Search
  • Follow NativePlanet
Share
» »శ్రీరామాయ‌ణ యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ బంప‌ర్ ప్యాకేజీ

శ్రీరామాయ‌ణ యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ బంప‌ర్ ప్యాకేజీ

శ్రీరామాయ‌ణ యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ బంప‌ర్ ప్యాకేజీ

మ‌న‌దేశంలో విహార యాత్ర‌కు వార‌ధి అంటే ట‌క్కున గుర్తుకువ‌చ్చేది ఐఆర్‌సీటీసీ. చారిత్ర‌క ప్ర‌దేశాలైనా.. ఆధ్యాత్మిక కేంద్రాలైనా.. సుఖ‌వంత‌మైన‌, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణాన్ని అందిస్తుంది ఈ సంస్థ‌. నిత్యం ఏదో ఒక ప్యాకేజీతో ప్ర‌యాణీకుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

ఇప్పుడు తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. రైలు ప్ర‌యాణం ద్వారా శ్రీరాముడు న‌డియాడిన ప్ర‌దేశాల‌ను చూడాల‌నుకునేవారి కోరిక‌ను తీర్చ‌బోతోంది ఐఆర్‌సీటిసీ. ఏప్రిల్ నెల‌లో శ్రీరామాయ‌ణ యాత్ర పేరుతో స‌రికొత్త ప్యాకేజీని ప‌రిచ‌యం చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం రండి.

ramayanayatra

ఆధ్యాత్మిక కేంద్రాల ప‌ర్య‌ట‌న‌పై మ‌క్కువ ఉన్న‌వారు మ‌న దేశంలో చాలామందే ఉంటారు. అలాంటి వారికి రైల్లో రామాయణ యాత్ర చేసేందుకు అవ‌కాశం దొరికితే ఎలా ఉంటుంది. అదే ప్ర‌యాణంలో శ్రీరామునికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించే ఛాన్స్ దొరికితే ఎలా ఫీల‌వుతారు. ఇప్పుడు అలాంటి బంప‌ర్ ఆఫ‌ర్‌నే ఐఆర్‌సీటీసి ప‌రిచ‌యం చేస్తోంది.

శ్రీ రామాయణ యాత్ర పేరుతో ఏప్రిల్ 7న ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా ప్రారంభించనుంది. శ్రీ రామాయణ యాత్ర అనేది మాయణ సర్క్యూట్ లోని భరత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు థీమ్ ఆధారిత తీర్థయాత్ర. రామాయణానికి సంబంధించి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీలంకను కూడా సందర్శించాలనుకునే వారికి కూడా ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ.

రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది..

ప్యాకేజీలో భాగంగా ఈ రైలు ఎక్కేందుకు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డి సఫ్టరింగ్ నుంచి బయలుదేరి అయోధ్య, జనక్పూర్, సీతామధి, బక్సర్, వారణాసి, మాణికప్పూర్ జంక్షన్, నాసిక్ రోడ్ హోస్పేట్, రామేశ్వరం, భద్రాచలం రోడ్, నాగ్పూర్ స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసి తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీ సర్దార్లాంగ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో స్టేషన్ల నుంచి ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు.

ramayanayatra

విరంగని లక్ష్మీ బాయి, గ్వాలియర్, ఆగ్రా, మధుర స్టేషన్లలో దిగిపోవచ్చు. ఈ ప్ర‌యాణంలో ఎలాంటి క‌ఫ్యూజ‌న్ లేకుండా అధికారిక గైడ్‌లు నిత్యం అందుబాటులో ఉంటార‌ని ఐఆర్‌సీటీసీ చెబుతోంది.

ఖ‌ర్చు కాస్త ఎక్కువే అయినా..

ఈ సుదూర‌ ప్ర‌యాణానికి డ‌బ్బులు కూడా అదేస్థాయిలో ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుందండోయ్‌. ఐఆర్‌సీటీసీ ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం.. ఫస్ట్ ఏసీ కపుల్ సీట్ల ధర (ఇద్దరికి) రూ.1,68,950. ఫస్ట్ ఏసీ క్యాబిన్ సీట్ల ధర రూ. 1,03,020 నుంచి రూ. 1,61,645 ఉంటుంది. అంతేకాదు, అటు నుంచి అటే శ్రీలంకను కూడా సందర్శించాలనుకునేవారు నాగ్పూర్ నుంచి నేరుగా శ్రీలంక వెళ్లవచ్చు. ఏప్రిల్ 23న దేశంలో రామాయణ యాత్ర నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ముగుస్తుంది. అక్కడి నుంచి రైలు ఢిల్లీకి బయలుదేరుతుంది.

ramayanayatara

శ్రీలంక పర్యటనకు వెళ్లేవారు కొలంబోకు వెళ్లడానికి నాగ్ పూర్ నాగ్పూర్ విమానాశ్రయానికి వెళతారు. ఈ ప్యాకేజీ ధర ఒక్కరికి రూ.82,880, ఇద్దరికయితే రూ.69,620 (ఒక్కొక్కరికి), అదే ముగ్గురుంటే ఒక్కొక్కరికీ రూ.67,360 చొప్పున ఉంటుంది. కుటుంబ‌స‌మేతంగా ఈ విహారానికి ఖ‌ర్చు ఎక్కువ‌యినా జీవితంలో ఒక్కసారైనా చూడాల‌నుకునే ఇలాంటి సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌ను చూసే అవ‌కాశం దొరికిన‌ప్పుడు ఆ మాత్రం చెల్లించ‌క త‌ప్ప‌దనుకోండి.

More News

Read more about: irctcs new package
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+