Search
  • Follow NativePlanet
Share
» »రాజస్థాన్ లో తలను మాత్రమే పూజిస్తారు

రాజస్థాన్ లో తలను మాత్రమే పూజిస్తారు

ఖాతుశ్యామ్ జీ దేవాలయానికి సంబంధించిన కథనం.

భారతీయ పురాణాల్లో కురుక్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరికొంతమంది తమ ప్రాణాలను అడ్డుపెట్టి పాండవులకు విజయాన్ని చేకూర్చారు. ముఖ్యంగా పాండవులకు విజయం చేకూర్చడానికి ఆ శ్రీ కృష్ణుడు అనేక వ్యూహాలను అమలు పరిచాడు. అటువంటి వాటిలో ఆ కురుక్షేత్రాన్ని 30 సెకెనుల్లోపు ముగించే వీరుడి తలను కానుకగా తీసుకున్నాడు. ప్రస్తుత కథనంలో ఆ వీరుడు ఎవరు? అతనికి ఉన్న దేవాలయం ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ మీ కోసం...

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

మహాభారత యుద్ధంలో వీరత్వం, పరాక్రమాన్నే కాకుండా ఆధ్యాత్మికత కూడా దాగుంది. ఆ కురుక్షేత్రంతో ముడిపడిన ప్రాంతాలు ఇప్పటికీ భారత దేశంలో చాలా చోట్ల కనిపిస్తాయి. కొన్ని పుణ్యక్షేత్రాలుగా కూడా మారి భక్తులను ఆకర్షిస్తున్నాయి.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

అటువంటివాటిలో బార్బరిక దేవాలయం కూడా ఒకటి. బార్బరికుడు భీముడి మునిమనుమడు. ఇతను ఘటోద్ఘజుని కుమారుడు. ఇతను అత్యంత బలిశాలి. హిందూ దర్మంలో ఈ బార్బరికుడిని ఖుతుశ్యామ్ అనే పేరుతో ఆరాధిస్తారు.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

రాజస్థాన్, హర్యాణాలో ఈ ఖుతుశ్యామ్ భక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా అత్యంత భక్తిశ్రద్దలతో ఈ మహాశయుడిని కొలుస్తారు. రాజస్థాన్ లో మాత్రం ఇతడిని బార్బరీకుడనే పేరుతోనే ఎక్కువగా కొలుస్తారు.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

ఇతని ప్రస్థావన స్థానిక కథలతో పాటు మన మహాభారతంలో కూడాకనిపిస్తుంది. కురుక్షేత్రం ప్రారంభానికి ముందు శ్రీ కృష్ణుడు పాండవులను పిలిచి మీకు కురుక్షేత్ర సంగ్రామం ముగించడానికి ఎంత సమయం కావాలని అడుగుతాడు.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

అందరూ బాగా ఆలోచించి తమ ఆలోచనలకు అనుగుణంగా ఒకరు పదిరోజులు చెబితే మరొకరు మూడు రోజులు ఇలా ఎవరికి తోచిన సంఖ్యను వారు చెబుతారు. అయితే బార్బరికుడు మాత్రం కేవలం 30 సెకెనులు చాలు అని చెబుతారు.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

ఈ బార్బరికుడు మహాశివుడి గురించి తపస్సు చేసి 3 బాణాలను సంపాదించాడు. అందులో ఒక్క బాణంతో కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించే బలాన్ని సంపాదించి ఉంటాడు.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

అయితే శ్రీ కృష్ణుడు మాత్రం బార్బరికుడికి కురుక్షేత్ర యుద్ధానికి పంపితే తనకున్న శక్తివంతమైన బాణాలను ప్రయోగిస్తే కురుక్షేత్రంతో పాటు ఈ విశ్వమే నాశనమవుతుందని తెలుసు. అందువల్ల బార్బరికుడిని కురుక్షేత్రానికి పంపకూడదని భావిస్తాడు.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

ఇందు కోసం అతన్ని సంహరించడం ఒక్కటే మార్గమని తెలుసుకొంటాడు. దీంతో తనకు నీ తల కావాలని కోరుతాడు. దీంతో బార్బరికుడు మరుమాట్లాడకుండా తన తలను తీసి శ్రీ కృష్ణుడికి కానుకగా ఇస్తాడు. ఈ బార్బరికుడికి రాజస్థాన్ తో పాటు హర్యాణాలో అనేక దేవాలయాలు ఉన్నాయి.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

ఈ దేవాలయాలన్నింటిలో తలను మాత్రమే పూజించడం గమనార్హం. అయితే రాజస్థాన్ లోని ఖతుశ్యామ్ పేరుతో ఉన్న దేవాలయం చాలా ప్రాచీన, ప్రాచూర్యం చెందినది. ఈ ఖతురామ్ దేవాలయం జైపూర్ నుంచి సుమారు 80 కిలోమీటర్లదూరంలో ఉన్న చికల్దార్ అనే గ్రామంలో ఉంది.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

అదే విధంగా ఢిల్లీ నుంచి 266 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ దేవాలయంలో బార్బరికుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కలియుగ దైవంగా ఈ బార్బరికుడి ప్రార్థిస్తారు. ఇక దేవాలయం ముందర ఒక పెద్ద కొలను కూడా ఉంది.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

ఇందులోని నీటికి అతీత శక్తులు ఉన్నాయని భావిస్తారు. బార్బరికుడిని దర్శించడానికి ముందు భక్తులు ఇందులో స్నానం ఆచరిస్తారు. ఈ దేవాలయం సమీపంలోనే ఒక ఉద్యానవనం ఉంది. ఇందులో పూచిన పువ్వులతోనే స్వామివారిని అలంకరిస్తారు.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

ఈ ఉద్యానవనంలోకి ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ గౌరిశంకర దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం ఆ పరమశివుడు. ఔరంగజేబు ఈ దేవాలయాన్ని అగ్నికి ఆహుతి చేసి చేశాడని చరిత్ర చెబుతోంది.

మహాభారత యుద్ధం

మహాభారత యుద్ధం

P.C: You Tube

మరికొన్ని చోట్ల ఈ బార్బరికుడిని శ్రీ కృష్ణుడి అవతారంగా భావిస్తారు. అందువల్లే బార్బరికుడిని ఖుతుశ్యామ్ అని పిలుస్తారు. అందువల్లే ఈ దేవాలయంలో పూజా విధానాలు వైష్ణవ ధర్మాని అనుసరించి కొనసాగుతాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+