Search
  • Follow NativePlanet
Share
» »కోటీశ్వరులు కావాలా? ఇక్కడకు వెళ్లండి మీది ఈ నక్షత్రమైతేనే ప్రయోజనం

కోటీశ్వరులు కావాలా? ఇక్కడకు వెళ్లండి మీది ఈ నక్షత్రమైతేనే ప్రయోజనం

తంజావూర్ చుట్టు పక్కల చూడదగిన దేవాలయాలకు సంబంధించిన కథనం.

బోలెడు డబ్బు సంపాదించాలి, కోటాధిపతులు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే సక్రమ మార్గంలో కోటాధిపతులు కావడం అంత సులభం కాదు. అయితే తమిళనాడులోని ఓ మూడు దేవాలయాలను సందర్శిస్తే కోటాధిపతులు అవుతారని చెబుతారు. అయితే మీరు పలానా నక్షత్రంలోనే జన్మించి ఉండాలి. ఆ నక్షత్రాలు ఏవి? ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడికి ఎలా చేరుకోవాలి తదితర వివరాలన్నీ మీ కోసం...

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

జ్యోతిష్యాస్త్రంలో నమ్మకం ఉన్నవారు జన్మదినం, జన్మనక్షత్రం, పుట్టిన సమయం తదితర విషయాల పై కూడా అపార నమ్మకం ఉంటుంది. దీంతో తమ జీవితంలో జరిగే మంచి, చెడుకు ఆ నక్షత్రాలు, రాసులు, జాతకం ప్రధాన కారణమని నమ్ముతారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

భారతీయ జ్యోతిష్యాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు ఉన్నాయి. అందులో మూడు నక్షత్రాలకు చెందిన వారు తప్పక గొప్పధనవంతులవుతారని చెబుతారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

అయితే వారు ఓ మూడు దేవాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. తిరుతురైపూండి తమిళనాడులోని తిరువరూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం. మరుండేశ్వర దేవాలయం ఇక్కడ చాలా ప్రాచీనమైనది.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

ఈ దేవాలయం అశ్వినీ నక్షత్రాన్ని ప్రతిబింబిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడకు ఎక్కవగా అశ్వినీ నక్షత్రానికి చెందిన భక్తులు వస్తుంటారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

తమ కష్టాలన్నీ తీర్చాలని అశ్వినీ నక్షత్రానికి చెందిన వారు ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరూ సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకూ తెరిచి ఉంటుంది.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

మూడు పూటల స్వామివారికి పూజలు ఉంటాయి. ఇక ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. వివాహం, సంతానభాగ్యం, విద్యాభ్యాసం, ఉద్యోగానికి సంబంధించినవి తదితర సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని భక్తుల నమ్మకం.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

ముఖ్యంగా స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పిస్తే ఆ స్వామి కరుణ కటాక్షం మనకు లభించి త్వరగా సంపన్నవంతులు అవుతారని నమ్ముతారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

తంజావూరు జిల్లా తిరుకుండేవావవాడిలో కార్కాడేశ్వర దేవాలయం ఉంది. ఆశ్లేష నక్షత్రానికి చెందిన వారు ఇక్కడికి ఎక్కువగా వచ్చి పూజలు చేస్తుంటారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

ఆశ్లేష నక్షత్రానికి చెందిన వారు ఇక్కడికి వచ్చి పూజలు చేయడం వల్ల ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతారు. వ్యాపారాభివ`ద్ధి జరుగుతుందని నమ్ముతారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో మహాశివరాత్రి, నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో జరిగే తిరుకార్తికై ఉత్సవం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రధాన దైవం వినాయకుడు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

అందువల్ల ఈ వినాయకుడిని కార్కడ వినాయక అని అంటారు. తమ ఇంటిలో గ్రహ దోషాల నివారణకు ఇక్కడ కార్కాడేశ్వరుడికి తైలాభిషేకం నిర్వహిస్తారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

అంతేకాకుండా తమకు ఉన్న చర్మవ్యాధుల నివారణకు ఈ తైలాన్ని ఒంటికి పూసుకొంటారు. అంతేకాకుండా ఈ నూనెను తాగుతారు. ఇక అనూరాధ నక్షత్రానికి చెందినవారు తిరునిండ్రేయూరులోని మహాలక్ష్మీశ్వర్ దేవస్థానానికి ఎక్కువగా వెలుతూ ఉంటారు.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

ఇక్కడ ఉన్నది స్వయంభువుడైన శివుడు, ఇక్కడ మహాలక్ష్మికి కూడా ఉపాలయం ఉంది. జూన్-జులై నెలల్లో తిరుమాంజనమ్, మహాశివరాత్రి , తిరుకార్తికై ఉత్సవాలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి.

ఆ మూడు నక్షత్రరాసుల వారు

ఆ మూడు నక్షత్రరాసుల వారు

P.C: You Tube

ఇక్కడ ఉన్న వినాయకుడిని సెల్వ గణపతి అని అంటారు. అనురాధ నక్షత్రానికి చెందిన వారు ఈ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అనురాధ నక్షత్రంవారు పూజలు చేయడం వల్ల వారికి కాలం కలిసి వచ్చి త్వరగా కోటాధిపతులు అవుతారని భక్తులు నమ్ముతారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+