Search
  • Follow NativePlanet
Share
» »దంతేవాడ దంతేశ్వరి దేవాలయం !!

దంతేవాడ దంతేశ్వరి దేవాలయం !!

దంతేశ్వరి దేవాలయం ను క్రీ.శ.14 వ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించారు. ఇక్కడ అమ్మవారికి 'దంతేశ్వరి' అని, శివుడు ను 'కపాల భైరవుడు' అని పిలుస్తారు. ఈ ప్రదేశం ప్రకృతి రమణీయతలతో తలతూగుతూ ఉంటుంది.

By Mohammad

దంతేశ్వరి దేవాలయం దంతేశ్వరి దేవత కొలువున్న దేవాలయం. ఇది భారతదేశంలోని 52 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్య రాజులచే నిర్మించబడినది. ఇది చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ తెహసీల్ నుండి 80 కి.మీ దూరంలో గల దంతెవాడ వద్ద ఉన్నది.

కాకతీయుల కాలంలో దంతేశ్వరి దేవి నెలకొని యున్న ఈ ప్రాంతం కనుక ఈ గ్రామానికి దంతెవాడ అని పేరు వచ్చింది. సాంప్రదాయకంగా ఈ దేవత బస్తర్ జిల్లా వాసులకు కులదైవం.

దంతేశ్వరి ఆలయం

దంతేశ్వరి ఆలయం

చిత్రకృప : Ratnesh1948

చారిత్రక నేపథ్యం

చారిత్రక ఇతిహాసాల ప్రకారం సత్య యుగంలో దక్షుని యజ్ఞం వద్ద సతీదేవి తన భర్తకు అవమానం జరిగినదని యజ్ఞ గుండం లోనికి ప్రవేసిస్తుంది. దానికి శివుడు సతీదేవి దేహంతో శివతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక అచట శక్తి పీఠఖ్ కొలువైనట్లు కథనం.

ప్రతీ సంవత్సరం దసరా సందర్భంగా వేలాది గిరిజనులు వివిధ గ్రామాలు మరియు అడవుల నుండి ఇచ్చటికి చేరి ఈ దేవతా విగ్రహాన్ని బయటకు తీసి పట్టణం చుట్టూ ఊరేగిస్తారు. ప్రస్తుతం "బస్తర్ దసరా" పండగ అనేది ప్రాముఖ్యత గల పర్యాటకుల ఆకర్షణగా నిలిచింది. నవరాత్రి సందర్భంగా జ్యోతికలశాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం.

పూజలు అందుకుంటున్న మా దంతేశ్వరి

పూజలు అందుకుంటున్న మా దంతేశ్వరి

చిత్రకృప : Jitendranakka

విశేషాలు

దంతెవాడ గ్రామం జగదల్‌పూర్ కు నైఋతి భాగంలో ఉన్నది. ఈ ప్రాంతంలో శంకిని మరియు ఢాకిని అనే పుణ్య నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు వివిధ రంగులతో ఉంటాయి. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం భారత దేశంలో ప్రాచీన చారిత్రిక స్థలాలలో ఒకటి. బస్తర్ ప్రాంతంలో మత, సామాజిక, సాంస్కృతిక చరిత్రలో ఒకటిగా ఈ ప్రాంతం నిలుస్తుంది. భారత సాంస్కృతిక చరిత్రలో అనేక శాతాబ్దాల పాటు ఈ దేవాలయ సముదాయం ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో నిర్మాణ పరంగానూ మరియు శిల్పాల పరంగానూ మరియు పండగల సాంప్రదాయంలోనూ ఈ దేవాలయం ప్రముఖ స్థానం పొందింది.

బస్తర్‌ దసరా వేడుకలకు 500 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మహారాజ పురుషోత్తం దేవ్‌ పరిపాలన కాలంలో ఈ వేడుకలు ప్రారంభమైనట్లు చెబుతారు.కాకతీయులే ఇక్కడ దంతేశ్వరీ దేవి విగ్ర హాన్ని ప్రతిష్టించినట్లు కూడా కథనాలు వాడుకలో ఉన్నాయి.

టెంపుల్ ప్రాంగణం లోని విగ్రహాలు

టెంపుల్ ప్రాంగణం లోని విగ్రహాలు

చిత్రకృప : Ratnesh1948

ఇక్కడ జరిగే 90 రోజుల వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది చివరి పదిరోజుల గురించి. ఆ పది రోజుల కాలంలో రాజు అధికా రికంగా ప్రధానపూజారిగా మారుతాడు. రాజరికాన్ని వదిలి పూర్తిగా దంతేశ్వరీ పూజలోనే గడు పుతాడు. అయితే తాత్కలికంగా రాజరికాన్ని వదిలి పెట్టినప్పటికీ వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటాడు. పూజల సమయంలో రాజు ఉపవాస దీక్షను పాటిస్తాడు.

ఇది కూడా చదవండి : సుర్గుజా - పురాతన ప్రదేశంలో అన్వేషణ !!

నిర్మాణ శైలి

దంతేశ్వరి మా యొక్క విగ్రహం నల్లని రాయితో చెక్కారు. ఈ ఆలయం గర్భాలయం,మహా మండపం, ముఖ్య మండపం మరియు సభ మండపం అనే నాలుగు భాగాలుగా విభజించబడింది. గర్భాలయం మరియు మహా మండపం లను రాతి ముక్కలతో నిర్మించారు. దేవాలయ ప్రవేశం ముందు ఒక గరుడ్ పిల్లర్ ఉంది. ఆలయం విశాలమైన ప్రాంగణం చుట్టూ అతిపెద్ద గోడలు ఉన్నాయి. శిఖరం విగ్రహాలు సొగసుతో అలంకరించబడి ఉంటుంది.

టెంపుల్ లోపలి దృశ్యం

టెంపుల్ లోపలి దృశ్యం

చిత్రకృప : Ratnesh1948

దంతేశ్వరి దేవాలయం ఎలా చేరుకోవాలి ?

  • వాయుమార్గం : దంతేశ్వరి దేవాలయం సమీపాన రాయ్పూర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఇది దంతేశ్వరి దేవాలయానికి 283 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి టెంపుల్ చేరుకోవచ్చు. 296 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ ఎయిర్ పోర్ట్ కూడా ఉన్నది.
  • రైలు మార్గం : దంతెవాడ లో రైల్వే స్టేషన్ ఉన్నది. విశాఖపట్నం నుండి బైలడీలా కు రెగ్యులర్ గా తిరిగే ప్యాసింజర్ రైళ్ళు దంతెవాడ లో ఆగుతాయి.
  • రోడ్డు మార్గం : విశాఖపట్నం, జగదల్పూర్, రాయపూర్ తదితర ప్రాంతాల నుండి దంతెవాడ కు రెగ్యులర్ గా ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+