Search
  • Follow NativePlanet
Share
» »గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు.. అర‌కు లోయ అందాలు..

గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు.. అర‌కు లోయ అందాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌కృతి గీసిన అందాలు ఎన్నో దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి అర‌కు లోయ‌. ఆంధ్రా ఊటీగా పేరొందిన ఈ ప్ర‌దేశం ప‌ర్యాట‌కుల‌ను ఏ సీజ‌న్‌లోనైనా తన అందాల‌తో ఇట్టే ఆక‌ర్షిస్తోంది. ఇక్క‌డి చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, వంపులు తిరిగి ప్రవహించే జలపాతాలు, ఎన్నెన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలకు ప‌ర్యాటకులు మంత్ర ముగ్ధుల‌వుతుంటారు.

అరకు లోయలోని ఆహ్లాదకరమైన వాతావరణం, కాఫీ తోటల సువాసన ఈ నిర్మలమైన ప్రదేశానికి మరింత శోభను చేకూరస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్క‌డి ప్ర‌కృతీ అందాలే కాకుండా, గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా కూడా ఈ ప్ర‌దేశం పేరొందింది. ఇక్కడ అనేక సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు దాగి ఉన్నాయి. మంత్రముగ్ధులను చేసే బొర్రా గుహలతో పాటు, అద్భుతమైన అనంతగిరి కొండ‌లు, అరకు వ్యాలీ లైట్ రైల్వే ప్ర‌యాణం.. ఇలా ఎన్నో... ప్రయాణించవచ్చు. రండి ఇక్క‌డి అద్భుతాల గురించి తెలుసుకుందాం..

borracaves1

బొర్రా గుహలు

అర‌కు లోయ‌లోని బొర్రా గుహలు వాటి ప్రత్యేక నిర్మాణాల కారణంగా ప్రత్యేకంగా నిలుస్తాయి. 1807లో కనుగొనబడిన ఈ సున్నపురాయి గుహలు మనోహరమైన స్టాలక్టైట్లు, స్టాలగ్మిట్‌లతో నిండి ఉన్నాయి. ఈ గుహలు 200 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకర్షిస్తున్నాయి. ఇవి 10 లక్షల సంవత్సరాల క్రితానికి చెందినవని ఇక్క‌డివారు చెబుతుంటారు. బొర్రా అంటే తెలుగులో 'లోతు', కేవ్స్ అంటే 'గుహలు అని అర్ధం'. కొండలపై నుండి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. ఈ గుహ‌లు ఎన్నో అడుగుల ఎత్తు ఉన్న‌వి. ఈ గుహలు సహజసిద్దం గా ఏర్పడినవి. కొన్ని రసాయనిక చర్యల వల్ల ఇలా గుహలు ఏర్పడతాయి. ఈ గుహ‌లు భారత దేశంలోనే లోతైన గుహలుగా ప్రాచుర్యం పొందాయి.

గిరిజన మ్యూజియం

అరకు లోయ గిరిజన మ్యూజియం ఈ ప్రదేశం ఇక్క‌డి సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇది 1996 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ మ్యూజియంలో కళాఖండాలు, బట్టలు, సాంప్రదాయ ఉపకరణాలు మొదలైనవి ప్రదర్శించబడ్డాయి. ఇవి వివిధ గిరిజన వర్గాల జీవితాల‌ను ప్ర‌తిబింబిస్తాయి. గిరిజనుల కళలని ప్రోత్సహించేందుకు ఈ మ్యూజియంలో ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వర్క్ షాపులు ఇంకా ఎగ్జిబిష‌న్లు వంటివి కూడా జరుగుతాయి. ఈ మ్యూజియంలో గిరిజనులు తయారు చేసిన హస్త కళాకృతులను అమ్ముతారు.

arakuloyabeauty1

కాటపల్లి జలపాతం

అర‌కులోయ‌లోని ఈ జలపాతం చూడదగ్గదే. ముఖ్యంగా వర్షాకాలంలో దీని అందం మ‌రింత‌ పెరుగుతుంది. జలపాతం చుట్టూ పచ్చని అడవులు దాగి ఉన్నాయి. ట్రెక్కింగ్ ప్రియుల‌కు, ఫోటోగ్ర‌ఫీ అంటే ఇష్టం ఉన్న‌వారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించాల్సిందే. కాటపల్లి జలపాతాలను సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలం. ఈ సీజ‌న్‌లో ఈ జలపాతం పూర్తి వైభవంగా ఉంటుంది.

anantgirihills1

కాఫీ తోటలు

ఈ ప్రాంతం కాఫీ తోటలకు కూడా ప్రసిద్ధి చెందింది. నాణ్యమైన కాఫీ తోట‌ల‌కు ఈ ప్ర‌దేశం పేరుగాంచింది. ఈ తోటలలో, పర్యాటకులు కాఫీ సాగు గురించి మరింత లోతుగా, దగ్గరగా తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతమంతా తాజాగా తయారుచేసిన కాఫీ సువాసనతో నిండి ఉంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇక్కడ వార్షిక కాఫీ పండుగను నిర్వహిస్తారు.

More News

    Read more about: visakhapatnam andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+