Search
  • Follow NativePlanet
Share
» »గుజరాత్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2024..

గుజరాత్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2024..

ఈ నెల‌లో భారతీయులు జ‌రుపుకునే అతిపెద్ద పండుగ మక‌ర సంక్రాంతి. ఈ పండ‌గ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ ప‌ద్ద‌తుల్లో జ‌రుపుకుంటారు. మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్బంగా చాలా ప్రాంతాల్లో గాలిప‌టాల‌ను కూడా ఎగుర‌వేస్తుంటారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా కైట్ ఫెస్టివ‌ల్స్‌ను కూడా నిర్వ‌హిస్తుంటారు. ఈ పండుగ స‌మ‌యంలో ఆకాశంలో రంగురంగుల గాలిప‌టాలు అంద‌రినీ ఆక‌ర్షిస్తుంటాయి. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్స‌రం గుజ‌రాత్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ కైట్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హిస్తారు. ఈ ఏడాది కూడా ఈ ఫెస్టివ‌ల్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. గుజరాత్ పర్యాటక శాఖ ఈ కైట్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హిస్తుంది.

కైట్ ఫెస్టివల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.

1989 నుండి ఈ కైట్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ ఫెస్టివ‌ల్ ఉత్తరాయణం రోజున అంటే మకర సంక్రాంతి రోజున అహ్మదాబాద్‌లో కైట్ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. ఉత్తరాయణం శీతాకాలం ముగింపు మరియు వేసవి కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వెళ్లడం ప్రారంభిస్తాడు. అందుకే ప్ర‌తి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జనవరి 8 నుంచి అహ్మదాబాద్‌లో ఈ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు.

kitefestival , Gujarat

మ‌క‌ర సంక్రాంతి పండుగ ఈ ఏడాది జ‌న‌వ‌రి 14న కొన‌సాగుతుంది. గుజరాత్‌లోని పతంగుల పండుగలో అనేక దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఉత్తరాయణం అనేది పతంగులు ఎగురవేసే పండుగ‌. ఈ రోజున‌ ఉదయం నుండే ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి చేరుకునే గాలిప‌టాలు ఎగుర‌వేస్తుంటారు. గత కొన్నేళ్లుగా, వివిధ దేశాల ప్రతినిధులు తమ ప్రత్యేక పతంగులతో గుజరాత్‌లోని కైట్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఇటలీ, చైనా మరియు USA నుండి మాస్టర్ కైట్ తయారీదారులు వారి అద్భుతమైన గాలిపటాలతో గాలిపటాల పండుగలో పాల్గొంటూ వ‌స్తున్నారు.

జ‌న‌వరి 8 నుంచి 12 వ‌ర‌కు కొన‌సాగనుంది..

అయితే గుజరాత్ కైట్ ఫెస్టివల్‌లో అత్యంత ఖ్యాతి చెందిన‌ది అహ్మదాబాద్‌కు చెందిన మాస్టర్ కైట్ మేకర్ రసూల్‌భాయ్ రహీంభాయ్‌కు చేరుకుంది. అతను ఒకప్పుడు 500 గాలిపటాల రైలును తయారు చేసి ఎగురేశాడు. అది ఎంతో ప్ర‌ఖ్యాతి గాంచింది. గుజరాత్ కైట్ ఫెస్టివల్ జనవరి 7న ప్రారంభ‌మ‌వుతుంది. దీని ప్రారంభ వేడుక అహ్మదాబాద్‌లో జనవరి 8న ప్రారంభ‌మైంది. వడోదర మరియు అహ్మదాబాద్ జనవరి 9న జ‌ర‌గ‌నుంది. కేవడియా, ద్వారక, అహ్మదాబాద్ జనవరి 10న సూరత్, రాజ్‌కోట్ మరియు అహ్మదాబాద్ జనవరి 11 - ధోడో, వడ్‌నగర్, అహ్మదాబాద్ జనవరి 12 నుండి 14 వరకు నిర్వ‌హించ‌బ‌డుతుంది.

ఈ సంవత్సరం కూడా మకర సంక్రాంతి సంద‌ర్భంగా ఈ కైట్ ఫెస్టివ‌ల్ కోసం గుజరాత్ ముఖ్యంగా అహ్మదాబాద్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో అంతర్జాతీయ గాలిపటాల పండుగను నిర్వహించనుంది. స‌మాచారం ప్ర‌కారం.. ఈ కైట్ ఫెస్టివ‌ల్‌ను రామాలయం ప్రారంభోత్సవం ప్రారంభానికి ముందే అంటే జనవరి 19 మరియు 21 మధ్య నిర్వహించవచ్చు. అయితే, ఈ సారి గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌తో పాటు అయోధ్య‌లో కూడా కైట్ ఫెస్టివ‌ల్‌ను జ‌ర‌గ‌నుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+