Search
  • Follow NativePlanet
Share
» »పచ్‌మర్హి ప్ర‌దేశంలోని ఈ ప్రాంతాల‌ను చూశారా?

పచ్‌మర్హి ప్ర‌దేశంలోని ఈ ప్రాంతాల‌ను చూశారా?

పచ్‌మర్హి ప్ర‌దేశంలోని ఈ ప్రాంతాల‌ను చూశారా?

రోజువారీ జీవితం నుండి కాస్త దూరంగా ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణాన్ని కోరుకుంటున్నారా? ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల న‌డుమ సేదాతీరాల‌ని అన‌కుంటున్నారా? అయితే, ఈ సీజ‌న్‌లో అలాంటి వాతావ‌ర‌ణాన్ని ఇష్ట‌ప‌డే వారు త‌ప్ప‌కుండా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌చ్‌మ‌ర్హి అందాల‌ను త‌ప్ప‌కుండా వీక్షించాల్సిందే. ఈ ప్రాంతానికి కుటుంబ‌స‌భ్యుల‌, స్నేహితుల‌తో క‌లిసి విహరించొచ్చు. సాత్పురా రాణి అని పిలవబడే పచ్మరి మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. ఇక్క‌డికి బ‌స్సులు, లేదా రైలుమార్గం ద్వారా చేరుకోవ‌చ్చు. చుట్టూ పచ్చని అడవులు, గుహలు, జలపాతాలు ఉన్న ఈ ప్రదేశం స్వర్గాన్ని త‌ల‌పించేదిలా ఉంటుంది. కాబట్టి ఈ స్థలాన్ని ఆస్వాదించాలనుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాల‌ను వీక్షించాల్సిందే. రండి ఆవెంటో చూద్దాం.

సాత్పురా నేషనల్ పార్క్

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో ఉన్న సాత్పురా నేషనల్ పార్క్, సాత్పురా పర్వత శ్రేణిలో ఒక భాగం. ఇది జాతీయ ఉద్యానవనం కావడంతో పాటు పక్కనే బోరి, పచ్‌మర్హి వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. దీంతో ఇదో ప్రత్యేకమైన రక్షిత ప్రాంతంగా ఏర్పడింది. భారతదేశంలో వాకింగ్ సఫారీ అనుభవాన్ని కల్పించే ఏకైక జాతీయ ఉద్యానవనం సాత్పురా నేషనల్ పార్క్. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. సాత్పురా నేషనల్ పార్క్‌లో పులుల జాడ చాలా తక్కువ సార్లు మాత్రమే గుర్తించగలరు. దీంతో పర్యాటకులు ఎవరైనా ఆ నేషనల్ పార్క్‌లోని కోర్ జోన్‌లో వాకింగ్ సఫారీ చేసే అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

1

జ‌మున ప్ర‌పత్ జలపాతం

పచ్‌మ‌ర్హిలో అనేక జలపాతాలు ఉన్నాయి. కానీ జమున ప్రపత్ అని పిలువబడే ఈ జలపాతం అత్యంత ప్రసిద్ధమైనది. ఈ జలపాతం ప్రత్యేకత ఏంటంటే.. ఏడాది పొడవునా ఈ జలపాతం నుంచి నీరు పారుతూ ఉంటుంది. 150 అడుగుల ఎత్తైన ఈ జలపాతం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ జలపాతం 150 అడుగుల ఎత్తులో ఉంది. పచ్మర్హి నుండి 3 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. పచ్‌మర్హి బయోస్పియర్ రిజర్వ్ నడిబొడ్డున ఉన్న సహజ జలపాతం . జలపాతం చుట్టూ పచ్చని అడవులు, సందర్శకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ జలపాతం జమున నది ద్వారా ఏర్పడింది, ఇది దట్టమైన అడవి గుండా ప్రవహిస్తుంది. సుమారు 30 మీటర్ల ఎత్తు నుండి క్రిందికి ప్రవహిస్తుంది.

2

పాండవుల గుహ

మహాభారత కాలం నాటి ఒక పురాణం ఒక భారీ రాతిపై నిర్మించిన ఈ గుహలతో ముడిపడి ఉంది. పాండవులు వనవాస సమయంలో ఈ గుహల్లోనే ఉండేవారని నమ్ముతారు. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుహలలో అనేక శిల్పాలను చూడొచ్చు.పాండవ గుహలు దట్టమైన అడవులతో చుట్టుముట్టబడిన దట్టమైన సాత్పురా శ్రేణిలో ఉన్నాయి. ప్రకృతి పర్యటనలను ఇష్టపడే వారికి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రాంతం ఉత్తమ ఎంపికలలో ఒకటి. ఈ గుహల చరిత్రలో మర్మమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ కేంద్రంగా విరాజిల్లుతుంది.

పచ్‌మ‌ర్హి సరస్సు

పచ్‌మ‌ర్హి సరస్సు వైపు, పర్యాటకులు బోట్ రైడ్, బెలూన్ రైడ్, రోప్-క్రాసింగ్, జిప్-లైన్, మొదలైన వాటిని చేసేందుకు వీలుగా ఉంటుంది. అందుకే ఈ ప్ర‌దేశాన్ని పిల్లలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. పచ్‌మర్హి సరస్సు జిప్ లైన్ పర్యాటకులలో ప్రసిద్ది చెందింది. ఇది పొడవుగా ఉంటుంది. పచ్‌మ‌ర్హి సంవత్సరం పొడవునా పర్యాటకులకు తెరిచి ఉంటుంది. ఇక్క‌డికి సెప్టెంబరు నుండి మార్చి వరకు సంద‌ర్శించేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది.

More News

    Read more about: pachmarhi madhya pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+