Search
  • Follow NativePlanet
Share
» »స్వ‌ర్గాన్ని త‌ల‌పించే సిక్కిం అందాల‌ను చూద్దామా..?

స్వ‌ర్గాన్ని త‌ల‌పించే సిక్కిం అందాల‌ను చూద్దామా..?

భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో సిక్కిం ఒక‌టి. ఇక్క‌డి అద్భుతమైన సంస్కృతి, ఈ ప్రాంత ఆధ్యాత్మిక అనుభవం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అద్భుతమైన ప్రకృతి దృశ్యాల‌తోపాటు కాంచనజంగా శిఖరాలు ఇవన్నీ కలిసి సిక్కింను దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి చాలా భిన్నంగా మారుస్తున్నాయి. వేసవి కాలంలో సిక్కిం అందాలను అందరూ ఇష్టపడతారు. అయితే శీతాకాలంలో సిక్కిం అద్భుతంగా మారడాన్నిఎప్పుడైనా చూశారా? ఈ సీజ‌న్‌లో సిక్కిం స్వ‌ర్గాన్ని త‌ల‌పిస్తుంది. సిక్కింలో సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రదేశాలు సందర్శకులకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని అనేక పార్కులు, దట్టమైన అడవులు, బౌద్ధమత కేంద్రాలు, తోటలు, సరస్సు పర్యాటకుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్నాయి. సిక్కింలోని ఉత్తమ శీతాకాలపు విహార స్థలాలేంటో ఒక్క‌సారి చూసేద్దాం..

yumthangvalley1

యుమ్తాంగ్ వ్యాలీ

సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవి కాలంలో పూల లోయగా ప్రసిద్ధి చెందింది. కానీ చలికాలంలో సిక్కింలోని ఈ లోయ తెల్లటి మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ సమయంలో, యుమ్తాంగ్ లోయ అందాలను చూసేందుకు ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు. ఇంకా ఇక్క‌డ అనేక సుంద‌ర‌మైన ప్ర‌దేశాలు కూడా ఉన్నాయి. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు యుమ్తాంగ్ లోయ అందాన్నిమ‌రింత పెంచుతాయి.

gurudongmarlake1

గురుడోంగ్మార్ సరస్సు

సిక్కింలోని గురుడోంగ్మార్ సరస్సు ప‌విత్ర ప్ర‌దేశంగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు ముందు నుండి కనిపించే కాంచనజంగా శిఖర దృశ్యాల‌ను చూడాల్సిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తైన జలవనరులలో ఒకటిగా పేరుగాంచింది. ఇది ఒక మంచి నీటి సరస్సు. ఇది ఉత్తర సిక్కిం భూభాగంలో ఉంటుంది. లచెన్ వెళ్ళినప్పుడు గురుడోంగ్మార్ సరస్సును తప్పక చూడాల్సిందే. చైనా దక్షిణ సరిహద్దు నుండి సుమారు 5 కిలోమీట‌ర్ల దూరంలో ఈ స‌ర‌స్సు ఉంటుంది. గుర్దొంగ్మార్ సరస్సు నుండి 5 కిలోమీటర్లు ముందుకు వెళితే సోలాశో సరస్సు ఉంది. సిక్కిం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స‌ర‌స్సును కూడా సందర్శించండి. శీతాకాలంలో, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో, ఈ సరస్సులోని నీరు కూడా తెల్లటి మంచుగా గ‌డ్డ‌క‌డుతుంది.

సోమ్గో సరస్సు

శీతాకాలంలో సిక్కిం పర్యటనకు వెళితే మాత్రం సోమ్గో సరస్సును త‌ప్ప‌కుండా సంద‌ర్శించండి. ఈ స‌ర‌స్సును చాంగు సరస్సు అని కూడా పిలుస్తారు. హిమపాతం, శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా ఈ సరస్సు కూడా మంచుగ‌డ్డ‌లా మారుతుంది. ఈ స‌ర‌స్సు చుట్టూ అన్నీ కొండ‌లే క‌నిపిస్తాయి. ఈ అద్భుత‌మైన దృశ్యాల‌ను త‌ప్ప‌కుండా చూడాల్సిందే.

somgolake1

నాథు లా పాస్

నాథు లా పాస్ లేకుండా సిక్కింకు వెళ్లే ఏ శీతాకాలపు యాత్ర అయినా అసంపూర్ణంగా మారుతుంది అన‌డంలో సందేహం లేదు. మంచు బూట్లు, మందపాటి జాకెట్, చేతి తొడుగులు సన్ గ్లాసెస్‌తో నాథుళా పాస్ ప్ర‌యాణానికి సిద్ధం కండి. ఈ ప్రదేశంలో భారీ హిమపాతం ఉన్నా, కానీ ఈ పాస్ పర్యాటకుల కోసం తెరిచే ఉంటుంది.

యుమ్తాంగ్ వ్యాలీ హాట్ స్ప్రింగ్, టీ గార్డెన్

మంచు కురిసే ఈ కాలంలో చాలామంది ప‌ర్యాట‌కులు యుమ్‌తాంగ్ లోయలోని హాట్ స్ర్పింగ్‌ను ఆస్వాదించేందుకు వ‌స్తారు. ఈ సీజ‌న్‌లో రోడ్డు పక్కన వివిధ ప్రదేశాలలో మంచుతో కప్పబడిన చెట్లు, మొక్కలు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ఎంత‌గానో ఆకట్టుకుంటాయి. శీతాకాలంలో సిక్కిం ప్రసిద్ధ టీ తోట టెమీని త‌ప్ప‌కుండా సందర్శించండి. ఈ ప్రదేశం ఫోటోగ్రఫీకి అనువైన‌ది.

Khecheopalri సరస్సు

అనేక రకాల వలస పక్షులు శీతాకాలంలో సిక్కింలోని ఖేచెయోపల్రి సరస్సును సందర్శిస్తాయి. ఈ సమయంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇది ఒక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అని చెప్పుకోవాలి. శీతాకాలంలో ఇక్క‌డి ప‌క్షుల‌తో పాటు అందమైన దృశ్యాల‌ను కూడా ఆస్వాదించాల్సిందే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+