Search
  • Follow NativePlanet
Share
» » క‌ల్కా టూ సిమ్లాకు టాయ్ ట్రైన్ ప్ర‌యాణపు అనుభ‌వాలు

క‌ల్కా టూ సిమ్లాకు టాయ్ ట్రైన్ ప్ర‌యాణపు అనుభ‌వాలు

క‌ల్కా టూ సిమ్లాకు టాయ్ ట్రైన్ ప్ర‌యాణపు అనుభ‌వాలు

స‌ర‌దాగా మా వాళ్లు కులు - మనాలి వెళదామన్నారు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ప్ర‌దేశంలో విహారం అంటే ఎవ‌రు కాదంటారు చెప్పండి. అందుకే మా ప్ర‌యాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అయితే, కొద్దిసేపట్లోనే మా సంతోషం కాస్తా ఆవిరైంది. అంత తక్కువ సమయంలో ట్రైన్, హోటల్ బుక్ చేసుకోవడం కుదరలేదు. అయితే, ఎలాగైనా వెళ్లాలనుకున్నాం. దీంతో మా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మిత్రుల‌ను అన్వేషించ‌డం మొద‌లుపెట్టాం. మా అన్వేష‌ణ‌ ఫ‌లించింది. మా కొలిగ్ మాకు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. వాళ్లు కూడా ఈ ట్రిప్‌లో మాతోపాటు మ‌ధ్య‌లో జాయిన్ అవుతామ‌న్నారు. దీంతో మా ప్ర‌యాణం మొద‌లైంది. ట్రైన్ టికెట్లతోపాటు సిమ్లాలోని హోటల్ రిజర్వేషన్ చేయించుకున్నాం. మేం క‌ల్కా నుంచి సిమ్లా వ‌ర‌కూ టాయ్ ట్రైన్‌లో చేసిన ప్ర‌యాణ‌పు విశేషాలు మీకోసం!

మొత్తం ఐదు రోజులు మా టూర్‌. ఇందులో విడిది కులు - మనాలి మధ్యలో ఓ నది దగ్గర ఉంటుంది. అక్కడే కులు మనాలి పక్కనే ఉన్న సుందరమైన ప్రాంతాల్ని వీక్షించాలి. కానీ, ఈ క్యాంప్‌ను మేం ఇంకా ఎక్కువరోజులు పెంచుకోవాలనుకున్నాం. అందుకనీ, ముందుగా సిమ్లా అంతా చుట్టేసి తర్వాత వారు చెప్పిన తేదీకి వారితోపాటు క్యాంప్ లో పాల్గొనాలని అనుకున్నాం. వెంటనే అన్నీ సిద్ధం చేసుకుని ముందుగా అనుకున్న రోజునే బయలుదేరాం.

పిల్లల కేరింతల సాక్షిగా..!

పిల్లల కేరింతల సాక్షిగా..!

ముందుగా మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ నుంచి అంబలాకు చేరుకోవడానికి ట్రైన్‌లో బ‌య‌లుదేరాం. సాయంత్రం ఆరు గంటలకు మా ప్రయాణం మొదలు పెట్టాం. అలా రైల్వేస్టేషన్‌కు వెళ్లి కూర్చోగానే రైలు వచ్చింది. మా పిల్లలెంతో సంతోషంగా 'మమ్మీ, ట్రైన్ వచ్చింది.. మమ్మీ ట్రైన్ వచ్చింది' అంటూ కేరింతలు కొట్టసాగారు. ఎక్కడికైనా ప్రయాణమంటే పిల్లల హడావిడే ఎక్కువగా ఉంటుంది కదా! ట్రైన్ ఎక్కాం.

పిల్లలు కొద్దిసేపు అలా అటూ ఇటూ తిరిగారు. ఇక అలసిపోయి పడుకున్నారు. మేం అలా ఓ కునుకు తీశాం. ఉదయం 8 గంటలకు అంబలా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం. ఇక్కడి నుంచి మేం కాల్కా వెళ్లాలి. అక్కడి నుంచి కాల్కా సిమ్లా టాయ్ ట్రైన్‌లో వెళ్లాలి. అంబాలాలో రెండు గంటలు వేచిచూసిన తర్వాత ట్రైన్ వచ్చింది.

బోర్ కొట్టని ప్రయాణం

బోర్ కొట్టని ప్రయాణం

హిమాలయాలు చూడ్డానికి పిల్లల‌తో క‌లిసి మేం ఎంత సంతోషంగా ఉన్నామో, ఈ ట్రైన్‌లో వెళ్తున్నందుకు అంత‌కంటే ఎక్కువ‌ సంతోషంగా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ట్రైన్ గురించి, ఈ రూట్ గురించి వింటూనే ఉన్నాం. ఇప్పటికి ఈ ట్రైన్‌లో ప్రయాణించే అవకాశం దొరికింది. ఈ ట్రైన్ ఒక సొరంగ మార్గం గుండా వెళుతుంది. అందుకోసమే మేం పిల్లలతో స‌హా ఆసక్తిగా ఎదురుచూశాం. ఈ సొరంగ మార్గం కిలోమీటరు మేర ఉంటుంది. చుట్టూ పచ్చని పర్వతాలు, మధ్యలో ట్రైన్ సఫారీ భలేగుంది. ఎటుచూసినా అల్పైన్‌ వృక్షాలే కనిపించాయి. అలా ముందుకు వెళుతూనే పొదలు, మధ్యమధ్యలో పైన్ వృక్షాలు పలకరించాయి.

ప్రయాణం ఎక్కువ సమయం అయినా, ఎక్కడా బోర్ కొట్టకుండా ట్రైన్ లో నుంచే చూసి ఆనందించ‌గ‌ల ఎన్నో అద్భుత‌మైన ప్రాంతాలు క‌నిపించాయి. సిమ్లా కంటే ముందు కొన్నికిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల వైపుగా వెళ్తుంది ఈ రైలు.

తాబేలు నడక.. ప్రయాణం

తాబేలు నడక.. ప్రయాణం

పర్వతాల మధ్యలో ఉన్న ఈ మార్గం గుండా ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి రైలు ప్రయాణం చేయాల్సిందే. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే సాగే ఈ రైలు ప్రయాణంలో హిమాలయాలకు ముందుగా వచ్చే పర్వతాలను అతి దగ్గరనుంచి చూడొచ్చు. ఈ ట్రైన్ కాల్కా నుంచి షిమ్లా వరకూ 96 కిలోమీటర్లు ఉంటుంది. ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. ట్యాక్సీ, బస్సులో వెళితే మూడుగంటల్లో సిమ్లా వెళ్లొచ్చు. కానీ, ఈ ప్రాంతం చూడ్డానికి వచ్చే చాలామంది ఈ ట్రైన్ ప్రయాణించాలనే అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారో మాకు అర్థమైంది. ఇది ఐదు పెట్టెల చిన్న కారు ట్రైన్‌లా ఉంటుంది. ఇందులో అద్దాల్లా పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. వీటిని ప్ర‌త్యేకంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని చూసే విధంగా అమర్చారు.

మొదటిసారి ఆ పర్వతాల మధ్యలో ప్రయాణిస్తున్నాం. వాటిని చూడగానే ఆ పర్వతాల ఎక్కడినుంచి మొదలయ్యాయో, ఎక్కడ ముగిసిపోయాయో అర్ధం కాలేదు. చల్లని ప్రాంతం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూశాం. ఎందుకంటే, కాల్కా వరకూ భూమి సమతలంగానే ఉంది.

మొదలైంది అసలు మజా!

మొదలైంది అసలు మజా!

ట్రైన్ కాల్కా స్టేషన్ నుంచి దాటి నగరం వైపు పరుగులు పెట్టింది. పర్వతాలు కాల్కా నగరం నుంచి మొదలవుతాయని అర్థమైంది. కాల్కా దాటగానే చల్లని ప్రాంతం మొదలయ్యింది. అంతవరకూ ఎక్కడో ఉన్న పిల్లలు ఒక్కసారిగా మా దగ్గరికొచ్చి అరవడం మొదలెట్టారు. చల్లగా ఉందని కేరింతలు పెట్టారు. సిమ్లా వచ్చేశామన్న భ్రమలో ఉన్నారు పిల్లలు. కాల్కా దాటగానే, ట్రైన్ ఎత్తయిన ప్రాంతం మీద వెళ్తుంది. పైకి కిందకి ఎక్కుతూ, దిగుతూ అన్నట్లుగా ట్రైన్ ప్రయాణం సాగింది. పిల్లలు జెయింట్విల్ ఎక్కినంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. మనసులో ఎంతో సంతోషంగా అనిపించింది. ఎందుకంటే, హిమాలయాల్లో ఉన్నామన్నంతగా చలి మమ్మల్ని చుట్టేసింది. చిన్న బొమ్మలా ఉండే ట్రైన్ సఫారీ, ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని పిల్లగాలులు, అందమైన లోయలు, వంకరగా ఉండే ట్రెక్, ప్రతి రెండునిమిషాలకు ఒక్కసారి వచ్చే సొరంగ మార్గాలు, చిన్న చిన్న సరస్సులు, ఇతర రైల్వేస్టేషన్లకంటే విభిన్నంగా ఆకర్షణీయమైన డిజైన్లతో ఉన్న స్టేషన్‌లు ఎదురయ్యాయి.

ఇవన్నీ చూడగానే ఇది కలా? నిజమా? అన్న భ్రమలో ఉన్నాం. మేమే కాదు. ఈ ట్రైన్‌లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ అదే అనుభూతిని పొందుతున్నారని అనిపించింది. ప్రతి దృశ్యాన్ని అందరూ వారి వారి కెమెరాలలో బంధించారు. ఫోటోగ్రాఫ‌ర్స్‌కు ఇక్కడ ఏకంగా ఓ క్యూ ఉందనే చెప్పాలి. ఇంకా సిమ్లా చాలా దూరం ఉంది. ఇక్కడే ఇంత అద్భుతంగా, అందంగా ఉంటే, ఇక సిమ్లాలో ఎలా ఉంటుందా అనిపించింది. ఇంత అందమైన అనుభూతిని ఆస్వాదిస్తూనే సాయంత్రం ఆరు గంటలకు సిమ్లా రైల్వేస్టేషన్ చేరుకున్నాం.

More News

Read more about: kullu manali
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+