చార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఉత్తరాఖండ్‌లో వెలసిన ఈ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కేవలం కేదార్ నాథ్, బద్రీనాథ్ మాత్రమే సందర్శించగలరు. రోడ్డు మార్గం ద్వారా జరిగే ఈ ట్రిప్ ఏడు రోజులపాటు ఉంటుంది.
ఈ వారం రోజుల్లో రాష్ట్రంలోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు పవిత్ర నదులను కూడా చూసేయొచ్చు. ఈ ట్రిప్ హరిద్వార్ నుంచి ఉంటుంది. ఇక, ఈ టూర్ ప్యాకేజీ ఈ సంవత్సరం మే 23, జూన్ 23, సెప్టెంబర్ 23 తేదీల్లో ఉంటుంది. కేవలం 33100 ప్రారంభ ధరతో ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలేంటో చూసేద్దాం..
ఒక్కో వ్యక్తికి టూర్ ప్యాకేజీ ధర...
సింగిల్ ఆక్యుపెన్సీ రూ.59720 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీ రూ.37510 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 33100 చెల్లించాలి. చైల్డ్ విత్ బెడ్ (ఐదు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలకు) రూ.17320గా నిర్ణయించారు. చైల్డ్ వితవుట్ బెడ్ (5-11 ఏళ్లు) రూ.11540 చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఈ లింక్ ద్వారా https://registrationandtouristcare.uk.gov.in/signin.php ప్రయాణికులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

టూర్ షెడ్యూల్..
ఈ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హరిద్వార్ - గుప్తకాశీ నుంచి బయలుదేరుతుంది. గుప్తకాశీలో హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత ఆ ప్రదేశంలోని ప్రాంతాలను వీక్షించొచ్చు. నైట్ భోజనం, స్టేయింగ్ గుప్తకాశీలోనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సోన్‌ప్రయాగ్‌కు బస్సులో బయలుదేరతారు. అక్కడి నుంచి కేదార్‌నాథ్ 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడివరకు ట్రెక్కింగ్ చేయలేని వారు, నడవలేని వారు డోలీ లేదా గుర్రాన్ని అద్దెకు తీసుకోవచ్చు. కేదార్‌నాథ్ హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆ రోజు నైట్ స్టేయింగ్ కేదార్‌నాథ్‌లో ఉంటుంది.
మూడో రోజు కేదార్‌నాథ్ సందర్శన ఉంటుంది. ఉదయం 4:45 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. దర్శనం, పూజ అనంతరం హోటల్‌కి తిరిగి వస్తారు. ఆ తర్వాత కేదార్‌నాథ్ నుంచి సోన్‌ప్రయాగ్‌కు 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తిరిగి ప్రారంభమవతుంది. అక్కడినుంచి గుప్తకాశీ హోటల్‌కు మీ ప్రయాణం ఉంటుంది.
నాలుగోరోజు ఉదయం 08:00 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి బద్రీనాథ్ ప్రయాణాన్ని మొదలుపెడతారు. అద్భుతమైన ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణం ఉంటుంది. బద్రీనాథ్‌లోని హోటల్‌లో చెక్ ఇన్ చేసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం బద్రీనాథ్ ఆలయ దర్శనం ఉంటుంది. దర్శన అనంతరం రాత్రికి తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. బద్రీనాథ్‌లోనే రాత్రి భోజనం, బస చేస్తారు.
ఇక, ఐదోరోజు ఉదయం బద్రీనాథ్ దర్శనానికి వెళ్తారు. దర్శనం తర్వాత హోటల్‌కు తిరిగి వెళ్లి హోటల్‌లో టిఫిన్ ఆరంగించి అక్కడి స్థానిక ప్రదేశాల సందర్శన ఉంటుంది. వ్యాస్ గుఫా, గణేష్ గుఫా, మాతా మూర్తి ఆలయాలను సందర్శించొచ్చు. మధ్యాహ్నం కరణ్‌ప్రయాగ్ మీదుగా రుద్రప్రయాగ్ కు వెళ్తారు.
రుద్రప్రయాగ్‌లో నైట్ స్టేయింగ్ ఉంటుంది. ఆరోరోజు టిఫిన్ చేశాక ఆధ్యాత్మిక నగరం, యోగా రాజధాని అయిన రిషికేశ్ ప్రయాణం ఉంటుంది. రిషికేశ్ చేరుకున్న తర్వాత అక్కడ ప్రసిద్ధిగాంచిన రామ్ ఝులా, లక్ష్మణ్ ఝులాను సందర్శించవచ్చు. సాయంత్రం హరిద్వార్‌కు ప్రయాణం ఉంటుంది. హరిద్వార్ చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. రాత్రికి హరిద్వార్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.
ఇక, ఏడోరోజు హరిద్వార్‌లో హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. దీంతో ఈ పుణ్యక్షేత్రాల పర్యటన ముగుస్తుంది. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలన్న లేదా ఈ టూర్ బుక్ చేసుకోవాలన్న యాత్రికులు https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDH27 ఈ సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













