Search
  • Follow NativePlanet
Share
» »64 అడుగుల ఎత్తున్నఈ శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని చూశారా?

64 అడుగుల ఎత్తున్నఈ శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని చూశారా?

64 అడుగుల ఎత్తున్నఈ శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని చూశారా?

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువన్నమలై ఒక పుణ్య క్షేత్రము మరియు మునిసిపాలిటి. ఇది తిరువన్నమలై జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువన్నమలై లోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం. తిరువన్నమలైతో చాలా యోగులకి సిద్ధులకి సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువన్నమలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం.

తెలుగువారు అరుణాచలంగా పిలిచే ఈ తిరువణ్ణామలై పేరు తలిస్తేనే ముక్తిని చేకూరుస్తుందంటారు. ఈ క్షేత్రాన్ని భక్తితో దర్శించి శ్రధ్ధతో స్వామిని పూజిస్తే పూజించినవారు మాత్రమేకాక వారి తర్వాత ఇరవై ఒక్క తరాలవారుకూడా ముక్తిని పొందుతారని పురాణాల్లో చెప్పబడింది. ఈ స్ధలాన్ని వశిష్టుడు, వ్యాసుడు, అగస్త్యుడు మొదలగు మహర్షులేకాక మరెందరో ప్రసిధ్ధులు, యోగులు, స్వామిని దర్శించి పూజించారు. అనేక కవిపుంగవులు స్వామి మహిమలగురించి స్తుతిగానాలు చేశారు.

తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా, అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి

తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా, అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి

తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా, అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి. దీనికి కారణం ఇక్కడి రాజుల, ముఖ్యంగా, అనేక ఆలయాల నిర్మాణానికి కారకులయిన చోళ రాజుల శ్రధ్ధా భక్తులే కావచ్చు.

 తిరువణ్ణామలైలోని కుబేర పెరుమాళ్ ఆలయం

తిరువణ్ణామలైలోని కుబేర పెరుమాళ్ ఆలయం

అలాంటి ఆలయాల్లో ఒకటి తిరువణ్ణామలైలోని కుబేర పెరుమాళ్ ఆలయం ఒకటి. అద్భుత నిర్మాణాన్ని రాజర్షి సిద్ధార్థ పీఠం మరియు పద్మావతి తాయార్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్మింపబడినది. ఇది గిరివళం రహదారికి ఉత్తరాన 1,000 మీటర్ల దూరంలో ఉంది మరియు దీనిని 2002 లో నిర్మించారు. ముఖ్యమైన దేవుడు

అరుణాచలేశ్వర

అరుణాచలేశ్వర

తిరుమన్నామలైలో ప్రధానంగా విష్ణువుకు అంకితం చేసిన కుబేర పెరుమాళ్ ఆలయంలో శివుడు, బ్రహ్మ విగ్రహాలు ఉన్నాయి. కానీ కుబేర పెరుమాళ్ ఆలయానికి ముఖ్య దేవుడు అరుణాచలేశ్వర. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు.

64 అడుగుల ఎత్తైన విగ్రహం

64 అడుగుల ఎత్తైన విగ్రహం

ఈ ఆలయం యొక్క విశిష్టత శ్రీదేవి మరియు భూదేవిలతో శ్రీ మహా విష్ణువు యొక్క 64 అడుగుల ఎత్తైన విగ్రహం ఉండటం. కుబేర పెరుమాళ్ ఆలయం, మొదట తమిళనాడులోని తిరుపతి ఆలయ శైలిలో నిర్మించబడింది, ఇది దక్షిణ భారత వాస్తుశిల్పం యొక్క అద్భుత నిర్మాణం.

అగస్త్య మహర్షి ఆశ్రమం వద్ద నుండి అరుదైన

అగస్త్య మహర్షి ఆశ్రమం వద్ద నుండి అరుదైన"శివ శక్తి ఐక్య స్వరూప దర్శనం

అగస్త్య మహర్షి ఆశ్రమం వద్ద నుండి అరుదైన"శివ శక్తి ఐక్య స్వరూప దర్శనం" లభిస్తుంది. అధికార నంది దాటిన తరువాత వచ్చే మట్టి దారిలో ఒక కిలోమీటరు దూరం ఎడమపక్క లోపలి నడిస్తే "శ్రీ కుబేర పెరుమాళ్ కోవెల: ఉంటుంది. స్వర్ణమయ శ్రీ వేంకటేశ పెరుమాళ్ నిలువెత్తు విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా నారసింహ, దేవి ఉపాలయాల ఉన్నాయి.

రథ ఆకారంలో విమానం

రథ ఆకారంలో విమానం

తిరువన్నమలైలోని కుబేర పెరుమాల్ ఆలయం యొక్క మరో అద్భుతమైన నిర్మాణం రథ ఆకారంలో ఉన్న విమానం(గుడి గోపురం), ఇది భారతదేశంలో మరెక్కడా కనిపించదు. కుబేర పెరుమాళ్ ఆలయం కామధేను, విష్ణు కల్పవ్రిక్ష మరియు విశ్వసేన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి, కుబేర పెరుమాళ్ ఆలయంలో త్రిమూర్తులను చూడవచ్చు.

ప్రముఖ ఉత్సవాలు:

ప్రముఖ ఉత్సవాలు:

మతపరంగా మొగ్గు చూపే వారికి ఇది ఒక గొప్ప ప్రదేశం. కుబేర పెరుమాళ్ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి, విష్ణు పండుగలు. ఈ పండుగలను తిరుపతిలో కూడా జరుపుకుంటారు. ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఈ ఆలయం ఉదయం 6.30 నుండి 10గంటల వరకు తెరచి ఉంటుంది.

ఎక్కడ బస చేయాలి?

ఎక్కడ బస చేయాలి?

ఇక్కడ కుబేర పెరుమాళ్ కోవెలను సందర్శించడానికి వచ్చే స్త్రీ మరియు పురుషులు ప్రయోజనాల కొరకు అనేక హోటళ్ళు మరియు సంప్రదాయ రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక పరంగా వచ్చే భక్తుల కొరకు తిరువన్నామలైలోని కుబేర పెరుమాల్ ఆలయంలో యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

చేరుకోవడం ఎలా?

చేరుకోవడం ఎలా?

తిరువన్నామలై రైల్వే స్టేషన్ సమీప రైల్వేష్టేషన్. ఇక్కడి నుండి టాక్సీ ద్వారా పెరుమాళ్ ఆలయానికి చేరుకోవచ్చు. గిరివళం రోడ్ ఈ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే బస్సు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X