తమిళనాడులో ప్రసిద్ధిచెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికోసం ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఐఆర్‌సిటిసి ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు పేరుతో ఈ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తమిళనాడులోని కుంభకోణం, రామేశ్వరం, మధురై, తంజావూరు వంటి ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాలను వీక్షించొచ్చు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి ఆపరేట్ చేస్తోంది.
ప్రయాణ వివరాలివే..
ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి విమానాశ్రయం చేరుకోగానే అక్కడి నుంచి పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యాక, నైటంతా అక్కడే స్టే చేస్తారు. ఇక, రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీరంగం ఆలయాన్ని, జంబుకేశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తంజావూరు పర్యటన ఉంటుంది. అక్కడ బృహదీశ్వర ఆలయ వీక్షణ అనంతరం కుంభకోణం బయలుదేరుతారు. అక్కడ ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ నైట్‌కు కుంభకోణంలోని హోటల్‌లో స్టే చేస్తారు. మూడో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకున్నాక చిదంబరానికి బయలుదేరుతారు. అక్కడ నటరాజ స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం గంగైకొండ చోళపురం వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి కుంభకోణానికి వస్తారు. భోజనం అనంతరం కుంభకోణంలోని స్థానిక ఆలయాలైన కాశీ విశ్వనాథర్, సారంగపాణి, ఆది కుంభేశ్వర ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి కుంభకోణంలోనే బస ఉంటుంది.

ఇక, నాలుగో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశాక, చెక్ అవుట్ చేసి రామేశ్వరం బయలుదేరుతారు. ఆ రోజు మధ్యాహ్నానికి రామేశ్వరం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. కాసేపు విశ్రాంతి తీసుకుని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి రామేశ్వరంలోనే స్టేఇయింగ్ ఉంటుంది. ఐదో రోజు ఉదయాన్నే దనుష్కోడి సందర్శన ఉంటుంది. ఆ తర్వాత హోటల్‌లో టిఫిన్ చేశాక, అబ్దుల్ కలాం మెమోరియల్ వంటివి సందర్శిస్తారు. అనంతరం మధురైకి బయలుదేరి వెళ్తారు. రాత్రికి మధురైలో స్టేయింగ్ ఉంటుంది. ఆరో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసాక, మీనాక్షి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి ఫ్లైట్‌లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ పర్యటన ముగుస్తుంది.
ధరల వివరాలివే..
ఈ ప్యాకేజీలో భాగంగా కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.41,100 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ ఆక్యూపెన్సీకయితే రూ.31,700 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.30,500గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.28,000 ఉంటుంది. విత్ అవుట్ బెడ్ రూ.23,850 చెల్లించాలి. 2 -4 సంవత్సరాల చిన్నారులకు విత్ అవుట్ బెడ్‌తో రూ.18,050 నిర్ణయించాల్సి ఉంటుంది. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీలో విమాన టికెట్లు (హైదరాబాద్ - తిరుచ్చి/ మధురై - హైదరాబాద్) తో పాటు హోటల్ అకామిడేషన్, 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్లు సైట్ సీయింగ్ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ అక్టోబర్ 22న పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.



Click it and Unblock the Notifications













