Search
  • Follow NativePlanet
Share
» »మార్వెల్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పేరుతో ఐఆర్‌సీటీసీ స‌రికొత్త టూర్ ప్యాకేజీ..!

మార్వెల్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పేరుతో ఐఆర్‌సీటీసీ స‌రికొత్త టూర్ ప్యాకేజీ..!

ఐఆర్‌సిటిసి నిత్యం ప్ర‌యాణికుల కోసం స‌రికొత్త టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా, ఐఆర్‌సిటిసి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృశ్నేశ్వర ఆలయాన్ని సందర్శించాల‌నుకునేవారికోసం ఓ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఘృశ్నేశ్వర ఆలయ దర్శనంతో పాటు అజంతా, ఎల్లోరా గుహల్ని కూడా చూసే అవ‌కాశం క‌ల్పించ‌నుంది. అతి త‌క్కువ స‌మ‌యంలో తక్కువ ధ‌ర‌తో ఈ ప్యాకేజీని బుక్‌చేసుకునే అవ‌కాశం ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సిటిసి క‌ల్పించింది. మ‌రి వాటి పూర్తి వివ‌రాలేంటో చూసేద్దాం ప‌దండి.

ఐఆర్‌సిటిసి మార్వెల్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (MARVELS OF MAHARASHTRA) పేరుతో ఈ ప్యాకేజీని ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రైన్ జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే సంద‌ర్శ‌కులు తెలంగాణ‌లోని కాచిగూడ, కామారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, నిజామాబాద్‌ స్టేషన్లలో ట్రైన్ ఎక్కే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ఈప్యాకేజీ ముగిసిన త‌ర్వాత కాచిగూడలో ట్రైన్ దిగాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ ధ‌ర రూ.7,400 నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లతో ఈ టూర్ ప్యాకేజీ కొనసాగుతుంది. ప్రతీ శనివారం ప్ర‌యాణికుల‌కు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ సెప్టెంబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది.

ajanta caves

నాలుగురోజుల టూర్ షెడ్యూల్ ఇదే..

ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడలో 17064 అనే నెంబ‌ర్‌గ‌ల అజంతా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ బ‌య‌లుదేరుతుంది. ఆ రోజు నైటంతా జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యం 4:40 గంటలకు ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఆ త‌ర్వాత హోటల్‌కు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుంటారు. అనంత‌రం అక్క‌డినుంచి ఎల్లోరా అందాలను చూసేందుకు ప్ర‌యాణం మొద‌లెడ‌తారు. ఆ తర్వాత ఘృశ్నేశ్వర ఆలయాన్ని సందర్శించుకుంటారు.

ఇక సాయంత్రం కాగానే బీబీ కా మక్బారాను ఆల‌యాన్ని తిల‌కిస్తారు. ఇక ఆ రోజు రాత్రంతా అక్క‌డే ఉండాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం టిఫిన్ చేశాక‌, అజంతా గుహ‌ల్ని చూసేందుకు ప‌య‌న‌మ‌వుతారు. ఆ త‌ర్వాత సాయంత్రం కాగానే ఔరంగాబాద్‌ చేరుకుంటారు. అక్క‌డ రాత్రి 8 గంటలకు17063 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ఎక్కుతారు. మ‌రుస‌టి రోజు అంటే నాలుగోరోజు ఉద‌యం 9:45 గంటలకు కాచిగూడ చేరడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ellora caves

ప్యాకేజీ ధ‌ర‌లివే..

ఈ టూర్ ప్యాకేజీ ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. ఒకరు నుంచి ముగ్గురు వ్యక్తులు ఈ ప్యాకేజీ బుక్‌ చేసుకుంటే కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.22,920చెల్లించాల్సి ఉంటుంది. ఇద్ద‌రు షేర్ చేసుకుంటే మాత్రం రూ.12,650 ఉంటుంది. అదే ముగ్గురికయితే రూ.10,050 చెల్లించాలి. ఇక‌, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులు విత్ బెడ్ అయితే రూ.8,630 గా నిర్ణ‌యించారు. విత్ అవుట్ బెడ్ రూ.6,890 చెల్లించాలి.

స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌) రూమ్‌ సింగిల్ షేరింగ్ చేసుకుంటే రూ.21,440 చెల్లించాలి. ట్విన్ షేరింగ్‌కయితే రూ.11,170 నిర్ణ‌యించారు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8,570 ఉంటుంది. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో క‌లిపి రూ.7,150 గా నిర్ణ‌యించారు. విత్ అవుట్ బెడ్ అయితే రూ.5,410 చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్‌ ఏసీ కంఫ‌ర్ట్‌లో నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు కలిసి బుక్‌ చేసుకుంటే మాత్రం డబుల్‌ షేరింగ్‌కు రూ.9,930 చెల్లించాలి. ట్రిపుల్‌ షేరింగ్ అయితే, రూ.8,880 చెల్లించాలి.

5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ. 8,630 ఉంటుంది. విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,890 వెచ్చించాల్సి ఉంటుంది. అదే స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌) డబుల్‌ షేరింగ్ అయితే రూ.8,440 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.7,400గా నిర్ణ‌యించారు. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో క‌లిపి రూ.7,150 ఉంటుంది. అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 5,410 చెల్లించాల్సి ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+