ప్రస్తుతం చాలామంది ప్రయాణికులు ఎంచుకునే మార్గం రైల్వే. ఎందుకంటే రైల్వే ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, అతి తక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. సూదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువశాతం మంది రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. రైల్వే అనేది ఒక ఆహ్లాదకరమైన రవాణా అని చెప్పుకోవాలి. రైలు ప్రయాణం జీవితంలో మరిచిపోలేని ఎన్నో అనుభూతులను మిగిలుస్తుంది. రైలు కిటికీ దగ్గర కూర్చొని పొలాలు, పచ్చని చెట్లు, అడవులు, నదులు మరియు పర్వతాలను గంటల తరబడి చూడటం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.
ఈ అనుభూతి మరే ఇతర మార్గాల్లోనూ పొందలేం కూడా. రైలు ప్రయాణం ద్వారా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వారి గురించి తెలుసుకుంటారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అన్నింటిలోనూ మార్పులొచ్చాయి. ఇప్పడు రైల్వే రవాణాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ఆధునాతన టెక్నాలజీతో కూడా ట్రైన్స్.
ఇప్పడు దేశంలోని కొన్ని పాత రైల్వే స్టేషన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం. ఇవి భారత్‌లోని అతి పురాతనమైన రైల్వేస్టేషన్లుగా పేరుగాంచాయి. ఇవి సుమారు 150 సంవత్సరాల నాటివి. ఈ పాత రైల్వే స్టేషన్లు నేడు విలాసవంతమైన ప్యాలెస్‌లుగా పర్యాటకులకు దర్శనమిస్తున్నాయి. అవెంటో చూద్దాం పదండి.

బరోగ్ రైల్వే స్టేషన్, హిమాచల్ ప్రదేశ్
బరోగ్ రైల్వే స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ పర్వతాలలో ఉన్న ఒక చిన్న రైల్వే స్టేషన్. ఇది బరోగ్ కల్కా మరియు సిమ్లా రైల్వే మార్గంలో నడుస్తోంది. ఈ స్టేషన్ 1930 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదాను కూడా కలిగి ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతనమైన రైల్వేస్టేషన్‌గా పేరుగాచింది. ఫోటోగ్రఫి ఇష్టపడేవారు తప్పకుండా ఈ రైల్వేస్టేషన్‌కు రావాల్సిందే.

హౌరా జంక్షన్, కోల్‌కతా
కోలకతాలోని హౌరా జంక్షన్ రైల్వేస్టేషన్ భారతదేశంలోని అతి పురాతన స్టేషన్. దీనిని 1852 సంవత్సరంలో నిర్మించారు, ఈ రైల్వే స్టేషన్‌లో అత్యధిక మంది ప్రయాణిస్తూ ఉంటారు. ప్రతిరోజు సుమారు 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇక్కడకు ప్రయాణించేందుకు వస్తుంటారు. ఈ రైల్వేస్టేషన్లో మొత్తం 23 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వేస్టేషన్ భారతదేశంలోని అతిపురాతన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ముంబైలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఈ రైల్వే స్టేషన్‌ను విక్టోరియా టెర్మినస్ అని కూడా పిలిచేవారు.
చార్‌బాగ్ రైల్వే స్టేషన్, లక్నో
లక్నోలోని చార్‌బాగ్ రైల్వేస్టేషన్ భారత్‌లోని అతి పురాతనమైన రైల్వేస్టేషన్‌గా పేరుగాంచింది. ఈ రైల్వే స్టేషన్ నవాబుల నగరమైన లక్నోలో ఉంది. ఇది 1915 సంవత్సరంలో నిర్మించబడింది. రైల్వే స్టేషన్ పేరు మాదిరిగా, చార్‌బాగ్ స్టేషన్ చుట్టూ నాలుగు అందమైన పార్కులు ఉంటాయి. ఇది ఎంతో అందమైన రైల్వేస్టేషన్. ఈ అందమైన స్టేషన్‌లో రాజస్థానీ, మొఘల్ నిర్మాణాల కలయికను కూడా చూడొచ్చు. ఈ స్టేషన్ పై నుంచి చూస్తే చదరంగం ఆకారంలా ఉంటుంది. ఇదే ఈ స్టేషన్ ప్రత్యేకత.
పాత ఢిల్లీ రైల్వే స్టేషన్
దేశ రాజధానిలోని ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది. ఇది సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ 1864లో ప్రారంభించబడింది. ఈ స్టేషన్ చాందినీ చౌక్ సమీపంలో ఉంటుంది. ఇది ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌గా చెప్పొచ్చు. ఇక్కడి నుంచి రోజుకు 2 లక్షల మందికి పైగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ స్టేషన్ ఎర్రకోట నిర్మాణం నుండి ప్రేరణ పొందింది.



Click it and Unblock the Notifications















