Search
  • Follow NativePlanet
Share
» »ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?

ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్ష్మీ నారసింహ స్వామి దేవాలయాల జాబితా.

ఈ భూ మండలం పై దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువు దశావతారాలను ఎత్తాడని మన పురాణాలు చెబుతాయి. అందులో అత్యంత విచిత్రమైన, విశిష్టమైన రూపము నారసింహ రూపం. సగం మనిషి, సగం మగరూపంలో ఉన్న ఈ రూపంలో ఆయన హిరణ్యకసిపుడిని సంహరిస్తాడు. ఇక అదే రూపంలో విష్ణువు అనేక చోట్ల వెలిసాడు. ఈ నారసింహుడికి ఉత్తర భారత దేశంలో కంటే దక్షిణ భారత దేశంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ నారసింహ పుణ్యక్షేత్రాల గురించి క్లుప్తంగా మీ కోసం....

అహోబిలం

అహోబిలం

P.C: You Tube

దేశంలోని లక్ష్మీ నారసింహ క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు రాష్ట్రంలో ఉన్న అహోబిలం చాలా ప్రాచూర్యం చెందినది. నల్లమల అడవుల్లో వెలిసిన ఈ నరసింహుడిని సందర్శించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

తొమ్మిది రూపాల్లో

తొమ్మిది రూపాల్లో

P.C: You Tube

ఇక్కడ నారసింహుడు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తాడు. మంచి ఆహ్లాదకరమైన ప్రాంతంలో వెలిసిన ఈ అహోబిలంలో అనంత సంపద కూడా ఉందని చెబుతారు. వీకెండ్ సమయంలో ఇక్కడ ట్రెక్కింగ్ కు ఎక్కువ మంది వస్తుంటారు. ఇందులో కర్నాటక అందులోనూ బెంగళూరు వాసులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

స్తంభాద్రి, ఖమ్మం

స్తంభాద్రి, ఖమ్మం

P.C: You Tube

తెలంగాణాలోని ఖమ్మంలో స్తంభాద్రి నారసింహస్వామి ఆలయం ఉంది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటం కోసం నారసింహుడు ఒక స్తంభం నుంచి బయటికి వచ్చినట్లు చెబుతారు.

ఆ స్తంభాన్ని

ఆ స్తంభాన్ని

P.C: You Tube

అదే ఈ స్తంభాద్రి. ఇక్కడ సదరు స్తంభాన్ని మనం చూడవచ్చు. ఒక చిన్న గుట్టమీద ఈ స్తంభాద్రి పుణ్యక్షేత్రం ఉంటుంది. ఖమ్మం పట్టణానికి దగ్గర్లో ఉన్న క్షేత్రానికి వీకెండ్ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

వాడపల్లి, నల్గొండ

వాడపల్లి, నల్గొండ

P.C: You Tube

తెలంగాణాలోని దామచర్ల మండలంలో ఈ వాడపల్లి ఉంది. ఇక్కడ లక్ష్మీ నారసింహస్వామి భక్తుల కోరిన కోర్కెలను తీర్చే కొంగుబంగారమై విరాజిల్లుతున్నాడు. ఇక్కడ స్వామివారి తొడ పై అమ్మవారు ఆసీనులై ఉంటారు.

శ్వాస తీసుకొని వదలడం

శ్వాస తీసుకొని వదలడం

P.C: You Tube

ఇటువంటి విగ్రహం మనకు దేశంలో మరెక్కడా కనిపించదు. ఇక ఇక్కడ స్వామివారు ఎల్లప్పుడు శ్వాస తీసుకొని వదులుతూ ఉంటారని చెబుతారు. ఇందుకు ఆధారంగా కదులుతున్న దీపాన్ని చూపిస్తారు.

మట్టపల్లి

మట్టపల్లి

P.C: You Tube

ఈ నారసింహ క్షేత్రం కూడా నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ సమీపంలో ఉంది. క`ష్ణానది తీరంలో వెలిసిన మట్టపల్లి లక్ష్మీ నరసింహ క్షేత్రం పురాణ ప్రాధాన్యత కలిగినది. నదీ తీరంలో వెలిసిన ఈ క్షేత్ర సందర్శనానికి నిత్యం భక్తులు వస్తుంటారు.

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి

పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి

P.C: You Tube

ఇంది పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి. భరద్వాజ మహర్షి ఇక్కడి గుహలో తపస్సు చేయగా స్వామివారి దర్శనం లభించిందని స్థల పురాణం చెబుతుంది. ఆ గుహను మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు.

సింహాచలం

సింహాచలం

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో సింహాచలం ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతోంది. ఇక్కడి నారసింహుడిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. ఇక్కర ఎక్కడా లేనట్లు వారహ రూపంలో లక్ష్మీ నారసింహుడు కొలువై ఉంటాడు.

ఏడాదికి ఒక్కసారి మాత్రమే

ఏడాదికి ఒక్కసారి మాత్రమే

P.C: You Tube

సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఈ పుణ్యక్షేత్రంలో ఏడాదికి ఒకసారి మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి ఉంటుంది. నిత్యం వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు.

ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా

ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా

P.C: You Tube

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఐ.ఎస్ జగన్నాథపురం, ఐ.ఎస్ రాఘవాపురానికి మధ్య నరసింహ గిరి అనే కొండమీద ఒక చిన్న నారసింహ దేవాలయంల ఉంది. ఈ ఆలయంలోని నారసింహుడిని భూతనరసింహ స్వామిగా పిలుస్తారు.

వారికి సాంత్వన

వారికి సాంత్వన

P.C: You Tube

దుష్ట, పీడ, దెయ్యంపట్టిన వారికి ఇక్కడ సాంత్వన చేకూరుతుందని నమ్ముతారు. ఇక్కడ నారసింహుడి సరసన కనకవల్లి పేరుతో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. ఆలయం ఎదురుగా పంచముఖ ఆంజనేయస్వామి, ఏకాక్షర గణపతి తదితర దేవతలు ఉంటారు.

అంతర్వేది

అంతర్వేది

P.C: You Tube

తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలానికి చెందిన గ్రామం పేరే అంతర్వేది. పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువును వశిష్ట మహర్షి ప్రార్థించగా ఆయన లక్ష్మీ సమేతుడై గరుడ వాహనం పై ఇక్కడికి వస్తాడు.

సుదర్శన చక్రంతో

సుదర్శన చక్రంతో

P.C: You Tube

అటు పై తన సుదర్శన చక్రంతో స్వామివారు అక్కడ అనేక మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రక్తవలోచనుడిని సంహరిస్తాడు. అటు పై వశిష్ట మహాముని కోరిక మేరకు నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహుడిగా వెలిశాడు.

పెంచలకోన

పెంచలకోన

P.C: You Tube

తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో ఈ పెంచలకోన క్షేత్రం ఉంది. ఈ ప్రాంతంలో సర్పాకారంలో కలిగిన అనేక చెట్లు ఉండటం విశేషం. ఇక ఇక్కడ స్వామివారిని పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు.

పెనువేసుకొన్న స్థితిలో

పెనువేసుకొన్న స్థితిలో

P.C: You Tube

ఇక్కడ స్వామి వారు అమ్మవారిని పెనువేసుకొన్న స్థితిలో కనిపిస్తారు. పెంచలకోన నెల్లూరు పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడి దాదాపు 700 ఏళ్లనాటిదని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

వేదాద్రి, క`ష్ణా జిల్లా

వేదాద్రి, క`ష్ణా జిల్లా

P.C: You Tube

క`ష్ణానది ఒడ్డున ఉన్న వేదాద్రి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ పంచ నరసింహ ప్రతిమలు ఉన్నాయి. ముఖ్యంగా దేవాలయంలో యోగానంద మరియు లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన జ్వాల నరసింహస్వామి ఉన్నారు.

వేదాలను

వేదాలను

P.C: You Tube

నది గర్భంలో స్నాన ఘట్టానికి సమీపంలో బయటకు కనిపించే సాలగ్రామ రూపంలో గరుడాచల కొండ పై వీర నరసింహ స్వామి ఉన్నారు. వేదాలను రాక్షసుడి నుంచి రక్షించి బ్రహ్మకు ఇచ్చినందువల్లే ఇక్కడ నరసింహుడు కొలువైన క్షేత్రాన్ని వేదాద్రి అని అంటారు.

మంగళగిరి, గుంటూరు

మంగళగిరి, గుంటూరు

P.C: You Tube

గుంటూరు జిల్లాలోని ఉన్న మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి ప్రసిద్ధి. కొండపైన నిర్మించిన ఈ ఆలయం పూర్వ ఒక అగ్ని పర్వతంగా చెబుతారు. ఇక్కడ నరసింహుడికి పానకాన్ని నైవేద్యంగా అందిస్తారు.

పానకాల నరసింహ స్వామి

పానకాల నరసింహ స్వామి

P.C: You Tube
అందువల్ల ఇక్కడ ఉన్న నారసింహుడిని పానకాల నరసింహుడు అంటారు. అయితే అగ్నిపర్వతాన్ని చల్లార్చడానికి రసాయన చర్యలో భాగంగా ఈ పానకాన్ని ఆ నరసింహుడి విగ్రహం గుండా లోనికి పోస్తారని చెబుతారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+