Ayodhya Tour : జనవరి 22న అయోధ్య రామమందిరం విగ్రహ ప్రతిష్టాపన అనంతరం బాలక్‌రామ్‌ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు బారులు తీరుతున్నారు. దేశ విదేశాల నుంచి అయోధ్యకు తరలివెళ్తున్నారు. శ్రీరాముని దర్శనం కోసం చాలామంది భక్తులు ఇప్పటికే ప్రయాణాలను సిద్ధం చేసుకున్నారు. మరికొందరు ఆ పనిలోనే ఉన్నారు. అయోధ్య శ్రీరాముని భక్తులకు ఐఆర్‌సిటిసీ ఓ శుభవార్తను మోసుకొచ్చింది. అయోధ్యను సందర్శించాలనుకునేవారికి ఇదొక సువర్ణవకాశమనే చెప్పుకోవాలి.
తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజీని ఐఆర్‌సిటిసి అయోధ్య భక్తులకోసం తీసుకోచ్చింది. ఇండియన్ రైల్వే అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్ టూర్ ప్యాకేజీని అందిస్తుంది. అయోధ్య ప్రారంభమైన మొదటిరోజే 5లక్షలమంది శ్రీరాముని దర్శించుకున్నారంటే అక్కడ రద్దీ ఏ విధంగా ఉందో మనకు అర్థమముతుంది. మరెందుకాలస్యం ఈ ఐఆర్‌సిటిసి అందిస్తున్న ప్యాకేజీ వివరాలను తెలుసుకుందాం.
అయోధ్యను సందర్శించాలనుకునే భక్తుల కోసం.. అయోధ్యను కవర్ చేస్తూ.. భారత్ గౌరవ్ ట్రైన్ ఓ సరికొత్త ప్యాకేజీతో ముందుకు వచ్చింది. అయోధ్య శ్రీరామజన్మభూమి, ప్రయాగ్‌రాజ్‌తో పాటు మూడు జ్యోతిర్లింగాల దర్శనం ((WZBGI14) పేరుతో టూర్ ప్యాకేజీనీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీలో భాగంగా ఫిబ్రవరి 5న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ బయలుదేరుతుంది. మొత్తం తొమ్మిది రాత్రులు, పది పగళ్లతో ఈ యాత్ర ఉండనుంది.

రాజ్ కోట్, సురేంద్ర నగర్, వీరంగామ్, సబర్మతి, నదియాద్, ఆనంద్, ఛాయాపురి, గోద్రా, దాహోద్, మేఘనగర్, రత్లాం స్టేషన్‌లో యాత్రికులు ఈ ట్రైన్ ఎక్కొచ్చు. మళ్లీ ఇవే స్టేషన్లలో దిగిపోవచ్చు కూడా. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా భక్తుల కోసం అయోధ్య, ప్రయాగ్ రాజ్, శృంగేర్ పూర్, చిత్రకూట్, వారణాసి, ఉజ్జయిని, నాసిక్‌లను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా రైలు టికెట్లతో పాటు వసతి, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా ఉండనున్నాయి.
మూడు జ్యోతిర్లింగాల దర్శనం...
ఇక, ఈ టూర్‌లో సందర్శకులు అయోధ్య బాలక్‌రామ్ ఆలయంతో పాటు కాశీ విశ్వనాథ్, మహాకాళేశ్వర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. అయితే, వీటిని సందర్శించే వారు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. పురుషులు షర్ట్, కుర్తా, ధోతి, పంచె, పైజామా మాత్రమే ధరించాలి. స్త్రీలు చీరలు, సల్వార్ కమీజ్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ రూ.20,500తో ప్రారంభమవుతుంది. ఎకానమీ (స్లీపర్) క్లాస్‌లో ఒక్కొక్కరికీ రూ.20,500 చార్జీ వసూలు చేయనుంది. ఇక కంఫర్ట్ (ఏసీ-3) క్లాస్ టికెట్ ధర రూ. రూ.33 వేలు.
సుపీరియర్ (సెకండ్ ఏసీ) క్లాస్ ధర రూ.46వేలుగా ఉండనుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సిటిసి irctctourism.com ఈ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. ఆన్‌లైన్‌లో టూర్ ప్యాకేజీనీ బుక్ చేసుకోవాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఆర్‌సిటిసి టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుక్ చేసుకునే సౌకర్యం కలదు. ఇక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ రైలు ప్రయాణించదు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకునేవారు ముందుగా రాజ్‌కోట్ లేదా పైన తెలిపిన స్టేషన్లకు తమ సొంత ఖర్చులతో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అయోధ్య యాత్రకు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు.



Click it and Unblock the Notifications













