Search
  • Follow NativePlanet
Share
» »అస్సాంలోని అత్యంత పొడవైన వంతెన ప్ర‌త్యేక‌త‌లు మీకోసం...

అస్సాంలోని అత్యంత పొడవైన వంతెన ప్ర‌త్యేక‌త‌లు మీకోసం...

ఆసియాలోనే అత్యంత పొడవైన వంతెన మ‌న భార‌త‌దేశంలోనే ఉంద‌ని అతి కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. ఈ వంతెన అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలను కలుపుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 9.15 కిలోమీటర్లు కాగా, 182 స్తంభాలపై ఈ వంతెన ఉంటుంది. ఇది భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతి పొడవైన వంతెనగా పేరుగాంచింది. ఈ వంతెన తూర్పు భారతదేశంలో ఉంది. ఈ వంతెనను ధోలా ​​సదియా లేదా భూపేన్ హజారికా సేతు అంటారు.

భార‌త‌దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు పేరుగాంచింది. అస్సాం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు సుమారు 9.15 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఈ వంతెనను రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించేందుకు కూడా నిర్మించారు. ఈ వంతెన 60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేంత‌ పటిష్టంగా ఉంటుంది. ఇది బాంద్రా వర్లీ సీ లింక్ కంటే 30 శాతం ఎక్కువ. అంతేకాదు, వంతెన ప్రపంచంలోని పొడవైన వంతెనల జాబితాలో కూడా చేర్చబడింది. ఇక‌, మార్గం ద్వారా, అయితే, ప్రపంచంలోని పొడవైన వంతెన చైనాలో ఉన్న డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్.

assamseconfdlargest

దోలా సాదియా వంతెన‌గా పిలుస్తారు..

ఈ వంతెనను పూర్తిగా స్తంభాలపై నిర్మించారు. 'భూపేన్‌ హజారికా సేతు' అస్సాంలోని ఉత్తర ప్రాంతాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని కలుపుతుంది. ఇది తిన్‌సుకియా జిల్లాలో దక్షిణాన ఉన్న ధొలా నుంచి ఉత్తరాన ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై నిర్మించడంతో దీనిని ధొలా సాదియా వంతెన అని పిలుస్తుంటారు. టిబెట్‌లో పుట్టి అరుణాచల్‌లో అడుగుపెట్టే లోహిత్‌ నది అస్సాంలోని బ్రహ్మపుత్ర న‌దిలో కలుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్ర‌కృతి అందాల‌ను వీక్షించాలనుకునే పర్యాటకులు ఈ వంతెన మీదుగా ప్ర‌యాణం చేయొచ్చు.

కోర్కెలు తీర్చే బెల్ టెంపుల్‌...

అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలోనూ పలు పర్యాటక విశేషాలు దాగి ఉన్నాయి. తిన్‌సుకియాకి 17 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బెల్ టెంపుల్ ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. ఈ బెల్‌ టెంపుల్‌లో శివుడికి ఒక గంట బహూకరిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయన్నది ఇక్క‌డికి వ‌చ్చే భక్తుల న‌మ్మ‌కం. ఈ ఆల‌య ప్రాంగ‌ణంలో ఒక పెద్ద మ‌ర్రి చెట్టు ఉంటుంది. ఆ మ‌ర్రి చెట్టుకు ఒక గంట‌ను క‌ట్టి కోర్కేలు విన్నవించుకుంటే అవి తీరుతాయ‌ని ఇక్క‌డివారు చెబుతున్నారు. అలా, ఈ ఆలయానికి బెల్‌ టెంపుల్ అనే పేరు వచ్చింది.

2017లో ఈ వంతెన పూర్త‌య్యింది...

భూపేన్‌ హజారికా సేతును హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ నిర్మించ‌డం జ‌రిగింది. 2011 నవంబరులో ఈ వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. 2017లో దీనిని పూర్తిచేశారు. దాదాపు రూ.1,000 కోట్లు ఈ వంతెన నిర్మాణానికి వెచ్చించారు. అస్సాంకి చెందిన కవి, రచయిత, సంగీతకారుడు, నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, భారత రత్న భూపేన్‌ హజారికా పేరును ఈ వంతెనకు పెట్ట‌డం జ‌రిగింది. భూకంపాలను కూడా ఈ వంతెన తట్టుకోగలదు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+