Search
  • Follow NativePlanet
Share
» »పాండిచ్చేరిలో త‌ప్ప‌క వెళ్లాల్సిన ఐదు అరుదైన కేఫ్‌లు..

పాండిచ్చేరిలో త‌ప్ప‌క వెళ్లాల్సిన ఐదు అరుదైన కేఫ్‌లు..

పాండిచ్చేరి.. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల‌లో ఒక‌టి. సహజమైన తీర ప్రాంతపు అందాలతోపాటు ఇక్క‌డి ఫ్రెంచ్ కాలనీలు సంద‌ర్శ‌కుల మ‌న‌సు దోచేస్తాయి. ఈ నగరం ఆహ్లాద‌క‌ర‌మైన వాతావరణంతో కూడిన అనేక‌ కేఫ్‌లకు కూడా ప్రసిద్ది చెందింది. మీరు స్థానిక ఆహారపు రుచుల‌ను ఆస్వాదిస్తూ.. ప్ర‌శాంత‌త‌ను అనుభవించాలనుకుంటే మాత్రం ఈ కేఫ్‌లు గొప్ప ఎంపిక. అందుకే ఇక్క‌డి బీచ్‌లు మరియు ఈ కేఫ్‌లను సందర్శించకుండా వెనుదిరిగితే మాత్రం మీ పర్యటన అసంపూర్తిగా మిగిలిపోతుంది. పాండిచ్చేరిలో ప‌ర్యాట‌కులు ఇష్టపడే ఐదు అద్భుతమైన కేఫ్‌లు ఒక్క‌సారి చూద్దాం.

coromandelcafe

కోరమాండల్ కేఫ్

కాంటినెంటల్ నుండి ఇటాలియన్ వరకు ముచ్చ‌ట‌గొలిపే ఇంటీరియర్స్ ఇక్క‌డి కోర‌మాండ‌ల్ కేఫ్ సొంతం. అరుదైన రుచుల‌తో కూడిన‌ మెనూ వెరైటీల‌కు ఈ కేఫ్‌ ప్రసిద్ధి చెందింది. కోరమాండల్ కేఫ్ దాని ఇంటీరియర్స్ మరియు ఫుడ్ రెండింటికీ సందర్శకులు అత్యధికంగా రేటింగ్ ఇస్తూ ఉంటారు. పట్టణం నడిబొడ్డున నెలకొని ఉన్న ఈ కేఫ్‌లో ఇండోర్, అవుట్‌డోర్ సీటింగ్‌తో పాటు నిశ్శబ్ద వాతావ‌ర‌ణంలో కూర్చొని సమయం గ‌డ‌ప‌డానికి ప్ర‌త్యేకమైన రీడింగ్ స్టాట్‌ను కేటాయించారు. ఎగ్ బెనెడిక్ట్, జంబో ప్రాన్స్, క్యారెట్ కేక్, పోర్క్, మాక్‌టైల్ మరియు చీజ్‌కేక్ ఈ కేఫ్‌లోని కొన్ని ప్రసిద్ధ వంటకాలుగా చెప్పొచ్చు. అదనంగా, ఈ ప్రదేశం కొన్ని అద్భుతమైన శాకాహార వంట‌కాల‌కు పేరుగాంచింది.

కేఫ్ డెస్ ఆర్ట్స్

పురాతన కళలకు కేఫ్ డెస్ ఆర్ట్స్ అలంక‌ర‌ణ‌ చిరునామాగా నిలుస్తుంది. అవుట్ డోర్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కేఫ్ గార్డెన్‌ సీటింగ్‌లో పాతకాలపు అలంకరణ చూప‌రుల మ‌న‌సు క‌ట్టిప‌డేస్తుంది. పసుపు రంగు గోడల పెయింటింగ్‌తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే 19వ శతాబ్దపు భవనం నోరూరించే ఫ్రెంచ్ ఆహారాన్ని అందించడానికి ఆహ్వానం ప‌లుకుతుంది. నుటెల్లా పాన్‌కేక్‌లు, బనానా నుటెల్లా క్రేప్, బాగ్యుట్ శాండ్‌విచ్‌లు, వాఫ్ఫల్స్, ఫ్రెంచ్ బ్రేక్‌ఫాస్ట్ కేఫ్ డెస్ ఆర్ట్స్‌లో అత్యధికంగా రేట్ చేయబడిన కొన్ని ఆహారాలుగా చెప్పొచ్చు.

lecafe

లే కేఫ్

సముద్రతీరంలో ఉన్న లే కేఫ్.. అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తూ రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి సరైన ప్రదేశం. ఒకప్పుడు ఈ తీరాన పోస్టాఫీసు భ‌వ‌నం ఉండేది. అయితే, 1952లో తుఫాను ఆ భ‌వ‌నాన్ని ధ్వంసం చేసింది. ఆ స్థానంలో లే కేఫ్ స్థాపించబడింది. అందుకే ఈ కేఫ్‌లో అడుగుపెడితే ఏదో తెలియ‌న పురాతన‌ అనుభ‌వం తార‌స‌ప‌డుతుంది. దీనికి ఉన్న పురాత‌న‌ నేప‌థ్యం అలాంటిది మరి. ఈ కేఫ్‌ నోరూరించే శాండ్‌విచ్‌లను అందిస్తుంది. ఎస్ప్రెస్సో వెజ్జీ డిలైట్, చీజ్ వెజ్ శాండ్‌విచ్ మరియు మోచా కాఫీ వంటి కొన్ని ఇతర ప్రసిద్ధ వంటకాల‌ను ఇక్క‌డ రుచి చూడ‌వ‌చ్చు.

రూఫ్‌టాప్ యాంబియన్స్ కేఫ్‌

లైవ్ మ్యూజిక్, మంచి ఇంటీరియర్స్‌తో రూఫ్‌టాప్ యాంబియన్స్ కేఫ్ మంగళూరు, గోవాన్ మరియు ఇటాలియన్ వంటకాలను అందిస్తుంది. ఎక్కువగా హనీ చిల్లీ ఫ్రైస్, పోర్క్ రిబ్స్, జంబో ప్రాన్స్ మ‌రియు పీతలకు ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డికి వ‌చ్చే సందర్శకులు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో తీర‌పు అందాల‌ను ఆస్వాదిస్తూ రెడ్ వైన్ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక్క‌డి రుచికరమైన వంట‌కాలు సేంద్రీయ, స్థానికంగా లభించే పదార్ధాలతో తాజాగా తయారు చేయ‌బ‌డ‌తాయి.

breadandchocolatecafe , Pondicherry

బ్రెడ్ అండ్‌ చాక్లెట్ కేఫ్‌

ఆరోవిల్ పట్టణంలో ఉన్న బ్రెండ్ అండ్ చాక్లెట్ కేఫ్ ప్రశాంతమైన వాతావరణానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా చెప్ప‌బ‌డుతోంది. రుచికరమైన కాఫీ, ప్రత్యేకమైన డెజర్ట్‌లు మరియు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ, చమోమిలే టీ, ఫ్రూట్ బౌల్, యాపిల్ టార్ట్, సోర్డోఫ్ బ్రెడ్ మరియు సిన్నమోన్ రోల్స్ వంటి ప్రసిద్ధ వంటకాలు ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి. కేఫ్ చెక్క ఫర్నిచర్ మరియు ప్రకాశవంతమైన సహజ లైటింగ్‌తో పర్యాటకులను మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది. శాఖాహార‌, మంసాహార వంట‌కాలకు ప్రత్యేకం విభాగాలు కేటాయించ‌బ‌డ్డాయి

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+