Search
  • Follow NativePlanet
Share
» »ఈ గణపతి మీ నుంచి శనిని దూరంగా ఉంచుతారు?

ఈ గణపతి మీ నుంచి శనిని దూరంగా ఉంచుతారు?

శ్రీ కమండల గణపతి దేవాలయం చిక్కమగళూరులోని కొప్పలో ఉంది. ఈ కమండల గణపతి చరిత్ర, టైమింగ్స్ తెలుసుకోండి.

భారతదేశంలో ఎన్నో వినాయకుడి దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా పురాణ ప్రధానమైన దేవాలయాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేవాలయంలోని గణపతి ఈ జగత్తును సష్టిస్తాడని చెబుతారు. ఆ దేవాలయానికి ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అటువంటి విశిష్టమైన దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం....

కమండల గణపతి

కమండల గణపతి

P.C: You Tube

కమండల కణపతి దేవస్థానం చిక్కమగళూరు జిల్లాలోని కొప్ప జిల్లాలో ఉంది. కొప్ప బస్‌స్టాండ్ నుంచి ఈ దేవాలయం కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక బెంగళూరు నుంచి ఇక్కడకు చేరుకోవడానికి దాదాపు 359 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

కమండల గణపతి

కమండల గణపతి

P.C: You Tube

ఇక్కడ ఉన్న పుష్కరిణిని కమండల తీర్థం అని అంటారు. ఈ పుష్కరిణిలోని ఏడాదిలో 365 రోజులూ నీరు చేరుతూనే ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే శనిదోషం పరిసమాప్తం అవుతుందని చెబుతారు.

కమండల గణపతి

కమండల గణపతి

P.C: You Tube

ఈ నీటిని చిన్న పిల్లలకు తాగిస్తే వారులో విద్యలో ముందుంటారని, జ్జానపక శక్తి పెరుగుతుందని స్థానికుల నమ్మకం. శనిదేవుడి నుంచి తప్పించుకోవడానికి పార్వతీ దేవి ఈ ప్రాంతానికే వచ్చిందని చెబుతారు.

కమండల గణపతి

కమండల గణపతి

P.C: You Tube

అటు పై ఇక్కడ తపస్సు చేయడానికి ముందు గణపతి పూజ చేయడానికి సిద్ధమవుతారు. అయితే పూజకు అవసరమైన నీరు ఇక్కడ దొరకదు. దీంతో బ్రహ్మ దేవుడిని వేడుకొనగా ఆ బ్రహ్మదేవుడు ఇక్కడ బాణాన్ని ప్రయోగించి నీటిని స`ష్టించారని చెబుతారు.

కమండల గణపతి

కమండల గణపతి

P.C: You Tube

ఇక్కడ గణపతి విగ్రహం విశిష్టంగా ఉంటుంది. యోగముద్రలో కుర్చొన్న రీతిలో ఇక్కడ గణపతి విగ్రహం ఉండటం విశేషం. వర్షాకాలంలో ఇక్కడి పుష్కరిణిలోని నీరు గణపతి పాదం వరకూ చేరుతాయని చెబుతారు.

కమండల గణపతి

కమండల గణపతి

P.C: You Tube

ఆ సమయంలో గణపతిని దర్శించుకొంటే చేసిన సకల పాపాలు పోతాయని చెబుతారు. ఈ పుష్కరిణి కమలం ఆకారంలో ఉంటుంది. ఇక పుష్కరిణిలోని నీరు గణపతిని తాకడం వల్ల ఈ గణపతిని కమండల గణపతి అని అంటారు.

కమండల గణపతి

కమండల గణపతి

P.C: You Tube

ఉదయం 7.30 గంటల నుంచి 8.30 వరకూ ఇక్కడి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎటువంటి పూజలు జరుపరు. అందువల్ల ఈ దేవాలయానికి వెళ్లాలనుకొంటే తెల్లవారుజామున ఇక్కడికి వెళ్లడం ఉత్తమం.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+