ స్వేచ్ఛ కోసం పోరాడిన వారి ధైర్యసాహసాలను స్మ‌రించుకుందాం రండి!

గోవాలియా ట్యాంక్ మైదాన్‌

ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని కూడా పిలువబడే గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో మహాత్మా గాంధీ తన ప్రసిద్ధ "డూ ఆర్ డై" ప్రసంగాన్ని 8 ఆగస్టు 1942న వినిపించారు. ఈ ప్రసంగం క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది పలికింద‌నే చెప్పాలి. దేశ వ్యాప్తంగా స్వాంత్య్ర పోరాటానికి భారతీయుల‌ను సంఘితం చేసిన గొప్ప క్ష‌ణాలుగా చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి. నేటికీ, ఈ మైదానం భార‌తీయుల‌ తిరుగుబాటు, సంకల్పానికి చిహ్నంగా నిలుస్తోంది.

manibhavan1

మణి భవన్

ముంబైలోని మణి భవన్ 1917 నుండి 1934 వరకు మహాత్మా గాంధీ నివాసంగా సేవ‌లందించింది. ఇక్కడే క్విట్ ఇండియా ఉద్యమంతో సహా అనేక ఉద్యమాలకు గాంధీ వ్యూహరచన చేశారు. ప్ర‌స్తుతం మణి భవన్‌లో గాంధీ జీవితానికి, పనికి సంబంధించిన ఛాయాచిత్రాలు, లేఖలు, అరుదైన‌ పత్రాలను పొందుప‌రిచిన మ్యూజియంగా త‌న సేవ‌ల‌ను కొన‌సాగిస్తోంది.

ఆజాద్ మైదాన్

క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆజాద్ మైదాన్ మరొక ముఖ్యమైన ప్రదేశంగా నిలిచింది. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసనలు, సమావేశాలకు వేదిక అయింది. అంతేకాదు, నేటికీ ముంబయిలో రాజకీయ సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలకు ఆజాద్‌ మైదానం ప్రసిద్ధ ప్రదేశంగా త‌న సేవ‌ల‌ను కొన‌సాగిస్తోంది.

highcourtofbombay1

బాంబే హైకోర్టు

క్విట్ ఇండియా ఉద్యమంలో బాంబే హైకోర్టు కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో పాల్గొన్నందుకు చాలా మంది స్వాతంత్య్ర‌స‌మ‌ర‌యోధుల‌ను ఈ కోర్టులో విచారించారు. అంతేకాదు, కోర్టు నిర్మాణ‌శైలితోపాటు ఇక్క‌డి చారిత్రక నేప‌థ్యం కార‌ణంగా ముంబైలో గుర్తించదగిన మైలురాయిగా బాంబే హైకోర్టు నిలిచింది.

thegatewayofindia

ది గేట్‌వే ఆఫ్ ఇండియా

గేట్‌వే ఆఫ్ ఇండియాకు నేరుగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాత్ర లేన‌ప్ప‌టికీ ఇది బ్రిటిష్ పాలనలో జ‌రిగిన‌ అనేక ఘ‌ట‌న‌ల‌కు సాక్ష్యంగా ఉంది. ఈ కార‌ణంగా ది గేట్ వే ఆఫ్ ఇండియా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది భారతదేశం వ‌ల‌స‌వాదుల పాల‌న ఉంచి స్వాతంత్య్రంవైపు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది.

ఈ చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను సందర్శించడం ద్వారా భారతదేశం స్వాతంత్య్రం కోసం చేసిన‌ పోరాటాన్ని తెలుసుకోవ‌డంతోపాటు భ‌విష్య‌త్తు త‌రాల‌తో పంచుకునే అవ‌కాశం ద‌క్కుతుంది. ఇక్క‌టి ప్ర‌తి అంగుళం కూడా ధైర్యం, తెగింపు, పోరాటాల క‌థ‌ల‌ను చెబుతుంది. అందుకే, ముంబై న‌గ‌రాన్ని సంద‌ర్శించి.. అల‌నాటి పోరాట స్ఫూర్తిని మ‌రొక్క‌సారి నెమ‌రువేసుకునేందుకు మీ జ‌ర్నీని మొద‌లుపెట్టండి.

More News

    Read more about: quit india movement news
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+