Search
  • Follow NativePlanet
Share

కోలార్ - ప్రశాంత పట్టణం

27

కోలార్, కర్నాటకకు తూర్పు అంచున ఉన్న ఒక ప్రశాంతమైన పట్టణం.  కోలార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల  సరిహద్దులో ఉండి 3,969 కిలోమీటర్ల మేర విస్తరించిఉంది.   కోలార్ బంగారు గనులకు ప్రసిద్ది చెందింది, కానీ అలాగే దీనికి బంగార౦ లాంటి చరిత్ర కూడా ఉంది – ఈ పట్టణం గతంలో కొన్ని నిజంగా అద్భుతమైన దేవాలయాలు, కోటలు కలిగిఉంది.

కోలార్ ను అల్లుకున్న కథలు ;

కోలార్ చుట్టూ అనేక పురాణాలూ, కథలలో సనాతన రుషి వాల్మీకి ఇక్కడే నివాసం ఉండేవారన్నది ఒకటి. రాముడు తన వనవాసంలో కోలార్ ని సందర్శించాడు, రాముడు సీతను వదలివేసిన తరువాత ఆమె ఇక్కడే ఆశ్రయం పొందింది. వారి కుమారులైన లవకుశులు కోలార్ లోని వాల్మీకి ఆశ్రమంలోనే జన్మించారు. యోధుడు-ముని అయిన పరశురాముడు కోలార్ పడమటి అంచున ఉన్న పచ్చని కొండలపై నివసించేవాడని చెప్తారు.

దీని చరిత్ర ఆధారంగా ఇది పూర్వం నించి కొలార్ గానే పిలువబడింది. కోలార్ అనే పదం కొలహలపుర అనగా “హింసాత్మక నగరం”అనే పదం నుండి ఉద్భవించింది. ఈ ప్రశాంత పట్టణంలోని కొండలు చోళ, చాళుక్య రాజవంశాల మధ్య జరిగిన హింసాత్మక యుద్ధాలకు సాక్షులు.

గత వైభవపు ఆనవాళ్ళు ఇప్పటికీ ఈ పట్టణంలో చూడవచ్చు. ఇక్కడ కొలారమ్మ, సోమేశ్వర దేవాలయాలు చూడదగ్గవి. ఇక్కడ పారాసైలింగ్, పర్వతారోహణ వంటి సాహస క్రీడలు పర్యాటకుల్లో బాగా ఆదరణ పొందాయి. కోలార్, బెంగుళూరుకి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

కోలార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కోలార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కోలార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కోలార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : చుట్టూ పక్కల వున్న ఊళ్లకు బాగా అనుసంధానం వున్న కోలార్ కర్నాటక లోని ప్రధాన నగరాల్లో ఒకటి. బెంగళూరు నుంచి కోలార్ కు చాలా ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి యాత్రికులు, కాబ్ లు , SUVలు మాట్లాడుకుని కోలార్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం : నగర నడిబొడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కోలార్ లోనే రైల్వే స్టేషన్ వుంది. చుట్టుపక్కల అన్ని పట్టణాలకు, నగరాలకు ఇక్కడి నుంచి రైళ్ళు నడుస్తాయి. ఇక్కడి నుంచి యాత్రికులు టాక్సీలు మాట్లాడుకుని యాత్రా స్థలాలకు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరుకోవాలి. యాత్రికులు వాయు, రైల్, రోడ్డు మార్గాల ద్వారా కోలార్ చేరుకోవచ్చు. వాయుమార్గం : దేశీయ, విదేశీ యాత్రికులకు సేవలందించే బెంగళూరు విమానాశ్రయం ఇక్కడి దగ్గరలో వుంది. కోలార్ నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఇది వుంది. బెంగళూరు విమానాశ్రయం దేశ, విదేశ గమ్యస్థానాలకు బాగా అనుసంధానించబడి వుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed