Search
  • Follow NativePlanet
Share
» »సూర‌జ్‌కుండ్ ఫెయిర్ ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసుకుందాం..

సూర‌జ్‌కుండ్ ఫెయిర్ ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసుకుందాం..

సూరజ్‌కుండ్ ఫెయిర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులకు వారి సంస్కృతి, ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదిక అని చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డ అన్ని వయసుల పర్యాటకుల కోసం ప్రతి సంవత్సరం ఈ ఫెయిర్‌లో అనేక ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయబడతాయి. ఇందులో దేశంలోని రాష్ట్రాల నుంచి విదేశాల వరకు అన్నింటిని మ‌నం చూడొచ్చు. అయితే ఈ ఏడాది దక్షిణాసియా, ఆఫ్రికా, యూరప్ నుండి 40 దేశాలు ఈ ఫెయిర్‌లో పాల్గొన‌నున్నాయి. అంతేకాకుండా, అనేక దేశాల రాయబారులు కూడా వివిధ సందర్భాలలో ఇక్కడ పాల్గొన‌డం జ‌రుగుతుంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో 'సూరజ్‌కుండ్ ఇంటర్నేషన‌ల్ క్రాఫ్ట్ మేళా నిర్వహిస్తారు.

సూర‌జ్‌కుండ్‌ ఫెయిర్ ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 18 వరకు ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో నిర్వహించబడుతుంది. ఈసారి 37వ అంతర్జాతీయ హస్తకళా ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అయితే ఈ సంవ‌త్సరం ఈ ఫెయిర్‌కు వెళ్లాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా దీని గురించి తెలుసుకోవాల్సిందే.

surajkundfair

సూర‌జ్‌కుండ్ ఫెయిర్ సముదాయాన్ని గుజరాతీ సంస్కృతితో అలంకరించ‌డం జ‌రుగుతుంది. రెండవసారి ఉత్సవాల థీమ్ స్టేట్‌గా గుజరాత్ ఎంపిక చేయ‌బడుతుంది. గుజరాత్ ఇంతకుముందు 1997 సంవత్సరంలో ఫెయిర్ థీమ్‌గా ఉండేది. అయితే మొదటిసారిగా ఈ ఫెయిర్ సాంస్కృతిక థీమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

సూరజ్‌కుండ్ ఫెయిర్ 2024 ఎప్పుడు జరుగుతుంది?

సూర‌జ్‌కుండ్ ఫెయిర్ 2024లో ఫిబ్రవరి 2, శుక్రవారం నుంచి మొద‌లై ఫిబ్రవరి 18 ఆదివారం వరకు కొన‌సాగుతుంది. ఇందులో సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, తోలుబొమ్మల ఆటలతో కూడా ఈ ఫెయిర్ కొనసాగుతుంది. ఈ జాతర ఉదయం 10:00 నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఉంటుంది. కాబ‌ట్టి వెళ్లాల‌నుకునేవారు ఈ స‌మ‌యంలో సంద‌ర్శించొచ్చు.

surajkundfair , Haryana

సూరజ్‌కుండ్ మేళా 2024 ధ‌ర‌ల వివ‌రాలు..

ఈ ఫెయిర్‌కు వెళ్లేందుకు టిక్కెట్ ధర డిమాండ్‌ను బట్టి రూ. 100/- నుండి రూ. 200/- వరకు ఉంటుంది.

వారం రోజులలో టిక్కెట్ ధర: INR 120/-

వారాంతాల్లో టిక్కెట్ ధర: INR 180/-

టిక్కెట్ ధ‌ర‌లో మార్పులు ఉండొచ్చు.

సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాప్స్ట్‌ ఫెయిర్ టిక్కెట్‌లు అన్ని ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పాటు వేదిక వద్ద కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరం కమిటీ తన పర్యాటకులకు తగ్గింపు ఎంపికలను అందించ‌డం జ‌రుగుతుంది. ID కార్డ్ ఉన్న పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు వారపు రోజులలో ప్రవేశ టిక్కెట్ మొత్తంపై 50% తగ్గింపు ఉంటుంది. ఇంకా సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మరియు సైనికులకు ప్రవేశ టిక్కెట్ మొత్తంపై 50% తగ్గింపు ఉంటుంది.
సూర‌జ్‌కుండ్ మేళా చేరుకోవ‌డం ఎలా?

రోడ్డు మార్గంలో సూరజ్‌కుండ్ మేళా చేరుకోవాల‌నుకుంటే మాత్రం జాతీయ రహదారి నిర్వహించబడిన 4-లేన్ రహదారి అన్ని ప్రాంతాల‌కు అనుసంధానించ‌బ‌డింది. ఈ మార్గం గుండా సూర‌జ్‌కుండ్ చేరుకోవ‌చ్చు. అక్క‌డి నుంచి మేళాకు టాక్సీలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. రైలుమార్గం ద్వారా అయితే, న్యూ ఢిల్లీ (NDLS) సూరజ్‌కుండ్ చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్. రైల్వే జంక్షన్‌కు చేరుకున్న తర్వాత, అక్కడ నుండి సూరజ్‌కుండ్‌కు టాక్సీలో చేరుకోవచ్చు. మెట్రో స‌దుపాయం కూడా క‌ల‌దు.

ఢిల్లీ వాసుల‌యితే అక్కడి నుంచి సూరజ్‌కుండ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఢిల్లీ మెట్రో మీకు ఉత్తమమైనది. సెంట్రల్ సెక్రటేరియట్ నుండి సరితా విహార్ మరియు మోహన్ ఎస్టేట్ మీదుగా బదర్‌పూర్ వరకు మెట్రోలో ప్రయాణించొచ్చు. సూర‌జ్‌కుండ్ మేళాకు బదర్‌పూర్ సమీపంలోని మెట్రో స్టేషన్.

More News

    Read more about: haryana tour haryana tourism
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+