Search
  • Follow NativePlanet
Share
» »మొర్బి- అద్భుతమైన హాంగింగ్ వంతెన !!

మొర్బి- అద్భుతమైన హాంగింగ్ వంతెన !!

మొర్భి దాని వ్రేలాడే వంతెనకు మరియు గుజరాత్ సంప్రదాయానికి ప్రసిద్ధి. ఇది మచ్చు నది ఒడ్డున కలదు. వంతెన పూర్తిగా యూరోపియన్ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది.

By Mohammad

ప్రదేశం : మొర్బి

రాష్ట్రం : గుజరాత్

జిల్లా : మొర్బి

ప్రసిద్ధ ఆకర్షణ : మణి మందిర్, వ్రేలాడే వంతెన

మొర్భి దాని వ్రేలాడే వంతెనకు మరియు గుజరాత్ సంప్రదాయానికి ప్రసిద్ధి. ఇది మచ్చు నది ఒడ్డున కలదు. వంతెన పూర్తిగా యూరోపియన్ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది. బ్రిటీష్ వారు దీనిని నిర్మించారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ వేలాడే వంతెన ఆ యుగం యొక్క సాంకేతిక అభివృద్దికి ఒక మంచి ఉదాహరణ. నగరంలో మూడు గేట్లు ఉన్నాయి, మరియు నగరం యొక్క ప్రణాళికా రచన యూరోపియన్ శైలి అనుకరించే చేయబడింది.కుడి వంతెనపై దర్బార్గఢ్ లేదా ఓల్డ్ ప్యాలెస్ ముందు అందంగా చెక్కిన గేట్ ఉంది. ప్రస్తుతం ఓల్డ్ ప్యాలెస్ ను ఒక హెరిటేజ్ హోటల్ గా మార్చారు.

మొర్బి

చిత్రకృప : Telugu native planet

ఇక్కడ ఒక హిందూ మత దేవాలయం మణి మందిర్ ఉంది. ఈ దేవాలయంలో లక్ష్మీ నారాయణ, మహాకాళి, రామ చంద్ర జి, రాధా కృష్ణ మరియు శివ విగ్రహాలను పూజిస్తారు. ఈ దేవాలయం జైపూర్ రాళ్ళతో నిర్మించి మరియు రాజస్థానీ శైలిలో అనేక శిల్పాలు ఉన్నాయి. వెల్లింగ్టన్ సచివాలయం కూడా దాని నిర్మాణంలో రాజస్థానీ శైలి ప్రభావం కలిగి ఉన్నది. యూరోప్ యొక్క ఆర్ట్ డెకో ఉద్యమం ప్రభావం ప్రతిబింబించే ఆర్ట్ డెకో ప్యాలెస్ ఉంది.

ఆర్ట్ డెకో ప్యాలెస్

దీనిని 1931 లో నిర్మించారు. ప్యాలెస్ లోపలి భాగాలు ఎంతో సుందరంగా అలంకరించబడి ఉంటాయి.

మణి మందిర్

మొర్బిలో సందర్శించటానికి ఉత్తమమైన ఆకర్షణలలో మణి మందిర్ ఒకటి. ఈ బహుళ మత సంబంధమైన దేవాలయంను మొర్బి రాజు తన భార్య అయిన మహారాణి మణి బెన్ గుర్తుగా నిర్మించేను.

మొర్బి

చిత్రకృప : Camaal Mustafa Sikan...

గొలుసు వంతెన

ఇంజనీరింగ్ అధ్బుతం నకు గొప్ప నమునాగా ఉన్న గొలుసు వంతెన విక్టోరియన్ లండన్లో కూడా ఉంది. కానీ మీరు గుజరాత్ సందర్శించినప్పుడు తప్పకుండా మొర్బి నగరంలో ఉన్న గొలుసు వంతెన ను చుడండి.

వెల్లింగ్టన్ సెక్రటేరియట్

ఇది దాని శిల్ప శైలికి ప్రసిద్ధి చెందినది. ఈ శైలీప శైలిలో రాజస్థాన్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది.

మొర్బి సమీప సందర్శనీయ స్థలాలు

టంకార - దయానంద సరస్వతి జన్మస్థలం, రానాఫ్ కుచ్ వన్యప్రాణి అభయారణ్యం, శక్తి మా మందిర్, రామ్ చరిత మానస్ మందిర్, దిగంబర జైన మందిర్, ప్రీతం లేక్, వాసుకి ఆలయం, సర్నేశ్వర్ టెంపుల్, హనుమాన్ గుడి, లాల్ మందిర్, బాగేశ్వరి మందిర్, శ్రీ స్వామి నారాయణ మందిర్ మొదలగునవి.

మొర్బి

చిత్రకృప : Camaal Mustafa Sikan...

వసతి

మొర్బి లో వసతి సౌకర్యాలు కలవు. ఇక్కడి వచ్చే పర్యాటకులను ఆకర్షించటానికి త్రి స్టార్ హోటళ్ళు, రిసార్టులు అనేకం ఉన్నాయి. వంటల రుచులను ఆస్వాదించేందుకు చక్కటి రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.

మొర్బి ఎలా చేరుకోవాలి ?

మొర్బి చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు ఉన్నాయి.

వాయు మార్గం : 65 కి. మీ ల దూరంలో రాజ్ కోట్ విమానాశ్రయం కలదు. ఇక్కడికి అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, నాగపూర్, జైపూర్ తదితర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి. పర్యాటకులు ఎయిర్ పోర్ట్ లో దిగి, అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో మొర్బి చేరుకోవచ్చు.

రైలు మార్గం : మొర్బి కి వంకనేర్ జంక్షన్ సమీపాన ఉన్నది. ఇది 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వంకనేర్ రైల్వే స్టేషన్ లో ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాల వచ్చే రైళ్ళు ఆగుతాయి.

బస్సు మార్గం : గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుండి, నగరాల నుండి రాష్ట్ర సర్వీస్ బస్సులు, ప్రవేట్ బస్సులు ఎక్కి మొర్బి చేరుకోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+