Search
  • Follow NativePlanet
Share
» »బాల‌క్‌రామ్ ద‌ర్శ‌నానికి వెళుతున్నారా... అయితే, వీటిని తెలుసుకోవాల్సిందే..

బాల‌క్‌రామ్ ద‌ర్శ‌నానికి వెళుతున్నారా... అయితే, వీటిని తెలుసుకోవాల్సిందే..

అయోధ్య‌లో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటి నుంచి శ్రీరాముని దర్శనం కోసం ప్రజలు తహతహలాడుతున్నారు. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభించబడింది. ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, గుజరాత్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, కత్రినా కైఫ్, అలియా భట్ వంటి పలువురు సూపర్ స్టార్లు కూడా పాల్గొన్నారు.

ఆ మ‌రుస‌టి రోజు నుంచే సాధార‌ణ భ‌క్తుల‌కు రాముని ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు. ప్రతి ఒక్కరూ దీనిని చూడటానికి ఎంత‌గానో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇది ఇంకా పూర్తిగా సిద్ధం కానప్పటికీ, ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలు మాత్రం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. కాబ‌ట్టి అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక, ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

rammandir darshan

రామజన్మ‌భూమిని చేరుకోడం ఎలా?

అయోధ్య రామ మందిరానికి చేరుకోవడానికి, వాయుమార్గం, రైలు మార్గం లేదా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. విమాన మార్గం అయితే ముందుగా మహర్షి వాల్మీకి విమానాశ్రయానికి చేరుకోవాలి. రైలు మార్గంలో అయితే అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ అయోధ్యలోని స‌మీప రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి రామాలయానికి సులభంగా వెళ్ళవచ్చు. అంతేకాదు, లక్నో రైల్వే స్టేషన్ అయోధ్యకు అత్యంత సమీపంలో ఉంది. ఇక‌, రోడ్డు మార్గంలో రావాలనుకుంటే మాత్రం ఉత్తర ప్రదేశ్ బస్సు సర్వీసులు నిత్యం అందుబాటులో ఉంటాయి.

దర్శన సమయాలు ఏమిటి?

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, అయోధ్య రాముని ద‌ర్శించుకోవాల‌నుకుంటే భక్తులు ఉదయం 7 నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు రాంలల్లా దర్శనానికి రావచ్చు. ఇప్పుడు ఆ వేళ‌ల‌ను కూడా మార్పు చేశారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 వరకు రాముని ద‌ర్శ‌న భాగ్యం చేసుకోవ‌చ్చు. రాంలల్లా హారతి సమయాలు ఉదయం 06:30 మరియు సాయంత్రం 07:30 ఉంటుంది. ఇందులో భక్తులు కూడా పాల్గొనవచ్చు. కానీ, కేవ‌లం 30 మంది మాత్రమే ఇందులో పాల్గొనడానికి అనుమ‌తి ఉంటుంది.

హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లాంటే ముందుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే హారతికి హాజరయ్యేందుకు అనుమతించబడతారు. పాస్ చేయడానికి డబ్బు వసూలు చేయబడదు. ఆన్‌లైన్‌లో పాస్‌ని పొందడానికి, ముందుగా శ్రీ రామ జన్మభూమి తీర్థ స్థల్ అధికారిక వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేరుగా ఆలయ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా పాస్ పొందొచ్చు. అయితే, రెండింటికీ, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్ వంటి గుర్తింపు కార్డును చూపించవలసి ఉంటుంది.

ayodhyaramdarshan

నిషేదించ‌బ‌డిన వ‌స్తువులు...

అయోధ్య ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు స్మార్ట్‌ఫోన్, కెమెరా, స్మార్ట్ వాచ్, ఇయర్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లకూడదు. అంతే కాకుండా బెల్టులు, బ్యాగులతో కూడా లోపలికి వెళ్లడం నిషేధం. అయితే, ఇప్పటి వరకు రామజన్మభూమి తీర్థ క్షేత్రం డ్రెస్ కోడ్‌కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. అయితే అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మాత్రం సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలని రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్రం ట్ర‌స్టు సూచించింది.

రామమందిరం విస్తీర్ణం...

రామాలయం విస్తీర్ణం 2.7 ఎకరాలు ఉంటుంది. ఈ ఆలయం ఎత్తు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. దీనితో పాటు, ఆలయంలో మొత్తం మూడు అంతస్తులు ఉన్నాయి. ఇందులో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయానికి మొత్తం 12 తలుపులు ఉన్నాయి. శిఖరాలు మరియు మండపాల సంఖ్య 5. ఆలయంలోని కింది అంతస్తులో స్తంభాల సంఖ్య 160, మొదటి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయ వైభవం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని చంద్రకాంత్ సోంపురా రూపొందించారు. వీరిలో దాదాపు మూడు తరాల వారు ఆలయ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. సోమనాథ్ ఆలయాన్ని కూడా ఆయన కుటుంబ సభ్యులు డిజైన్ చేశారు. అయోధ్య బాల రూపాన్ని చెక్కిన కళాకారుడి పేరు అరుణ్ యోగిరాజ్. రాంలాలా విగ్రహమే కాకుండా, అతను అనేక అందమైన, ముఖ్యమైన విగ్రహాలను నిర్మించాడు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+