Search
  • Follow NativePlanet
Share
» »మ‌హారాష్ట్ర వ్యాలీ ఆఫ్ ఫ్ల‌వ‌ర్స్‌కు ప్ర‌సిద్ధి... కాస్ పీఠ‌భూమి...

మ‌హారాష్ట్ర వ్యాలీ ఆఫ్ ఫ్ల‌వ‌ర్స్‌కు ప్ర‌సిద్ధి... కాస్ పీఠ‌భూమి...

మ‌హారాష్ట్ర వ్యాలీ ఆఫ్ ఫ్ల‌వ‌ర్స్‌కు ప్ర‌సిద్ధి... కాస్ పీఠ‌భూమి...

ఉత్తరాఖండ్ ప్ర‌దేశాన్నిదాదాపు ప్రతి యాత్రికుడు సందర్శించాలని కలలు కంటాడు. ఎందుకంటే ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది కాబ‌ట్టి. ఇక్క‌డ వివిధ ర‌కాల పువ్వులు, వివిధ రంగుల‌లో ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఎన్నో రంగులు క‌లిసిన పూలు చాలా దూరం విస్త‌రించి ఉంటాయి. ఆ దృశ్యం ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాలంటే జులై నుండి సెప్టెంబ‌ర్‌ల‌లో మాత్ర‌మే సాధ్యం అవుతుంది. అయితే ఇలాంటి లోయ‌లే మ‌హారాష్ట్ర ప్రాంతంలో కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని కాస్ పీఠభూమి సతారా జిల్లాలో ఉంది. ఈ కాస్ పీఠ‌భూమి వ్యాలీ ఆఫ్ ఫ్ల‌వ‌ర్స్ కారణంగా ప్ర‌సిద్ధి చెందింది. రండి ఈ ప్రాంతం గురించి తెలుసుకుందాం.

kasplateau

కాస్ పీఠభూమి

సతారా నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నకాస్ పీఠభూమి మహారాష్ట్రలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటిగా ప్ర‌సిద్ధి చెందింది. కాస్ పీఠ‌భూమి నిజానికి ఓ పువ్వుల లోయ. ఇక్క‌డి పూల అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. వ్యాలీ ఆఫ్ ఫ్ల‌వ‌ర్స్ కారణంగా ఈ ప్రదేశం 2012లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో కూడా చేర్చబడింది. కాస్ పీఠభూమి సుమారు 1200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వర్షాకాలంలో ఈ ప్రదేశం పూల దుప్పటితో కప్పబడి ఉంటుంది. కాస్ వ్యాలీలో దాదాపు 850 రకాల పూలు ప‌ర్యాట‌కుల‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇందులో పింక్ కలర్ బాల్సమ్ పువ్వులను చూసే అవకాశం కూడా దొరుకుతుంది. అంతే కాకుండా, తెలుపు ఆర్చిడ్, పసుపు పాము, స్మిథియా, సెరోపెజియా వంటి అరుదైన పువ్వులు కూడా ఇక్కడ ల‌భిస్తాయి. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కూడా ఎంతో అనువైన‌ది. ఈ లోయలోని అందమైన దృశ్యాలను మీ మీ కెమెరాల్లో బంధించేయొచ్చు.

casslake

కాస్ సరస్సు

కాస్ సరస్సును కాస్ చెరువు అని కూడా పిలుస్తారు. ఈ సీజ‌న్‌లో ఈ ప్రాంతం సంద‌ర్శించేందుకు ఎంతో అనువైన‌ది. ఈ సరస్సు పూల లోయకు అతి సమీపంలో ఉంది. అందుకే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు త‌ప్ప‌కుండా కాస్ స‌ర‌స్సు అందాల‌ను తిల‌కించండి. ఈ సరస్సు నుండే సతారా నగరానికి తాగునీరు సరఫరా చేయబడుతుంది. వర్షాకాలంలె ఈ సరస్సు చూసేందుకు అనువైన స‌మ‌యం.

ఎలా చేరుకోవాలి?

ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే ఎక్క‌డినుంచైనా ర‌వాణా స‌దుపాయం క‌లదు. విమాన మార్గం ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే మాత్రం సమీప విమానాశ్రయం పూణే. పూణే విమానాశ్రయం నుండి బస్సు లేదా టాక్సీలో కాస్ పీఠ‌భూమిని చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే ముందుగా సతారా రైల్వే స్టేషన్‌న్ చేరుకోవాలి. రైల్వే స్టేషన్ నుండి సుమారు 30 కిలోమీట‌ర్ల దూరంలో స‌తారా ఉంటుంది. సతారా చేరుకున్న తర్వాత, బస్సు లేదా టాక్సీ ద్వారా కాస్ పీఠభూమిని చేరుకోవాల్సి ఉంటుంది. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే ముంబై లేదా పూణే నుండి ఇక్కడికి చేరుకోవచ్చు. కాస్‌ను చేరుకోవాలంటే సుమారు మూడు నుంచి ఐదు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

More News

    Read more about: satara maharashtra
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+