Search
  • Follow NativePlanet
Share
» »మోఢేరా సూర్య‌దేవాల‌యం గురించిన‌ ఆసక్తిక‌ర విష‌యాలు

మోఢేరా సూర్య‌దేవాల‌యం గురించిన‌ ఆసక్తిక‌ర విష‌యాలు

మోఢేరా సూర్య‌దేవాల‌యం గురించిన‌ ఆసక్తిక‌ర విష‌యాలు

భారతదేశంలో మూడు పేరుగాంచిన‌ సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒడిశాలోని కోణార్క్‌ మందిరం, రెండవది జమ్మూలోని మార్తాండ్‌ ఆలయం మరియు మూడవది గుజ‌రాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య దేవాల‌యం. సూర్యోదయం తర్వాత తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించేలా ఈ ఆల‌య నిర్మాణాన్ని చేపట్టారు.

సభామంటపానికి ఎదురుగా ఉండే విశాలమైన కొలనును సూర్యమడుగు లేదా రామ మడుగు అని పిలుస్తారు. శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం ప్రపంచప్రసిద్ధి చెందిన ప్రత్యేకౖమెన విశేషం.

ప్ర‌పంచ వార‌స‌త్వ క‌ట్ట‌డాలుగా భార‌త్‌లోని ప‌లు స్మార‌కాలు ఇప్ప‌టికే యునెస్కో జాబితాలో చోటు సంపాదిచుకున్నాయి. తాజాగా యునెస్కో తాత్కాలిక జాబితాలో గుజ‌రాత్‌లోని చారిత్ర‌క న‌గ‌రం వ‌డ్‌న‌గ‌ర్‌, మోఢేరా సూర్య‌దేవాల‌యం, త్రిపుర‌లోని ఉనాకోటీ రాతి నిర్మాణాలు చోటు సంపాదించుకున్నాయి. ఈ మూడింటిలో శిల్ప‌క‌ళ ఉట్టిప‌డే మోఢేరా సూర్య‌దేవాల‌యం గురించిన విశేషాల‌ను తెలుసుకుందాం. గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న పుష్పవతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది.

ఆలయాల నిర్మాణానికి శ్రీకారం..

ఆలయాల నిర్మాణానికి శ్రీకారం..

క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్‌ మరియు చుట్టు ప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుౖడెన మహమూద్‌ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడౖపె లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే 'అహిల్వాడ్‌ పాటణ్‌' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోసాగింది.

దీంతో తమ పూర్వౖవెభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందౖమెన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ దేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవ‌మైన‌ సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందౖమెన సూర్య మందిరాన్ని నిర్మించాలి అనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయ నిర్మాణం కార్య‌రూపం దాల్చింది.

ఇరానీ శిల్పకళ శైలిలో..

ఇరానీ శిల్పకళ శైలిలో..

ఈ ఆల‌య నిర్మాణ శైలి ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని సోలంకి చ‌క్ర‌వ‌ర్తి భీమ్‌దేవ్ నిర్మించారు. ఈ నిర్మాణంలో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది. మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలౖపె అత్యద్భుతౖమెన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను ఎంతో నైపుణ్యంతో మ‌ల‌చారు. అలాగే, రామాయణం, మహాభారతంలోని ప్రధానౖమెన ఘ‌ట్టాల‌ను కూడా ఈ గోల‌పై వీక్షించ‌వ‌చ్చు. స్థంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గంలో చేరుకునేందుకు మోఢేరా సూర్యదేవుని ఆలయం అహ్మదాబాద్ నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్ నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంటుంది. అలాగే, రైలు మార్గంలో చేరుకునేందుకు అహ్మదాబాద్‌ వరకు రైలు మార్గం గుండా ప్రయాణించి ఆ తర్వాత బస్సు లేదా టాక్సీలలో ప్ర‌యాణించాల్సి ఉంటుంది. ఈ ఆల‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న విమాశ్ర‌యం అహ్మదాబాద్‌ విమానాశ్రయం.

More News

    Read more about: konark mandir in odisha
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+