Search
  • Follow NativePlanet
Share
» »కోటొక్క లింగాలకు ... కొలనుపాక !!

కోటొక్క లింగాలకు ... కొలనుపాక !!

కొలనుపాక గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము " కాశీ కొలనుపాక బింభావతి పట్టణం "గా పిలువబడేను. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై.

By Mohammad

కొలనుపాక తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా లో కలదు. జిల్లా ప్రధాన కేంద్రం అయిన భువనగిరి నుండి 30 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ - హైదరాబాదు మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరుకు సుమారు 6 కి.మీ. దూరంలో ఈ గ్రామం కలదు. కొలనుపాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం జలసూచి, చిన్న లేదా మధ్యపాటి చెరువు అన్న అర్థం వస్తోంది. పాక అనేది గృహసూచి.

గ్రామ చరిత్ర

ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము " కాశీ కొలనుపాక బింభావతి పట్టణం "గా పిలువబడేను. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. కాకతీయ రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలంనాటికి కొల్పాక్''గా మారింది. ప్రస్తుతం 'కూల్పాక్' లేదా 'కొలనుపాక' అని పిలువబడుతున్నది.

ఆలయం ప్రవేశంలో నంది విగ్రహం

ఆలయం ప్రవేశంలో నంది విగ్రహం

చిత్రకృప : Bhagya Latha

గ్రామ చరిత్ర, విశేషాలు

ఈ గ్రామము చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క (కొటి ఓక్కటి) లింగము నూట ఓక్క చెరువు - కుంటలు ఉన్నాయి. ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామిగా అవతరించాడు. రేణుకా చార్యుని జన్మ స్థలము (సోమేశ్వర ఆలయం) వీరనారాయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయము, 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) ఉన్నాయి. ఈ స్థలాలన్నిటినీ సకుటుంబ సమేతంగా దర్శించవచ్చు.

గర్భగుడిలోని విగ్రహం

గర్భగుడిలోని విగ్రహం

చిత్రకృప : Veerashaiva Dharmakshetram Sri Kolanupaka‎

కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం

నల్గొండజిల్లా ఆలేరుమండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి, మళ్ళీ ఇక్కడే లింగైక్యంపొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం.

తెలంగాణలో ఫ్రెండ్స్ తో చూడవలసిన ప్రదేశాలు !

దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటుచేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 - 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్ర కారులు భావిస్తున్నారు.

జైన మహాదేవ్ ఆలయం ప్రవేశం

జైన మహాదేవ్ ఆలయం ప్రవేశం

చిత్రకృప : Adityamadhav83

కొలనుపాక జైనదేవాలయం

రెండువేల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోటద్వారాన్ని తలపిస్తుంది. అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది.

21 కి. మీ ల దూరంలో ఉన్న పంచ నారసింహ క్షేత్రం ... యాదగిరి గుట్ట !!

ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

జైన మహాదేవ్ విగ్రహం

జైన మహాదేవ్ విగ్రహం

చిత్రకృప : Devlok Jinalaya Palitana

భగవాన్ మహావీర్ విగ్రహం

మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడి లో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం మరియు అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉన్నది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారత దేశంలో మరెక్కడా లేదు. నలుపురంగులో ఉన్న మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం. ఈ విగ్రహం మధ్య గర్భగుడిలో మూల నాయక రూపంలో నెలకొని యున్నది.

హైదరాబాద్ బస్ స్టాండ్

హైదరాబాద్ బస్ స్టాండ్

చిత్రకృప : Sudhirnlg

రవాణ సదుపాయాలు

తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టాప్/ జూబ్లి బస్ స్టేషను నుండి వరంగల్ లేద హన్మకొండ మరియు జనగాం వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి మరియు కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాకకు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+