Search
  • Follow NativePlanet
Share
» »గుజ‌రాత్‌లోని స్మృతివ‌న్ మ్యూజియాన్ని చూసొద్దామా..?

గుజ‌రాత్‌లోని స్మృతివ‌న్ మ్యూజియాన్ని చూసొద్దామా..?

గుజ‌రాత్‌లో సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా స్మృతివన్ మ్యూజియం గురించి చాలామంది వినే ఉంటారు. ఇది రాష్ట్రంలోని కుచ్ జిల్లాలోని భుజ్‌ ప్రాంతంలో నిర్మిత‌మ‌య్యింది. భుజ్‌ ప్రాంతంలో 2001లో సంభవించిన భూకంపం సమయంలో ప్రజలు చూపిన దృఢత్వాన్ని గుర్తుచేసే స్మృతి వన్ మెమోరియల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ దీనిని స్థాపించారు. ఇది సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇప్పుడు స్మృతివన్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యునెస్కో ప్రపంచంలోని 7 ప్రధాన మ్యూజియంలలో గుజరాత్‌లోని స్మృతివన్ మ్యూజియాన్ని ఎంపిక చేశారు. ఒక భారతీయ మ్యూజియం ప్రపంచ స్థాయిలో ఇంతటి గుర్తింపు పొందడం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం..

గుజరాత్‌లోని 'స్మృతివన్ మ్యూజియం' యునెస్కోచే ప్లిక్స్ వెర్సైల్లెస్ మ్యూజియం 2024 వరల్డ్ విభాగంలో చేర్చబడింది. Plix Versailles Museum 2024 ఈ ఏడాది నిర్వ‌హిస్తున్న ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆధునిక నిర్మాణాలను హైలైట్ చేస్తుంది. ఇందులో గుజరాత్‌లోని స్మృతివన్ మ్యూజియం యునెస్కో అవార్డుకు మరో 7 మ్యూజియంలతో పాటు షార్ట్‌లిస్ట్‌లో చేర్చ‌బ‌డింది. ఈ సమాచారాన్ని గుజరాత్ టూరిజం శాఖ వారు ఎక్స్ లో వెల్ల‌డించారు. 2024 ప్రపంచ టైటిల్ పోటీకి ఎంపికైన సంస్థలు ప్రైజ్ వెర్సైల్స్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ అనే మూడు విభాగాల ఆధారంగా ఈ పోటీలో పాల్గొనవలసి ఉంటుంది. దీని విజేతను ఈ ఏడాది నవంబర్‌లో యునెస్కో ప్రధాన కార్యాలయం ప్రకటిస్తుంది. ప్రాథమికంగా ప్రిక్స్ వెర్సైల్లెస్ అనేది అద్భుతమైన ఆర్కిటెక్చర్, డిజైన్ కోసం ఇవ్వబడిన బహుమతి. ఈ అవార్డును 2015 సంవత్సరంలో ప్రారంభించారు.

Smritivan Museum in Gujarat

స్మృతి వన్ మెమోరియల్‌...

గుజ‌రాత్‌లో 2001లో సంభవించిన‌ భూకంపంలో 13,000 మంది త‌మ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంను నుండి కోలుకున్న ప్రజల పోరాట స్ఫూర్తిని నిద‌ర్శంగా స్మృతి వన్ మెమోరియల్‌ను నిర్మించారు. భూకంపంలో మరణించిన వారి పేర్లను స్మారక చిహ్నంపై చెక్కడం జ‌రిగింది. ఇందులో అత్యాధునిక 'మెమరీ వన్ ఎర్త్‌క్వేక్ మ్యూజియం' కూడా ఉంది. ఈ మ్యూజియం 2001 భూకంపం తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని, దాని పునర్నిర్మాణ కార్యక్రమాలు, విజయగాథలను ప‌ర్యాట‌కుల‌కు అంద‌జేస్తోంది.

ఇది వివిధ రకాల విపత్తుల గురించి, భవిష్యత్తులో సంభ‌వించే విపత్తుల నుంచి ర‌క్షించుకోవ‌డానికి సంసిద్ధత గురించి సమాచారాన్ని అందిస్తుంది. స్మృతి వన్ మ్యూజియం ఒక కొండపై నిర్మించబడటం అత్యంత ప్రత్యేకత అని చెప్పుకోవాలి.

Smritivan Museum in Gujarat1

ఎప్ప‌డు తెరుచుకుంటుంది...

స్మృతివన్ మ్యూజియం రెండు భాగాలుగా విభజించబడింది ఒక‌టి మెమోరియల్ మరియు మ్యూజియం. రెండోది స్మారక చిహ్నం. ఇది వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. స్మృతివన్ మ్యూజియం మంగళవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయితే శనివారం ఆదివారం అయితే, మ్యూజియం ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మ్యూజియం సోమవారాల్లో మూసివేయబడుతుంది.

చేరుకోవడం ఎలా?

దేశంలోని అన్నిమార్గాల గుండా ఈ ప్రాంతానికి చేరుకోవ‌చ్చు. రైలుమార్గంలో వెళ్లాల‌నుకునేవారికి స‌మీప రైల్వే స్టేషన్ - భుజ్. స్మృతివన్ మ్యూజియం నుండి ఈ రైల్వేస్టేష‌న్ సుమారు. 4.9 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. విమానం ద్వారా వెళ్లాల‌నుకునేవారికి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. స్మృతివన్ మ్యూజియం నుండి ఈ ఎయిర్‌పోర్టు సుమారు 329.9 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అహ్మదాబాద్ నుండి స్మృతివన్ మ్యూజియానికి నేరుగా బస్సు, రైలు లేదా టాక్సీని పొందొచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+