Search
  • Follow NativePlanet
Share
» »అయోధ్య భ‌క్తుల‌కు శుభ‌వార్త‌... హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు డైరెక్ట్ ట్రైన్‌...

అయోధ్య భ‌క్తుల‌కు శుభ‌వార్త‌... హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు డైరెక్ట్ ట్రైన్‌...

Hyderabad to Ayodhya Direct Train: జ‌న‌వ‌రి 22న అయోధ్య‌లో రాముని ప్రాణ‌ప్ర‌తిష్ట వేడుక ఎంతో అద్భుతంగా జ‌రిగింది. ఇక నేటి నుంచి అంటే జ‌న‌వ‌రి 23 నుంచి భ‌క్తులు అయోధ్య బాల‌రాముని ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే అయోధ్య భ‌క్తుల‌తో కిక్కిరిసిపోయింది. ఇక హైద‌రాబాద్ నుంచి అయోధ్య బ‌యలుదేరాల‌నుకునేవారికి రైల్వైశాఖ ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది. హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు డైరెక్ట్ ట్రైన్‌ను ఏర్పాటు చేశాయి.

ఉత్తరప్రదేశ్​లోని అయోధ్యలో బాలారాముని ప్రాణ ప్రాతిష్ట కార్యం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. అయోధ్య రామాల‌యంలో బాల‌రాముడు కొలువై ఉన్నాడు. ఐదువంద‌ల ఏళ్ల‌నాటి హిందువుల క‌ల నిన్న‌టితో నేర‌వేరింది. జ‌న‌వ‌రి 22న మ‌ధ్యాహ్న స‌మ‌యంలో 12.20 నుంచి ఒంటిగంట మ‌ధ్య అద్భుత‌మైన ముహుర్తంగా ప‌రిగ‌ణించారు. ఆస‌మ‌యంలో అభిజిత్ లగ్నంలో శ్రీ‌రాముని ప్రాణ‌ప్ర‌తిష్ట ఉత్స‌వం ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ వేడుక పండితుల స‌మ‌క్షంలో ఎంతో సంప్ర‌దాయంగా జ‌రిగింది.

అయోధ్య‌లో కొలువైన బాలరాముని విగ్ర‌హం ఎత్తు 51 అంగుళాలు. ఈ రామ్‌ల‌ల్లా విగ్ర‌హాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. ఈ మ‌హోజ్వ‌ల ఘ‌ట్టానికి అయోధ్య శ్రీ‌రాముడు బంగారు ఆభ‌ర‌ణాల్లో ఎంత అందంగా అలంక‌రించ‌డం జ‌రిగింది. ఎడ‌మ‌చేతిలో విల్లు, కుడిచేతిలో బాణం ధ‌రించిన శ్రీ‌రాముడిని మ‌నం చూడొచ్చు. ఇక‌, జ‌న‌వ‌రి 23 నుంచి అయోధ్య‌కు సాధార‌ణ భ‌క్తులకు రాముని ద‌ర్శ‌న భాగ్యం క‌ల్గ‌నుంది. కాబ‌ట్టి హైద‌ర‌బాద్ నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లాల‌నుకునేవారికి రైల్వేశాఖ ఓ గుడ్‌న్యూస్ అందించింది. హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా డైరెక్ట్ ట్రైన్‌ను అందుబాటులో ఉంది. ఆ ట్రైన్ వివ‌రాలేంటో ఓసారి చూద్దాం..

hyderabadtoayodhyadirecttrain

యశ్వంత్​పూర్​-గోరఖ్​పూర్​ ట్రైన్‌..

హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాల‌నుకునే భక్తుల‌కు ప్రతీ శుక్రవారం యశ్వంత్‌పూర్ నుంచి గోరఖ్‌పూర్ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరడం జ‌రుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. కాబ‌ట్టి అయోధ్య వెళ్లాల‌నుకునేవారు ఈ ట్రైన్ ద్వారా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. రైలు నెంబర్ 15024 యశ్వంత్‌పూర్ నుంచి గోరఖ్‌పూర్ వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. మ‌ధ్య‌లో ధర్మవరం, అనంతపురం, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు(శుక్రవారం) ఉదయం 10.40 గంటలకు కాచిగూడ స్టేషన్​కు చేరుకుంటుంది.

ఇక‌, శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. ఈ ట్రైన్ తెలంగాణ‌లోని ప‌లు స్టేష‌న్ల‌లో కూడా ఆగుతుంది. అందులో కాజీపేట్ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. అనంత‌రం ప్రధాన స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతూ శ‌నివారం సాయంత్రం 4.24 గంటలకు గ‌మ్య‌స్థాన‌మ‌యిన అయోధ్య ధామ్ జంక్షన్ చేరుకుంటుంది. ఇక‌, రైల్వేస్టేష‌న్‌నుంచి బ‌స్సులు, టాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా అయోధ్య రామ‌మందిరానికి సుల‌భంగా చేరుకోవ‌చ్చు.

వీటి ధ‌ర‌ల వివ‌రాలు...

కాచిగూడ - అయోధ్య జంక్షన్ ట్రైన్ల టిక్కెట్ల ధ‌ర‌లు ఓసారి ప‌రిశీలిస్తే... స్లీపర్‌కు రూ.680, థర్డ్ ఏసీకి రూ.1,810, సెకండ్ ఏసీకి రూ.2,625, ఫస్ట్ ఏసీకి రూ.4,470 ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ బుకింగ్స్ చూస్తే మార్చి వరకు ఫుల్ రిజర్వ్ అయిన‌ట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ న‌డుపుతుంది. అందులో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి కూడా అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయ‌ని రైల్వేశాఖా తెలిపింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+