Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అరకు వాలీ

అరకు వాలీ - ఆంధ్రప్రదేశ్ లో ఒక హిల్ స్టేషన్

17

దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ లో  కల విశాఖ పట్టణం జిల్లాలో కల అరకు వాలీ ఒక ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ పట్టణం అందమైన తూర్పు కనుమలలో వుండి ఎంతో గొప్ప సంస్కృతి మరియు ప్రాచీన సంప్రదాయాలు కలిగి వుంది. ఈ ప్రాంతం ఇంకా అధిక వాణిజ్యాన్ని పొందక పోవటంతో ఇది ఎంతో అందమైన హిల్ స్టేషన్ గానే వుంది. ఈ లోయ అందాలు అనేక టాలీవుడ్ సినిమాలలో ప్రదర్శిస్తారు. హ్యాపీ డేస్, డార్లింగ్ మరియు, కధ వంటి సినిమాలు కొంత భాగాన్ని ఇక్కడే షూట్ చేసారు.

 అరకు వాలీ వైజాగ్ జి సుమారు 114 కి. మీ.లు దూరం వుంటుంది. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దు. వాలీ లో అధిక జీవ వైవిధ్యం కల అనంతగిరి మరియు సున్కరిమెట్ట రిజర్వు ఫారెస్ట్ లు . వాలీ చుట్టూ రక్త కొండ , చితమో గొంది, గాలికొండ మరియు సుంకరి మెట్ట కొండలు కలవు. గాలికొండ  రాష్ట్రం లోనే అతి పొడవైన కొండ గా చెపుతారు.

అరకు వాలీ అందమైన ప్రదేశమే కాక, అనేక కాఫీ తోటలకు కూడా పేరు గాంచినది. తాజా కాఫీ గింజల సువాసనలు వాలీ అంతా వ్యాపించి వుంటాయి. ఈ వాలీ లో కల అనేక గిరిజన తెగలకు ఈ తోటలు జీవనం కలిగిస్తాయి. దేశం లో మొదటి సారిగా ఈ ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకం సుమారు 2007 నుండి ఇక్కడ ప్రవేశ పెట్టారు. అరకు ఎమరాల్డ్ అని బ్రాండ్ పేరు పెట్టారు. ఈ కాఫీ ని దేశం లోను, అంతర్జాతీయం గాను ఆదరిస్తున్నారు. దీనితో స్థానికంగా వేలాది ప్రజలకు ఉపాధి లభించింది.

ప్రదేశ ఆకర్షణలు

అరకు వాలీ లో కాఫీ తోటలే కాక ట్రైబల్ మ్యూజియం, టిఅడా , బొర్రా గుహలు, సంగదా ఫాల్స్ మరియు పద్మాపురం బొటా నికల్ గార్డెన్స్, వంటి ఆకర్షణలు కలవు. ప్రకృతి అందించే మంచి సువాసనల ఈ తోటలను తప్పక చూడాలి. అయితే, పర్యాటకులు అరకు వాలీ ఆకర్షనలను వాటి చరిత్ర, సంస్కృతి అర్ధం చేసుకునేటందుకు తప్పక చూడాల్సిందే.

ఎలా చేరాలి?

ఈ హిల్ స్టేషన్ చేరేందుకు రైలు లేదా రోడ్ మార్గాలు అనుకూలం గా వుంటాయి. ఇక్కడ రెండు రైలు స్టేషన్ లు కలవు. ఒకటి అరకు , మరొకటి అరకు వాలీ. రెండు రైలు స్టేషన్ లు కూడా వైజాగ్ కు కలుపబడి వున్నాయి. ఈ రైలు స్టేషన్ లు కోతవలస...కిరండూల్ రైలు లైన్ పై కలవు. ఇవి, ఈస్ట్ కోస్ట్ రైల్వే లో భాగం. శిమిలిగూడ రైలు స్టేషన్ అత్యధిక బ్రాడ్ గేజ్ జలిగి వుంది సముద్ర మట్టానికి సుమారు 996 మీటర్ల ఎత్తున కలదు. దీనికి ఎయిర్ పోర్ట్ లేదు. అరకు వాలీ చేరేందుకు పర్యాటకులు ఎ పట్టణం నుండి అయినా సరే టాక్సీ ల లో చేరవచ్చు. అరకు చేరేందుకు, వెనక్కు వచ్చేందుకు రెగ్యులర్ ప్రైవేటు లేదా ప్రభుత్వ బస్సు సర్వీస్ లు కలవు. హైదరాబాద్ , వైజాగ్ ల నుండి డీలక్స్ మరియు వోల్వో బస్సు లు నడుస్తాయి.

వాతావరణం

అరకు వాలీ సంవత్సవరం అంతా ఒక మోస్తరు వాతావరణం కలిగి వుంటుంది. శీతాకాలం మితమైన చలి తో వాతావరణం ఆహ్లాదం గా వుంటుంది. వేసవి లో వేడిగా వుండే ప్రదేశాల నుండి ఇక్కడకు వచ్చి చల్లదనాన్ని అనుభవిస్తారు. వాలీ సందర్శనకు శీతాకాలం అనువైనది. ఈ సమయం లో ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి కూడా ఆచరించవచ్చు.

 

అరకు వాలీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అరకు వాలీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అరకు వాలీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అరకు వాలీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం అరకు వాలీ రోడ్ ప్రయాణం లో ఎన్నో సుందర దృశ్యాలను చూడవచ్చు. విశాఖపట్నం నుండి అరకు వాలీ కి ఎన్నో బస్సు లు నడుస్తాయి. ప్రైవేటు బస్సు ల వారు ఈ హిల్ స్టేషన్ కు డీలక్స్ , వోల్వో బస్సు లు కూడా నడుపుతారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అరకు వాలీ లో రైలు స్టేషన్ కలదు. ప్రతి రోజూ, విశాఖపట్నం నుండి అరకు వాలీ కి రైలు కలదు. ప్రయాణం సుమారు ఏడు గంటలు పడుతుంది. స్టేషన్ చేరి మీరు కోరిన ప్రదేశానికి కాబ్ లేదా బస్సు లేదా ఇతర స్థానిక రవాణా లో సైట్ సీఇంగ్ లేదా ప్రదేశం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం అరకు వాలీ కి సమీప విమానాశ్రయం విశాఖపట్నం లో కలదు. ఇది సుమారు 112 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ లో రెండు టెర్మినల్స్ కలవు. ఇవి స్థానిక విమానాలు మాత్రమే కలిగి వుంటుంది. విమానాశ్రయం నుండి టాక్సీ ల లో అరకు తేలికగా చేరవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat