Search
  • Follow NativePlanet
Share
» »మంచు దుప్ప‌టి క‌ప్పుకున్న గుల్మార్గ్ అందాల‌ను చూసే స‌మ‌య‌మిది!

మంచు దుప్ప‌టి క‌ప్పుకున్న గుల్మార్గ్ అందాల‌ను చూసే స‌మ‌య‌మిది!

మంచు దుప్ప‌టి క‌ప్పుకున్న గుల్మార్గ్ అందాల‌ను చూసే స‌మ‌య‌మిది!

ఎటుచూసినా ప‌చ్చ‌ని ఉద్యానవనాలు.. ఆకాశాన్నంటే పర్వతశిఖరాలు.. మంచు దుప్పటి కప్పుకున్న పచ్చికబయళ్ళు.. అందమైన హిమాలయాల్లోని పచ్చని ప్రకృతి సోయగాల చిరునామా గుల్మార్గ్. శీతాకాలం వ‌చ్చిందంటే చాలు.. అక్కడి నేలంతా వైవిధ్యమైన పువ్వులతో పరచిన సుందర ఉద్యానవనమే. ఈ ప్రాంత అందాల గురించి ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంతో పోటీపడుతూ.. వరుస క్రమంతో ఎంతో క్రమశిక్షణతో నిలబడినట్టుగా కనిపించే పచ్చని చెట్ల సోయగం.. నిజంగా చిత్రకారుడు గీసిన ఓ సుందర చిత్రంలాంటిదే గుల్మార్గ్. ఇన్ని అందాలను నిండుగా నింపుకొన్న గుల్మార్గ్ పర్యాటక విశేషాల శీతాకాలపు అందాల‌ను చూసొద్దాం రండి.

శీతాకాల‌పు మంచుదుప్ప‌టి క‌ప్పుకున్న గుల్మార్గ్ అందాలు చూసేందుకు జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో అడుగుపెట్టాల్సిందే. ఇక్కడికి చేరుకునేందుకు శ్రీనగర్ నుంచి రెండున్నర గంటలు బస్సు ప్రయాణం చేయాలి. వింటర్ స్పోర్ట్స్ హాలిడేకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే గుల్మార్గ్ ప‌ర్యాట‌కపు అనుభూతుల‌ను రుచిచూసేందుకు వింట‌ర్ సీజ‌న్ ఎంతో అనువైన‌ది. మ‌రీ ముఖ్యంగా గుల్మార్గ్ కేబుల్ కార్ విజిట్‌ జీవితంలో మర్చిపోలేని క్ష‌ణాల‌ను చేరువ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్ క్రీడా మైదానం ఈ సీజ‌న్‌లో కొత్త అందాల‌ను సంత‌రించుకుంటుంది. అంతేకాదు, మంచుదుప్పటి కప్పేసినట్లు కనిపించే ఇక్కడి ప్రాంతం స్కైయింగ్ క్రీడకు ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. చలికాలపు ఆటవిడిదిగా కూడా గుల్మార్గ్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది.

ఆకాశ‌పు అందాల‌ను వీక్షించేందుకు..

ఆకాశ‌పు అందాల‌ను వీక్షించేందుకు..

గుల్మార్గ్ ప‌ర్య‌ట‌న‌లో గొండోలా లిఫ్ట్ అస్స‌లు మిస్స‌వ్వ‌కూడ‌దు. ఈ ప్ర‌దేశం కేబుల్ కార్‌కు ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. ప్ర‌కృతి ప్ర‌సాదించిన నిర్మ‌ల‌మైన ఆకాశ‌పు అందాల‌ను వీక్షించేందుకు దీనిని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశారు. సముద్రమట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ లిఫ్ట్ రెండుమార్గాల ద్వారా సంద‌ర్శ‌కుల‌ను మోసుకువెళుతుంది. అందులో మొదటిది గుల్మార్గ్ నుంచి ఐదు కిలోమీటర్లు, రెండవది కొంగ్దూర్‌ నుంచి ఆఫర్వాట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కేబుల్ కార్‌లో పర్యాటకులు ప్రయాణించి, అక్క‌డి ప్ర‌కృతి అందాలను మ‌న‌సారా ఆస్వాదించవచ్చు. గుల్మార్గ్ నుంచి కొంగ్దూర్ వెళ్ళే మార్గంలో 19 టవర్లు ఎదురవుతాయి.

ఈ లిఫ్ట్ గంటకు 1500 మందిని వ‌ర‌కూ చేరవేస్తుంది. కొంగ్దూర్ నుంచి ఆఫర్వాట్‌ వెళ్ళే మార్గంలోనూ 19 టవర్లు ఉంటాయి. ఇది.. సుమారు గంటకు 600 మందిని చేరవేస్తుంది. ఇందులో ప్రయాణం ఓ విహంగ వీక్షణమే! ఆకాశాన్నంటేలా కనిపించే శిఖరాగ్ర అందాలు, నిటారైన పచ్చని చెట్లు. సోయగాలు, ఇలా అక్కడి ప్రకృతి అందాలు వ‌ర్ణ‌న‌కు చిక్క‌వంటే అతిశయోక్తి కాదు.

రంగుపూలతో కన్నుల పండగ!

రంగుపూలతో కన్నుల పండగ!

గుల్మార్గ్‌లో లభించే పువ్వుల వైవిధ్యం మరెక్కడా కనిపించదు. నిజానికి గుల్మార్గ్ పేరు వెనుక‌ ఎంతో చారిత్ర‌క నేప‌థ్య‌మే ఉంది. గుల్ అంటే పువ్వులు, మార్గ్ అంటే పచ్చిక బయళ్లు.. మొత్తంగా గుల్మార్గ్ అంటే పువ్వులతో కూడిన పచ్చికబయళ్ళు అని అర్థమట! అలా అనేక పూల రంగులతో, పచ్చని బయళ్లతో మహాద్భుతంగా ఇక్కడ కనిపిస్తుంది గుల్మార్గ్. ఇక్క‌డి పూల అందాలు పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తాయంటే ఇక్కడికి వచ్చిన సందర్శకులెవ్వరూ ఆ రంగురంగుల పువ్వులను సేకరించకుండా ఉండలేనంతగా.

అంతేకాదు, ఇక్కడ టీ చాలా ప్రసిద్ధి. కహనా పేరుతో పొగ‌లుకక్కే టీలో బాదాం, ఏలకులు, దాల్చిన చెక్క వేసి వేడి వేడిగా ఆస్వాదించేందుకు ఇక్క‌డ సంద‌ర్శ‌కులు క్యూ క‌డ‌తారు. ఇక్కడ కురిసే మంచు అచ్చం వెనీలా ఐస్ క్రీమ్‌ను పచ్చిక పై పరచినట్లుగా ఉంటుంది. అంతేకాదు, ఈ చుట్టుపక్కల తాగడానికి మంచినీళ్ళు దొరకవు. నీళ్ళు కావాలంటే, ఆ మంచును కరిగించుకుని తాగాల్సిందే!

ఈ ప్రాంతం మంచు క్రీడలకు విడిది కేంద్రం..

ఈ ప్రాంతం మంచు క్రీడలకు విడిది కేంద్రం..

శీతాకాలం వ‌చ్చిందంటే గుల్మార్గ్ మంచులో స్కేటింగ్ చేసేందుకు దేశ‌విదేశాల‌నుంచి ప‌ర్యాట‌క ప్రేమికులు ఇక్క‌డ వాలిపోతారు. తెల్లని మంచుపై ఆటలాడే ప్రత్యేకమైన క్రీడలకు ఈ ప్రదేశం చిరునామాగా చెప్పొచ్చు. ఆ మంచుదారిలో కాలుమోపితే మోకాళ్ళ వరకూ కూరుకుపోతాయి. అలా నడుచుకుంటూ కొంతదూరం వెళితే గండోలా రోప్ వేపైన మంచుకొండల మీదకి చేరుకునే అవ‌కాశం ఉంటుంది. ఇక్కడి ప్రజలు కాగితం గుజ్జుతో రకరకాల షో పీసులు, ఎంబ్రాయిడరీ, జరీ వర్క్, తివాచీలు తయారుచేస్తారు. వీటిని ఫాస్మిలాన్‌ అనే దారం రాట్నం మీద వడుకుతారు. రంగుల దారాలు పెన్సిలంత కర్రలకి చుట్టి, వరుసగా పలు రకాల రంగుల్లో ముంచి, సంగీతంలో సరిగమల్లా (ప్ర‌తి రంగుకు ఒక ఆకారం చొప్పున) రాసుకుని అది చూసి షాల్స్ (శాలువా) అల్లుతారు.

ఇక్క‌డికి చేరువ‌లో ఉన్న‌ హమ అనే ఊరిలో జరీ పని కూడా చేస్తారు. ఈ జరీ పనిని మావార్ అంటారు. పూర్వపు రాజులు, బాద్‌షాలు తలపాగాలు, నడుంకి కట్టుకునే పట్టాలు, అంగీలు, జరీ వర్క్ ఉన్నవి ధరించేవారు. జరీ వర్క్ ఉన్న షాల్ నేయడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుందంటే కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది.

గుల్మార్గ్ ఓ భిన్న సంస్కృతి స‌మ్మేళ‌నం..

గుల్మార్గ్ ఓ భిన్న సంస్కృతి స‌మ్మేళ‌నం..

గుల్మార్గ్ పర్యాటకంలో భిన్నమైన సంస్కృతి తారసపడుతుంది. గుంపులుగా వ‌చ్చే గొర్రెల కాపరులు వేసవిలో పాకిస్తాన్ నుంచి గొర్రెలమందల్ని తెచ్చి, గుల్మార్గ్, సోన్ మార్గాల దగ్గరకొస్తారు. వాళ్ళు మందల్ని తేవడం అంతా ఆర్మీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి చలికాలం వచ్చేంత వరకూ ఈ ప్రాంతంలోనే సంచారులుగా జీవిస్తారు. చలికాలం అయిపోగానే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతారు. ఈ సంచార జాతుల ప‌ర్య‌ట‌న‌ వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఓ ఆచారం. ఇంకో విశేషం ఏమిటంటే, ఇక్కడ కొన్ని హిందూ దేవాలయాల్లో ముస్లిం పూజారులు కూడా ఉంటారు. ఆర్మీ యూనిట్లతో గుడి, చర్చి, మసీదు, గురుద్వారాలు అన్నీ ఒకేచోట చూసే అవ‌కాశం ల‌భిస్తుంది.

గుల్మార్గ్ ఎలా చేరుకోవాలి..

గుల్మార్గ్ ఎలా చేరుకోవాలి..

గుల్మార్గ్‌కు విమాన ప్రయాణం ద్వారా అయితే శ్రీనగర్ విమానాశ్ర‌యం ఇక్క‌డ‌కు స‌రిగ్గా 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి గుల్మార్గ్ చేరుకునేందుకు జీపులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. శ్రీనగర్ నుంచి అయితే దేశంలోని అనేక ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ఉన్నాయి. రైలు ప్రయాణం ద్వారా గుల్కార్గ్‌కు చేరుకునేందుకు జమ్మూలోని తావి రైల్వేస్టేషన్ సమీపం ఉంటుంది. మన దేశంలోని ఉత్తరప్రాంతాల వారు ట్రైన్‌లో నేరుగా జమ్మూ చేరవచ్చు. జమ్మూ రైల్వేస్టేషన్ మీదుగా వచ్చే రైళ్లు దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలనూ కలుపుతూ పోతుంది. అంతేకాదు జమ్మూకాశ్మీర్లోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రయివేటు బస్సులను ఉపయోగించవచ్చు.

More News

Read more about: gulmarg srinagar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+