రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌తో మీ భాగస్వామికి సర్‌ప్రైజ్ ఇవ్వండి
ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు. ఇలాంటి రోజున కేవలం ప్రేమికుల గురించి మాత్రమే కాకుండా ప్రేమికులు జీవితభాగస్వాములుగా మారిన జంటల గురించి, వారి వివాహ వేడుకల గమ్యస్థానాల గురించి కూడా మాట్లడుకోవాలి. అందమైన కోటలకు చిరునామా రాజస్థాన్. ఆ రాజస్థాన్‌లోని కొన్ని కోటలు సినీతారల ప్రేమ వివాహాలకు ప్రధాన ఎంపిక. ఇటీవలే జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా, సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి వేదిక గురించి మాట్లాడుకోనివారు లేరంటే నమ్మాల్సిందే. కాబట్టి ప్రేమవివాహాలకి తారల మొదటి ఎంపిక రాజస్థాన్‌లోని కొన్ని కోటలు. ఆ కోట గురించి తెలుసుకుందాం.
ఇటీవలే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా పెద్ద ఎత్తున ట్రెండింగ్‌లో నిలిచారు. అందుకు కారణం వారి వివాహం. చాలారోజుల రహస్య సంబంధం తర్వాత, ఈ జంట ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఘనంగా వివాహరం చేసుకున్నారు. రాచరికపు రీతిలో జరిగిన ఈ పెళ్లి గురించి ఇప్పటికీ ప్రజలు చర్చించుకుంటునే ఉన్నారు. పెళ్లితో పాటు ఇద్దరి పెళ్లి వేదికలు వార్తల్లో నిలిచాయి. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ అందానికి దేశ విదేశాలలో అనేక పురాతన భవనాలు సలాం కొట్టాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మీరు కూడా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో రాయల్ స్టైల్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంటే, రాజస్థాన్‌లోని ఇలాంటి కోటని ఎంపిక చేసుకుని, మీ జీవిత భగస్వామికి ప్రేమికునిగా మంచి గిఫ్ట్ ఇవ్వండి.

ఉమైద్ భవన్ ప్యాలెస్, జోధ్‌పూర్
రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ చాలా కాలంగా రాజ వివాహాలను నిర్వహిస్తోంది. ఈ కోట ప్రపంచంలోని గొప్ప విశాలమైన గదులు కలిగిన ప్యాలెస్‌లలో ఒకటి. విదేశీ హంగులు కలిగిన కొలనులు, పచ్చని తోటలు మరియు నృత్యం చేసే నెమళ్లతో ఈ ప్యాలెస్ రాచరికపు శైలిలో వివాహం చేసుకోవడానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్యాలెస్ యొక్క ప్రత్యేకత కారణంగా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ నిక్ జోనాస్‌లు ఇక్కడే హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకుని, ఒక్కటయ్యారు.

ముండోటా ఫోర్ట్, జైపూర్
జైపూర్‌లోని పింక్ సిటీలో ఉన్న ముండోటా కోట అందాలకు ఎవ్వరైన మంత్రముగ్దులు కావాల్సిందే. సుమారు 500 సంవత్సరాల పురాతనమైన ఈ కోటను 14వ శతాబ్దంలో నరుక రాజపుత్రులు నిర్మించారు. ఆరావళి పర్వత శ్రేణుల పైభాగంలో ఉన్న ఈ కోట తన అందంతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఈ కోట అందం కారణంగా, దక్షిణాది నటి హన్సిక మోత్వాని గత సంవత్సరం డిసెంబర్‌లో ఇక్కడ తన జీవితపు ముఖ్యమైన ఘట్టానికి వేదికగా మలచుకుంది.

బార్వాడా రిసార్ట్, సవైమాధోపూర్
రాజస్థాన్‌లోని సవైమాధోపూర్ కూడా రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు గొప్ప ఎంపిక. ఇక్కడ ఉన్న బార్వాడా కోటలో గతేడాది బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. మీరు రాజజు శైలిలో వివాహం చేసుకోవాలనుకుంటే, ఇది గొప్ప ఎంపిక.



Click it and Unblock the Notifications













