వరలక్ష్మి వ్రతం ఒక హిందూ ఆచారం. సాధారణంగా శ్రావమాసం శుక్లపక్షంలో పూర్ణమికి ముందురోజు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. వరలక్ష్మి (లక్ష్మి దేవత) విష్ణుమూర్తి భార్య. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మి దేవి ని భక్తులు కొలుస్తారు. హిందూ మతం ప్రకారం ఈ పండగ/పూజ విశిష్టమైనది. దీపావళి నాడు లక్ష్మి దేవి పూజ చేసిన అనంతరం టపాసులు పేల్చడం మీకు విదితమే!
వరలక్ష్మి వ్రతాన్ని కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని స్త్రీలు అధికంగా జరుపుకుంటారు. ఆరోజున దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున, దేశంలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మిదేవి ఆలయాలను ఒకసారి పరిశిలిస్తే ..

లక్ష్మి నారాయణ ఆలయం (బిర్లామందిర్), ఢిల్లీ
ఢిల్లీ లోని బిర్లా మందిర్ ను ప్రముఖ వ్యాపారవేత్త బి. ఆర్. బిర్లా మరియు విజయ్ త్యాగి క్రీ. శ. 1939 లో నిర్మించి, లక్ష్మిదేవి మరియు విష్ణుమూర్తి కి అంకితం చేశారు. కృష్ణాష్టమి, దీపావళి పర్వదినాల నాడు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఆలయ కాంప్లెక్స్ లో శివ, వినాయక, అంజనేయస్వామి, బుద్ధ మరియు దుర్గా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి.
చిత్ర కృప : Ashishbhatnagar72

శ్రీపురం గోల్డెన్ టెంపుల్, వేలూరు
శ్రీపురం గోల్డెన్ టెంపుల్ తమిళనాడు లోని వేలూరు లో కలదు. లక్ష్మి దేవత కు అంకితం ఇవ్వబడిన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం లోపల, బయట బంగారు పూతతో అలంకరించబడి ఉటుంది. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలి.
చిత్ర కృప : Ag1707

మహాలక్ష్మి ఆలయం, కొల్హాపూర్
మహారాష్ట్ర లోని కొల్హాపూర్ పట్టణం శ్రీ మహాలక్ష్మి దేవాలయానికి ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మహాలక్ష్మిని భక్తులు అంబా బాయి గా కొలుస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్య కిరణాలు ప్రతి రోజూ దేవతా విగ్రహాన్నీ తాకుతాయి. యేటా లక్షల సంఖ్యలో భక్తులు అంబాదేవి దర్శనానికి వస్తుంటారు.
చిత్ర కృప : tanny

అష్టలక్ష్మి ఆలయం, చెన్నై
చెన్నై మహానగరంలో అష్టలక్ష్మి దేవాలయం లక్ష్మి దేవత కు అంకితం చేయబడింది. ఆలయంలో లక్ష్మి దేవి యొక్క 8 అవతారాలను పూజిస్తారు. గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది. పురాణాల ప్రకారం, సంపద, ఆరోగ్యం, జ్ఞానం, సంతానం, శక్తి, బలం, శ్రేయస్సు కు దేవత లక్ష్మి దేవి.
చిత్ర కృప : Sudharsun.j

లక్ష్మి దేవి ఆలయం, హస్సన్
కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డగద్దవళ్లిలో ఉన్న లక్ష్మిదేవి ఆలయం హొయసల కాలం నాటిది. హొయసల వంశీయులు నిర్మించిన ఆధునిక కట్టడాలతో ఇది ఒకటి. వారి చివరి దశకంలో దీనిని నిర్మించినారు. ఆలయ కాంప్లెక్స్ లో అనేక దేవతల, దేవుళ్ళ మందిరాలు కూడా ఉన్నాయి.
చిత్ర కృప : Dineshkannambadi

మహాలక్ష్మి ఆలయం, ముంబై
ముంబై లోని మహాలక్ష్మి దేవాలయం, లక్ష్మి దేవత కు అంకితం చేయబడిన ఆలయం. అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న మహాలక్ష్మి దేవతను దర్శించటానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో లక్ష్మి దేవి, మహాకాళి, సరస్వతి దేవి విగ్రహాలు కొలువుండటం విశేషం.
చిత్ర కృప : Suyogaerospace



Click it and Unblock the Notifications











