Search
  • Follow NativePlanet
Share
» »గుణ - హనుమంతుని శక్తులలో ఒకటి !

గుణ - హనుమంతుని శక్తులలో ఒకటి !

By Mohammad

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వా పీఠభూమి ప్రాంతంలో పార్వతి నది ఒడ్డున ఉన్న జిల్లా గుణ. 'గుణ' చంబల్ మరియు మాల్వా యొక్క ప్రవేశ ద్వారం (గేట్ వే). ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే, గుణ అవంతి రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. గుణ చాంద్ ప్రద్యోత మహాసేన దీనిని కనుగొన్నాడు. క్రీ.శ. 18 వ శతాబ్దంలో మరాఠా రాజు రామోజీ రావు సింధియా ఆక్రమించాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో విలీనమైపోయింది.

ఇది కూడా చదవండి : గుణ కు 174 KM దూరంలో లో ఉన్న సాంచి పర్యాటక ప్రదేశాలు !

సందర్శకులను ఆకర్షించే ఎన్నో పర్యాటక ప్రదేశాలు గుణ లో ఉన్నాయి. అందులో పంచముఖి హనుమాన్ ఆశ్రమం ప్రధానమైనది. దీనిని హనుమంతుని యొక్క అయిదు శక్తులలో ఒకటి గా భావిస్తారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలవు. బిస్భుజి టెంపుల్ అలాగే జైన్ టెంపుల్ లు ఈ ప్రాంతం లో ఉన్న మిగతా పర్యాటక ఆకర్షణలు. బజరంగర్హ్ కోట వీటిలో ప్రముఖమైనది.

భీష్భుజి ఆలయం

గుణ లో ఉన్న ప్రధాన ఆలయాలలో భీష్భుజి ఆలయం ఒకటి. 20 చేతులు కలిగిన దుర్గా దేవి విగ్రహం ఆలయంలోని గర్భ గుడి లో కొలువై ఉంటుంది. దీప స్థంభం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఆలయంలోని ఎటువైపు నుంచైనా చూసిన దీపస్తంభం వెలుగుతూనే కనిపిస్తుంది.

పంచముఖి హనుమాన్ ఆశ్రమం

పంచముఖి హనుమాన్ ఆశ్రమం

చిత్ర కృప : Teacher1943

దుర్గాష్టమి వేడుకలు ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల సమయంలో ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేస్తారు. ప్రత్యేక పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఆ సమయంలో గుణ ను ఎక్కువ మంది యాత్రికులు సందర్శిస్తారు.

జైన ఆలయం

గుణ లో ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ జైన ఆలయం. ఈ జైన్ టెంపుల్ యొక్క అసలు పేరు శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర. క్రీ.శ. 1236 లో శ్రీ పద షా గురవుచే ఇది నిర్మించబడింది. ఎర్రరాతితో చెయ్యబడిన జైన్ తీర్థంకరుల యొక్క అనేక విగ్రహాలు ఈ మందిరం లో ఉన్నాయి. అంతే కాకుండా, జైన్ టెంపుల్ లో ఉన్న జటిలమైన విగ్రహాలు అలాగే ఈ బయట మరియు లోపల ఆలయ గోడలపై ఉన్న చెక్కడాలు ఆకట్టుకుంటాయి.

జైన ఆలయం

జైన ఆలయం

చిత్ర కృప : Manfred Sommer

నిలుచుని ఆకాశం వైపు చూస్తున్న్నట్టుగా దర్శనమిచ్చే లార్డ్ శాంతినాథ్ ఈ ఆలయం లో ని ప్రధాన దైవం. ఈ విగ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. 18 అడుగుల ఎత్తులో ఉంటుంది. అరహ్నాథ్ స్వామి మరియు కున్తునాథ్ లు ఈ ఆలయం లో ఉన్న ఇతర దైవాలు. అరహనాథ్ స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తు ఉండగా, కున్తునాథ్ స్వామి వారి విగ్రహం 10 అడుగుల ఎత్తు లో ఉంటుంది.

బజ్రంగర్హ్ కోట

బజ్రంగర్హ్ కోట కు గల మరో పేరు ఝూర్కన్ కోట. గుణ - ఆరోన్ రోడ్ మీద ఈ కోట ఉన్నది. క్రీ.శ. 1775 వ సంవత్సరంలో మరాఠా రాజులచే ఈ కోట నిర్మించబడింది. గన్నేరి, రంగమహళ్ మరియు మోతిమహళ్ ల సమ్మేళనం ఈ కోట.

బజ్రంగర్హ్ కోట

బజ్రంగర్హ్ కోట

చిత్ర కృప : Aaron Naorem

కోట శిధిలావస్థ దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా ఉండటం వల్ల సందర్శకుల మన్ననలను పొందుతున్నది. కోట లోపల పురాతన ఆలయాన్ని, మెట్ల బావిని చూడవచ్చు.

గుణ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

గుణ కు సమీపాన భోపాల్ విమానాశ్రయం (158 కి. మీ ల దూరంలో), గ్వాలియర్ విమానాశ్రయం (190 కి. మీ ల దూరంలో) లు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ ఎయిర్ పోర్ట్ లు చక్కగా కనెక్ట్ చేయబడ్డాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి గుణ చేరుకోవచ్చు.

రైలు మార్గం

గుణ లో రైల్వే జంక్షన్ ఉన్నది. భోపాల్, ఇండోర్, ముంబై, హైదరాబాద్ తదితర నగరాల నుండి రైళ్ళు స్టేషన్ మీదుగా రోజూ నడుస్తుంటాయి.

బస్సు / రోడ్డు మర్గం

గ్వాలియర్, సాంచీ, ఇస్లాం నగర్, భోపాల్ తదితర సమీప పట్టణాలతో పాటు, రాష్ట్రంలోని మిగితా నగరాల నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు / ప్రవేట్ వాహనాల ద్వారా గుణ చేరుకోవచ్చు.

గుణ రైల్వే స్టేషన్

గుణ రైల్వే స్టేషన్

చిత్ర కృప : indiarailinfo.com

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+