Search
  • Follow NativePlanet
Share
» »Mahashivratri 2024: దేశంలోని కోటి శివ‌లింగాలు క‌లిగిన ఆల‌యం ఇదే..

Mahashivratri 2024: దేశంలోని కోటి శివ‌లింగాలు క‌లిగిన ఆల‌యం ఇదే..

నేడు మ‌హాశివ‌రాత్రి. దేశంలోని భ‌క్తులంద‌రూ నేడు మ‌హాశివుని ద‌ర్శ‌న భాగ్యం కోసం శివాల‌యాల‌కు త‌ర‌లివెళ్తుంటారు. ఈ రోజు శివాల‌యం సంద‌ర్శిస్తే కోరిన కోరిక‌ల‌న్నీ తీరుతాయ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. పురాణాల ప్రకారం, భోలే ఆలయాలను సందర్శిస్తే స‌క‌ల పాపాలు తొలగిపోతాయ‌ని న‌మ్ముతారు. మ‌హాశివరాత్రి రోజు భోలేనాథ్‌ను ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున, ప్రజలు తమ నగరాలకు మరియు భారతదేశంలోని వివిధ శివాలయాలను సందర్శించడానికి కూడా వస్తారు.

భారతదేశంలోని ప్ర‌సిద్ధిచెందిన శివాల‌యాలు ఎన్నో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైన శివాల‌యాలు కూడా ఉన్నాయి. ఇప్ప‌డు మ‌నం అలాంటి శివాల‌యం గురించే మాట్లాడుకుందాం. ఈ శివాల‌యం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఒకటి రెండు కాదు కోటి రకాల శివలింగాలు ఉన్నాయి. ఆసియాలోని అతి పెద్ద శివలింగం కూడా ఇక్క‌డే ఉంది. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వస్తుంటారు.

kotilingeswara temple

కోటిలింగేశ్వరంలో కోటి శివలింగాలు..

బెంగుళూరు నుండి సుమారు 100 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంటుంది ఈ ఆల‌యం. ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో వెల‌సిన శివుని ఆల‌యం. దీనినే కోటిలింగేశ్వర ఆల‌యం అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, వివిధ పరిమాణాల్లో దాదాపు కోటి శివలింగాలు ఇక్క‌డ ఉంటాయి. కన్నడలో కోటి అంటే కోటిలింగేశ్వరుడి నుండి కోటి అని అర్థం. 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ లింగాలు ఎంతో అద్భుతంగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి.

ఆసియాలోనే అతి పెద్ద శివలింగం ఇక్కడే ఉంది...

కోటిలింగేశ్వరాలయాన్ని 1980లో స్వామి సాంబశివ మూర్తి నిర్మించారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం 33 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివ‌లింగంగా ప్ర‌సిద్దిచెందింది. ఆలయంలో 35 అడుగుల ఎత్తైన నంది విగ్రహం కూడా ఉంది. కోటి శివలింగాలున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉచిత సామూహిక వివాహాలు కూడా నిర్వహిస్తుంటారు.

ప్ర‌భుత్వం ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. తద్వారా ప్రపంచం నలుమూలల నుండి వందలాది మంది పర్యాటకులు వచ్చి ఆసియా ఖండంలోని అతిపెద్ద శివాలింగాన్ని చూస్తారు. నాగలింగ, కెనాన్ బాల్ అనే రెండు పూల చెట్లు ఇక్కడ ఉన్నాయి. చాలా మంది అవివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఇక్కడ నిత్యం పూజ‌లు చేస్తుంటారు.

kotilingeswara Mahashivratri

కోటిలింగేశ్వరాలయంలో పూజలు..

ప్రతిష్టించిన అన్ని శివలింగాల వద్ద పూజారులు రోజువారీ పూజ కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. సంగీతం మరియు డప్పులతో పూజలు నిర్వహిస్తారు. పూజారులందరూ మంత్రాలు చదువుతూ లింగాల మీద అభిషేకం చేస్తుంటారు. అంతే కాదు భక్తులు తమ శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేసుకోవచ్చు.ఈ దేవాలయంలోని మ‌రో విశేషమేమిటంటే, భ‌క్తులు ఇక్కడ సొంత శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చు. శివలింగాన్ని ప్రతిష్టించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మే వారు ఇక్కడ శివలింగాన్ని ఉంచుతారు.

ఆలయ సముదాయంలో దాదాపు పదకొండు ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుని ఆలయం. దీని తరువాత కోటిలింగేశ్వరుని ఆలయం కూడా ఉంది. అంతే కాకుండా, పాండురంగ దేవుడు, పంచముఖ గణపతి, బ్రహ్మ, విష్ణువు, అన్నపూర్ణేశ్వరి, వెంకటరమణ స్వామి, రాముడు-సీతా-లక్ష్మణుడు, కణికా పరమేశ్వరి, దేవత కారుమారి అమ్మ దేవి వంటి ఆలయాలు కూడా ఈ సముదాయంలో ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రతిరోజూ వేల సంఖ్య‌లో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

సంద‌ర్శించాల్సిన స‌మ‌యం...

ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 వరకు ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించొచ్చు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. 20 ఉంటుంది. కెమెరా ఉన్న‌వారికి అద‌న‌పు ఛార్జీ వుంటుంది. ఒక్కో కెమెరాకు రూ.100

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+