Search
  • Follow NativePlanet
Share
» »చ‌ద‌రంగంలా క‌నిపించే ల‌క్నోలోని ఈ రైల్వేస్టేష‌న్‌ను చూశారా..?

చ‌ద‌రంగంలా క‌నిపించే ల‌క్నోలోని ఈ రైల్వేస్టేష‌న్‌ను చూశారా..?

యుపి రాజధాని లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ దేశంలోని అత్యంత అందమైన స్టేషన్‌లలో ఒకటిగా పేరుగాంచింది. పై నుండి చదరంగంలా కనిపించే ఈ స్టేషన్‌ను గతంలో పర్షియన్ భాషలో చాహర్ బాగ్ అని పిలిచేవారు. ఇది యుపీ ప‌ట్ట‌ణానికి దక్షిణాన ఉన్న చార్‌బాగ్‌లో ఉంది. అందుకే దీనిని ప్రసిద్ధి చెందిన చార్‌బాగ్ అనే పేరుతో పిలుస్తారు. 'చార్ బాగ్' అనే పదాలు గతంలో ఇక్కడ ఉన్న నాలుగు తోటలను సూచిస్తాయి. లక్నో నగరం అన్ని మెట్రో మ‌రియు ఇతర ముఖ్యమైన నగరాలతో లక్నో చార్‌బాగ్ లేదా లక్నో జంక్షన్ ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ చార్‌బాగ్ రైల్వే స్టేషన్, 1867 వరకు ఒక పెద్ద పండ్లతోటగా ఉండేది. ప్రస్తుత స్టేషన్ భవనం 1926లో గోపురాలు, మొఘల్ ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో మినార్‌లతో నిర్మించబడింది. ఇది అవధ్ నవాబుల కాలం నాటి నగరానికి వాస్తుశిల్పానికి అనుగుణంగా ఉండేలా ఉంటుంది. ఎర్ర ఇటుకతో నిర్మించిన భవనం మొఘల్ తోరణాలతో అలంకరించబడిన పొడవాటి వరండాలను కలిగి ఉంటుంది.

నవాబ్ అసఫ్-ఉద్-దౌలాకు ఈ చార్‌బాగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ సమయంలో బ్రిటీష్ వారు అవధ్‌ను స్వాధీనం చేసుకుని నవాబులను ఇక్కడి నుండి వెళ్లగొట్ట‌డం జ‌రిగింది. అప్పుడు చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు బ్రిటీష్ వారు పునాది వేశారని చ‌రిత్ర చెబుతోంది. ఈ స్టేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

lucknow railway station

బ్రిటిష్ వారు పునాది వేసిన స్టేష‌న్‌...

లక్నోలోని మునవ్వర్ బాగ్‌కు ఉత్తరాన చార్‌బాగ్ పునాది వేయబడింది. నవాబీ శకం ముగిసేసరికి ఈ కాలపు వైభవం కూడా మసకబారింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక అద్భుతమైన స్టేషన్‌ను ఇక్క‌డ ప్లాన్ చేసింది. ఆ కాలంలోని ప్రసిద్ధ వాస్తుశిల్పి జాకబ్ ఈ భవనం మ్యాప్‌ను సిద్ధం చేయ‌డం జ‌రిగింది. చార్ బాగ్ స్టేషన్ నిర్మాణానికి అప్ప‌ట్లో రూ.70 లక్షలు వెచ్చించారంటే మాట‌ల చెప్పండి. రాజపుత్ర శైలిలో నిర్మించిన ఈ భవనంలోని చిన్న, పెద్ద గొడుగు లాంటి గోపురాలు చదరంగం బోర్డు నమూనాలా క‌నిపిస్తాయి.

ట్రైన్ శబ్దాలు బయటకు వెళ్లవు...

ఈ ట్రైన్ విశేష‌త‌ల కార‌ణంగా చార్‌బాగ్ స్టేషన్ దేశంలోని ప్రత్యేక స్టేషన్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ స్టేష‌న్‌లో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చినంత శబ్ధం స్టేషన్ వెలుపలికి అస్స‌లు రాదు. అయితే చార్‌బాగ్ వెలుపల ఉన్న ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్ మధ్య దూరమే లేదు. ఇంత‌టి అద్భుత‌మైన కట్టడాన్ని 1786-91లో నవాబ్ అసఫ్-ఉద్-దౌలా నిర్మించారు. ఇది ఆ యుగపు నిర్మాణ అద్భుతాలలో ఒకటి. దీని సెంట్రల్ హాల్ ప్రపంచంలోనే అతిపెద్ద వాల్టెడ్ ఛాంబర్‌గా చెప్పబడుతుంది. లోపలి భాగంలో గ్యాలరీలు తప్ప మ‌రేవీ లేవు. మొత్తం నిర్మాణంలో ఎక్క‌డ చెక్క‌ను ఉప‌యోగించ‌లేదు.

charbaghrailwaystation , Lucknow

ఇది గాంధీ-నెహ్రూల మొదటి సమావేశం..

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తొలిసారిగా ఇక్కడ బాపును క‌లవ‌డం జ‌రిగింది. మహాత్మా గాంధీ 1916 డిసెంబర్ 26న మొదటిసారి లక్నో వచ్చారు. ఐదు రోజుల పాటు ఈ నగరంలోనే మకాం వేశారు. కాంగ్రెస్ సమావేశం ఇక్క‌డే జరిగింది. ప్ర‌స్తుతం గాంధీజీ నెహ్రూను కలిసిన ప్రదేశంలో స్టేషన్ పార్కింగ్ ఉంది. సమావేశానికి చిహ్నంగా ఇక్కడ ఒక రాయిని కూడా ఏర్పాటు చేశారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+