హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌కు మీరూ సిద్ధమవ్వండి!
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందింది. కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అయిన ఈ రైడ్ మనదేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ హాట్ ఎయిర్ బెలూన్‌లో కూర్చుని భూమి, ఆకాశం యొక్క అందమైన దృశ్యాలను మనసారా ఆస్వాదించవచ్చు. ఇటీవల కాలంలో పర్యాటకులలో అత్యంత ప్రాచుర్యం పొందింది రైడ్‌గా పేరుపొందింది ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్. మీరు కూడా ఈ రైడ్‌ను ఆస్వాదించాలి అనుకుంటే భారతదేశంలోని ఈ ప్రసిద్ధ ప్రదేశాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
హాట్ ఎయిర్ బెలూన్‌లో కూర్చుని భూమి యొక్క అందమైన దృశ్యాలను చూడటం చాలా ఆహ్లాదకరమైన అనుభూతి. మీరు ఈ బెలూన్‌లో కూర్చొని గాలిలో ఎగురుతున్నప్పుడు ఆ క్షణాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే. ఇది పర్యాటకులకు అత్యంత ఉత్తేజకరమైన సాహస క్రీడల్లో ఒకటిగా చెప్పొచ్చు. మీరు ప్రయాణంలో సాహసాలను ఇష్టపడితే, ఖచ్చితంగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేయండి.

జైపూర్
నిత్యం జైపూర్‌ని సందర్శించడానికి భారతదేశంతోపాటు విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారని మనకు తెలుసు. చారిత్రక కట్టడాలు మరియు కోటలు కాకుండా, మీరు ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించే అవకాశం కూడా ఉంది. గాలిలో ఎగురుతూ ఎడారి నగరపు అందాలను ఆస్వాదిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీరు జైపూర్ సందర్శించడానికి వెళితే, అంబర్ ఫోర్ట్ నుండి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌కు వెళ్లడం అస్సులు మర్చిపోవద్దు.

మహారాష్ట్ర
మహారాష్ట్రలోనూ హాట్ ఎయిర్ బెలూన్‌ను ఆస్వాదించవచ్చు. ముంబై నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనావాలా సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అందుబాటులో ఉంది. మీరు బెలూన్ రైడ్ చేయడం ద్వారా లోనావాలా చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి అందాలను ఆకాశంలో విహరిస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ రైడ్‌లో ప్రకృతి దృశ్యాలు ఎంతగానో కనువిందు చేస్తాయి.

ఢిల్లీ
ఢిల్లీలో సందర్శించడానికి పర్యాటక ప్రదేశాలకు కొదవే లేదు. అడుగడుగునా చారిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అయితే, ఢిల్లీని సందర్శించేటప్పుడు మీరు హాట్ ఎయిర్ బెలూన్ సాహసాన్ని ఆస్వాదించవచ్చు. దీని కోసం, మీరు ఢిల్లీకి ఆనుకుని ఉన్న మనేసర్, సోహ్నా గ్రామం మరియు దామ్‌దామా సరస్సు చుట్టూ పర్యటించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాలలో బెలూన్ రైడ్ మీకు స్వాగతం పలుకుతుంది.

గోవా
మీరు గోవాను సందర్శించబోతున్నట్లయితే, మీరు అక్కడ వాటర్ స్పోర్ట్స్‌తో పాటు హాట్ ఎయిర్ బెలూన్‌ను ఆస్వాదించవచ్చు. తీరపు అందాలను ఆస్వాదిస్తూ చేసే ఈ గగన వివాహరం జివితంలో మర్చిపోలేని మదురమైన క్షణాలను చేరవచేస్తుంది. ఇక్కడి దీపుల సముదాయాన్ని గూగుల్ మ్యాప్‌లో మాదిరిగా చూసేందుకు గోవా హాట్ బెలూన్ రైడ్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రైడ్ కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, ఈ రైడ్‌లో మీరు చాలా ఆనందిస్తారు

హిమాచల్ ప్రదేశ్
మీరు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కోసం మనాలికి వెళ్లవచ్చు. హిల్ స్టేషన్ వద్ద ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చు. ప్రకృతిలోని అందమైన లోయలను కనులారా వీక్షించే అవకాశం దొరకుతుంది. మంచుతో కప్పబడిన హిమాలయాలు మరియు పచ్చని లోయలు ఇక్కడ ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తాయి.



Click it and Unblock the Notifications













