కళలను ఇష్టపడేవారిని కాలా ఘోడా ఆర్ట్ ఫెస్టివల్ ఆహ్వానిస్తోంది!
ప్రయాణంతో పాటు మీకు కళలు అంటే కూడా ఇష్టం అయితే, కాలా ఘోడా ఫెస్టివల్ చూసేందుకు ప్లాన్ చేయండి. కాలా ఘోడా ఆర్ట్ ఫెస్టివల్ ఈ ఏడాదికి గానూ ఇప్పటికే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫెస్టివల్ దేశ సాంస్కృతిక నృత్య కళ మరియు సంగీతాన్ని ఇష్టపడే వారికి ఒక ప్రధాన పండుగగా భావించవచ్చు. ఫిబ్రవరి నెలలో జరిగే ఈ సాంస్కృతిక ఉత్సవం దేశంలోని ప్రధాన కళా ఉత్సవాల్లో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది.
కాలా ఘోడా ఫెస్టివల్ నృత్యం, కళలు మరియు సంగీత ప్రియులకు చాలా ప్రత్యేకమైన పండుగ. దీనిని దేశ ఆర్థికరాజధాని ముంబయిలో ఘనంగా నిర్వహిస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి శనివారం ప్రారంభమై రెండవ ఆదివారం ముగుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి 12 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు ఇక్కడకు వచ్చి అనేక కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో ఉత్సవ ప్రాంగణం కిటకిటలాడుతోంది.

కళాఖండాలు మరియు ప్రదర్శనలు..
నృత్యం, సంగీతం, పెయింటింగ్, హస్తకళ, గ్రాఫిక్స్, సినిమా మరియు సాహిత్యం వంటి అనేక రకాల కళలు ఈ ఉత్సవంలో చూపరులను కనువిందు చేస్తాయి. మీరు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ఇక్కడకు వచ్చినా ఆనందంగా గడిపేందుకు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కాలా ఘోడా ఫెస్టివల్ అచ్చంగా ఢిల్లీలో జరిగే ట్రేడ్ ఫెయిర్‌ని పోలి ఉంటుంది. ఇక్కడ భారతదేశంతో పాటు, విదేశీ కళాకారులు కూడా అందమైన కళాఖండాలు మరియు ప్రదర్శనలను చూసే అవకాశాన్ని పొందుతారు.
కాబట్టి మీరు కళా ప్రేమికులైతే ఈ పండుగను సందర్శించే అవకాశాన్ని అస్సలు మిస్సవ్వొద్దు. ఇక్కడ మీరు వివిధ రకాల కళల గురించి నేర్చుకుంటారు మరియు తెలుసుకుంటారు. పెద్దలతోపాటు పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి అనేక కార్యకలాపాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడకు రావడం ద్వారా మీరు బట్టలు, బూట్లు, బ్యాగులు మరియు అలంకరణ వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు.

కాలా ఘోడా పేరు వెనుక కథ..
కాలా ఘోడా కళా మహోత్సవ్ అనేది ముంబయిలో జరిగే ఓ కళల ఉత్సవం మాత్రమే. దీనిని కాలా ఘోడా అనే సంస్థ 1999లో ప్రారంభించింది. కాలా ఘోడా అనే పేరు వెనుక ఎటువంటి చారిత్రక నేపథ్యమూ లేదు. ఇది దక్షిణ ముంబయి ప్రాంతంలో నల్ల గుర్రం విగ్రహం ఉన్న ప్రదేశంలో నిర్వహించబడుతుంది. అందుకే దీనిని కాలా ఘోడా పండుగ అంటారు. ఈ నల్ల గుర్రం విగ్రహం బ్రిటిష్ వారి కాలం నుంచి ఉంది. కాలా ఘోడా ఉత్సవాన్ని సందర్శించే సమయం ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.
ఈ పండుగకు వెళ్లేందుకు మీరు ఎలాంటి టిక్కెట్లు తీసుకోనవసరం లేదు. తొమ్మిది రోజుల పాటు వివిధ ఈవెంట్‌లను ఉచితంగా ఆస్వాదించవచ్చు. కుటుంబ సమేతంగా ఆనందకరమైన క్షణాలను చేరువ చేసేందుకు కాలా ఘోడా మంచి గమ్యస్థానం. మరెందుకు ఆలస్యం మీరూ బయలుదేరండి!



Click it and Unblock the Notifications












