Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని ఉత్తమ టైగర్ రిజర్వ్‌ల‌లో స‌ఫారీ చేద్దామా..!

భారతదేశంలోని ఉత్తమ టైగర్ రిజర్వ్‌ల‌లో స‌ఫారీ చేద్దామా..!

భారతదేశంలోని ఉత్తమ టైగర్ రిజర్వ్‌ల‌లో స‌ఫారీ చేద్దామా..!

అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 29న జరుపుకుంటారు. పులులను రక్షించుకునేందుకు 2010 నుంచి జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని 70 శాతం కంటే ఎక్కువ పులులు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. ఇండియాలో మొత్తం 53 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఇక్కడ పులుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2018-19లో 20 రాష్ట్రాల్లో పులుల సంఖ్యను లెక్కించారు. ఆ లెక్క ప్రకారం ఇండియాలో 2,967 పులులు ఉన్నాయి. 2006తో పోల్చితే ఏటా పులుల సంఖ్య 6 శాతం పెరుగుతోంది. ఈ పులుల దినోత్స‌వం రోజున స‌రదాగా దేశంలోని టైగ‌ర్ రిజ‌ర్వ్‌లను చుట్టేద్దామనుకుంటున్నారా? అయితే మ‌రెందుకాల‌స్యం వీటిని చూసేయండి మ‌రి..

1

రణతంబోర్, రాజస్థాన్

ఇది భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఈ రిజర్వ్‌లో పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి. ఇది 1,134 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది. ఇది బెంగాల్ పులుల నివాసంగా ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డ జీప్ స‌ఫారీ త‌ప్ప‌నిసరిగా చేయాల్సిందే.. ఇక్క‌డ పులులే కాకుండా ఎలుగుబంట్లు, హైనాలు, భారతీయ నక్కలతో సహా ఇతర జంతువులను కూడా ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం ల‌భిస్తుంది.

2

జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, ఉత్తరాఖండ్

హిమాలయాల దిగువన ఉన్న జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ బహుశా భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఈ జాతీయ ఉద్యానవనం వైశాల్యం 500 చద‌ర‌పు కిలోమీట‌ర్లు ఉంటుంది. ఈ రిజర్వ్‌ను సందర్శించాలంటే ఏనుగు స‌ఫారీని చేయాల్సిందే.. ఇక్క‌డ బెంగాల్ పులులే కాకుండా 585 రకాల పక్షి జాతులు, ఏడు విభిన్న ఉభయచర జాతులను కూడా చూడొచ్చు. స‌ర‌దాగా ఏనుగుపై స‌ఫారీ చేస్తూ ఈ రిజ‌ర్వ్‌ను అంతా చుట్టేయొచ్చు.

బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్

భారతదేశంలోని టాప్ టైగర్ రిజర్వ్‌లలో ఒకటైన బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌ను ప్రతిరోజూ వందలాది మంది ప‌ర్యాట‌కులు సందర్శిస్తారు. ఇది 820 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్లకు నిలయం. అంతే కాదు, చారిత్రాత్మక బాంధవ్‌ఘర్ కోట కూడా ఈ నేషనల్ పార్క్‌లోనే ఉంది. విభిన్న జీవవైవిధ్యం, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ఈ రిజ‌ర్వ్‌ను పులుల దినోత్సవం నాడు సంద‌ర్శంచాల‌నుకోవ‌డం ఓ గొప్ప ఎంపిక అనే చెప్పుకోవాలి.

3

కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

కన్హా నేషనల్ పార్క్‌ను కన్హా టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలోని అత్యుత్తమ జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. భారతదేశంలోని ప్రసిద్ధ బెంగాల్ పులులకు నిలయంగా కూడా ఉంది. అంతే కాకుండా ప‌ర్యాట‌కులు ఇక్క‌డ భారతీయ ఏనుగులు, ఎలుగుబంట్లు, జింక‌లు, అనేక పక్షులను కూడా చూడొచ్చు. ఈ పార్క్ విశేష‌త ఏమిటంటే ప్రపంచంలో ఉన్న 6,000 పులులలో 500 పులులు ఈ పార్క్‌లోనే ఉన్నాయి.

4

కజిరంగా టైగర్ రిజర్వ్

కజిరంగా పార్క్‌లో భారతీయ ఖడ్గమృగం. ఏనుగు గడ్డి, చిత్తడి నేలలు, ఇత‌ర జంతువులు హూలాక్ గిబ్బన్, టైగర్, చిరుతపులి, భారతీయ ఏనుగు, బద్దకపు ఎలుగుబంటి, అడవి నీటి గేదె, చిత్తడి జింక మొదలైనవి ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్క‌డ పులి జనాభా పెరుగుతోంది. ప్రభుత్వ అధికారులు 2006లో కజిరంగాను టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. అలాగే ఇక్కడ మధ్య ఆసియా నుండి వలస వచ్చిన పక్షి జాతులు అధిక సంఖ్యలో ఉన్నాయి.

సాత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ జీవవైవిధ్యాన్ని చూడాలనుకునేవారు త‌ప్ప‌కుండా సాత్పురా నేషనల్ పార్క్‌ని సందర్శించొచ్చు. ఈ పార్క్ 1981లో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని అద్భుతమైన వన్యప్రాణుల పార్క్‌గా ఇది ప్ర‌సిద్ధి చెందింది. అంతేకాకుండా, దేశ విదేశాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ఉద్యాన‌వ‌నం అన్యదేశ మొక్కలు, జంతువుల వైవిధ్యానికి నిలయంగా కూడా పేరుగాంచింది.

More News

    Read more about: ranthambore rajasthan
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+