ఈ సెలవుల్లో కూర్గ్‌లోని ఈ ప్రదేశాలను చుట్టేద్దామా..
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో పర్యాటకులు తరచుగా సెలవుల కోసం ప్లాన్ చేసుకుంటారు. ఎండ మరియు మండే వేడి నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు కొంత చల్లని ప్రదేశాలను కోరుకుంటుంటారు. అలాంటి ఓ ప్రదేశమే కూర్గ్. అద్భుతమైన పచ్చదనంతో కప్పబడిన కూర్గ్‌లోని కాఫీ తోటలు ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తాయి. పలచని ప్రకృతి దృశ్యాలు, మనహోరమైన జలపాతాలు, వృక్షజాలం మరియు జంతుజాలం వంటివన్ని సందర్శకులను ఇక్కడికి రప్పించేలా చేస్తాయి. కూర్గ్‌ను స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ వేసవిలో మీరు కూడా విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, భారతదేశంలోని స్కాట్లాండ్‌కు వెళ్లొచ్చు. మరెందుకాలస్యం ఇక మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.

కూర్గ్‌లోని కొన్ని ప్రసిద్ధ మరియు అందమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
మండలపట్టి వ్యూ పాయింట్
దాదాపు 4050 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మండలపట్టి వ్యూ పాయింట్ అందానికి ప్రసిద్ధి. మీరు ఇక్కడ నుండి నగరం యొక్క అందమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం.

నామ్‌డ్రోలింగ్ మొనాస్టరీ
నామ్‌డ్రోలింగ్ మొనాస్టరీ కూర్గ్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మూడంతస్తుల మాతా బౌద్ధ దేవాలయం ఎల్లప్పుడూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతాన్నిసందర్శించవచ్చు.

పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం
మీరు ప్రకృతి ప్రేమికులు కావడంతో పాటు జంతు ప్రేమికులు అయితే, ఈ ప్రదేశం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యంలో, మీరు గ్రే హార్న్‌బిల్, నీలగిరి ఫ్లైక్యాచర్ మరియు గ్రే బ్రెస్ట్డ్ లాఫింగ్ థ్రష్ వంటి అనేక పక్షులను చూడచ్చు.

ఓంకారేశ్వరాలయం
సెలవుల్లో దేవాలయాన్ని సందర్శించాలనుకుంటే, కర్నాటకలోని పశ్చిమ కనుమలలో ఉన్న ఈ అందమైన దేవాలయం దాని నిర్మలైన నిర్మాణంతో ప్రత్యేకమైన వాస్తుశిల్పంతో ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో శివునికి అంకితం చేయబడిన ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. 1820లో నిర్మింపబడిన ఈ దేవాలయం ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయం.
గడ్డిగె రాజా సమాధి
మడికెరి పట్టణంలోని రాజాస్ సీట్ కూర్గ్‌లోని అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ సూర్యస్తమయాన్నివీక్షించవచ్చు. అలాగే వ్యూ పాయింట్. పచ్చని లోయలు చుట్టుపక్కల ఉన్న కొండలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పురాతన కాలంలో ఈ తోట కొడగు రాజులకు ఇష్టమైన ప్రదేశం. వారు తమ రాణులతో సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ ఇక్కడ కాలం గడిపేవారిని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.

అబ్బే జలపాతం
కర్నాటకలోని మడికెరి పట్టణానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ జలపాతం కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలకు ప్రసిద్ధి. కావేరీ నదీ రాక్‌ఫేస్‌లోంచి జలపాతపు అందాలను అక్కడికి వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
చెట్లల్లి
మడికేరి సిద్ధాపూర్ రోడ్‌లో ఉన్న ఓ చిన్న గ్రామం చెట్లల్లి. ఈ గ్రామం చుట్టు పచ్చదనంతో నిండి ఉంటుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులను పచ్చదనంతో ఆహ్వనం పలుకుతోంది. ఈ ప్రాంతమంతా పొగమంచు కొండలతో కప్పబడి ఉంటుంది. ప్రశాంతతను ఆస్వాదించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రాంతం ఎంతో ఉత్తమమైనది. చెట్లల్లిలో ప్రసిద్ధి చెందిన చేరాల భగవతి ఆలయం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications













