Search
  • Follow NativePlanet
Share
» »లక్నోలోని తొలి డైనోసార్ పార్క్ విశేషాలు తెలుసుకుందామా..?

లక్నోలోని తొలి డైనోసార్ పార్క్ విశేషాలు తెలుసుకుందామా..?

ఈ స‌మ్మ‌ర్‌లో పిల్లల‌తో క‌లిసి చాలామంది విహార‌యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. పిల్ల‌ల‌కు ఇష్ట‌మైన ప్రాంతాల‌ను తీసుకెళ్లాల‌ని ప్రణాళిక‌లు వేస్తుంటారు. స‌హ‌జంగా పిల్ల‌లు జురాసిక్ వ‌ర‌ల్డ్, డైనోసార్ వంటి కార్టూన్స్ చూస్తుంటారు. అలాంటి వాటినే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. అటువంటి వారు త‌ప్ప‌కుండా ల‌క్నోను సంద‌ర్శించాల్సిందే. ఎందుకంటే, ఇక్క‌డ పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన ఓ ప్ర‌దేశం త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అదే జురాసిక్ పార్క్.

లక్నోను నవాబుల నగరం అని పిలుస్తుంటారు. అలాంటి ల‌క్నోలో త్వ‌ర‌లోనే తోలి డైనోసార్ పార్క్ ప్రారంభం కానుంది. ఈ పార్క్‌లో పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన డైనోసార్ ఉండ‌నుంది. అదికూడా సుమారు 55 అడుగుల ఎత్తు ఉన్న డైనోసార్‌. లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్‌లో త్వరలో డైనోసార్ పార్క్ ప్రారంభం కానుంది. ఇది రాష్ట్రంలోని తొలి డైనోసార్ పార్క్. ఇది కేవ‌లం లక్నోలోనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోనే ఈ రకమైన మొదటి పార్కుగా నిలవనుంది. ఈ పార్క్ సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంటుంది.

ఈ 'జురాసిక్ పార్క్'లో డైనోసార్ల భారీ నమూనాలు ఉంటాయి. అవి కేవ‌లం విగ్ర‌హంలా నిల‌బ‌డ‌వు. రోబోల వలె తలలను అక్కడక్కడా కదిలిస్తూ ఉంటాయి. కళ్ళు మెరవ‌డంతో పాటు అవి అరుస్తుంటాయి కూడా. ఇక‌, ఈ భారీ రోబోటిక్ డైనోసార్లన్నింటినీ జపాన్, తైవాన్ నుండి భారతదేశానికి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. టైరన్నోసారస్ రెక్స్, వెలోసిరాప్టర్ మరియు ట్రైసెరాటాప్స్ వంటి డైనోసార్ల ప్రత్యక్ష రోబోటిక్ నమూనాలు ఈ పార్క్‌లో ఉంచబడ్డాయి.

Know the features of the first dinosaur park in Lucknow

ఇత‌ర ఆక‌ర్ష‌ణ‌లు ఎన్నో..

కేవ‌లం ఈ పార్క్‌లో డైనోసార్లే కాదు. 'జురాసిక్ పార్క్'కి వచ్చేవారికి ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. మంచు యుగంలో భూమిపై కనిపించే మముత్‌లు కూడా ఇక్క‌డ ప్ర‌త్య‌క్షం కానున్నాయి. ఇవి నేటి ఏనుగులను పోలి ఉంటాయి. వీటితో పాటు కింగ్ కాంగ్, గాడ్జిల్లా మొదలైన భారీ సైజు మోడల్స్ కూడా ఇక్కడ తయారు చేయబడ్డాయి. వాటి కోసం స్క్రాప్ ఉపయోగించబడింది. పర్యాట‌కులు పార్క్‌లోకి ప్రవేశించిన వెంటనే, 4 మీటర్ల ఎత్తున్న రెండు పెద్ద చెట్లు వారికి సాద‌ర ఆహ్వానం ప‌లుకుతాయి.

జూన్‌లో ప్రారంభం కానున్న పార్క్‌...

ఈ పార్క్‌ను సంద‌ర్శించి అల‌సిపోయిన ప‌ర్యాట‌కులు సేద‌తీరేందుకు ఇక్క‌డ కేఫ్‌లు కూడా ఉన్నాయి. ఇక్క‌డ రుచిక‌ర‌మైన ఫుడ్‌ను ఆస్వాదించొచ్చు. ప‌ర్యాట‌కుల‌కు ఎంతో ఇష్టమైన స్నాక్స్, శీతల పానీయాలు ఇక్క‌డ లభిస్తాయి. ఉద్యానవనంలో ఒక భాగంలో జలపాతం, డైనోసార్ ఆకారంతో ఒక గుహ నిర్మించబడి ఉంటుంది. దీంతో పాటు, డైనోసార్ రైడ్ కూడా ఇక్కడ చేయవచ్చు. ఈ రైడ్ పిల్లలతో పాటు యువతను ఎంత‌గానో ఆకర్షిస్తుంది. ఈ 'జురాసిక్ పార్క్' పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ఆధారంగా నడుస్తుంది.

ఈ పార్కును లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డిఎ) ఒక ప్రైవేట్ కంపెనీ సహకారంతో సిద్ధం చేస్తోన్న‌ట్లు స‌మాచారం. దీన్ని పూర్తిగా సిద్ధం చేసేందుకు దాదాపు రూ.8 కోట్లు ఖర్చయిన‌ట్లు తెలుస్తోంది. ఈ పార్కును సిద్ధం చేసిన కంపెనీ వచ్చే 15 ఏళ్లపాటు ఈ పార్కు నిర్వహణ బాధ్యతను కూడా తీసుకోనుంది. ఈ పార్క్ జూన్‌లో సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది.

ప్ర‌వేశ రుసుము వివ‌రాలు..

ఈ పార్క్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప‌ర్యాట‌కులకు అందుబాటులో ఉంటుంది. ఇక‌, ఇందులో ప్ర‌వేశించేందుకు పెద్దలక‌యితే ఒక్కొక్కరికి రూ. 100 పిల్లలు (12 సంవత్సరాల లోపు) రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. శని, ఆదివారాల్లో ఈ పార్క్ ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్ర‌మే తెరుస్తారు.

ప్ర‌వేశ రుసుము పెద్దలకయితే, ఒక్కొక్కరికి రూ. 100 పిల్లలు (12 సంవత్సరాల లోపు), ఒక్కో చిన్నారికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ డైనోసార్ల గురించి ప‌ర్యాట‌కులు సమాచారం ఇవ్వడానికి, పార్క్‌లోని వివిధ ప్రదేశాలలో సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మ‌రెందుకాల‌స్యం మీ పిల్ల‌ల‌తో పాటు క‌లిసి ఈ పార్క్‌ను సంద‌ర్శించేయండి.

More News

    Read more about: lucknow uttar pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+