Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అయోధ్య రామాల‌యంలో అద్భుత ఘ‌ట్టం...

శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అయోధ్య రామాల‌యంలో అద్భుత ఘ‌ట్టం...

దేశ‌ప్ర‌జ‌లంతా ఎంత‌గానో ఎదురుచూసిన‌ అయోధ్య రాములోరి విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ట వేడుక ఈ ఏడాది జ‌న‌వ‌రి 22న ఎంతో వైభ‌వంగా జ‌రిగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.. ఈ విగ్ర‌హ ప్ర‌తిష్ట అనంత‌రం అయోధ్య రాములోరి ఆల‌యానికి భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. అయోధ్య రాములోరి ఆల‌యంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.

ఇప్పుడీ ఈ బాలరాముని జ‌న్మ‌స్థ‌లంలో మ‌రో అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా సూర్యకిరణాలు బాలరాముడి నుదుటపై ప్రకాశిస్తాయి. ఈ అద్భుత ఘట్టం రామభక్తులకు కనువిందు కానుంది. ఈ కిరణాలు రాముడి నుదుటిపై తిలకంగా దాదాపు 6 నిమిషాల పాటు ప్రకాశించ‌ననున్నాయి. ఈ సూర్యతిలకం గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏప్రిల్ 17న శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇక‌, అయోధ్య బ‌ల‌రాముని ఆల‌యంలో ఇది మొద‌టిసారి కాబ‌ట్టి. దీనిని భారీ స్థాయిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ‌రామనవమి రోజున 56 నైవేద్యాలు పెడతారు. సూర్య తిలకం కూడా ధరించనున్నారు. ఈ అందమైన ఘట్టం అభిజిత్‌ ముహూర్తం, అంటే సూర్యకిరణాలు 12 గంటలకు బలరాముడి నుదుటిపై పడతాయి.

ప్ర‌తి ఏటా తెలుగు నూతన సంవత్సరాది చైత్ర పాడ్యమి రోజ ఉగాది జరుపుకుంటాం. అక్కడి నుంచి వచ్చే తొమ్మిదో తిథి నవమి రోజునే శ్రీరామ న‌వ‌మిని జ‌రుపుకుంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం శ్రీ‌రాన‌వ‌మి వేడుక‌లు తెలంగాణ‌లోని భద్రాద్రి, ఒంటిమిట్ట, రామతీర్థం లాంటి ఆలయాల్లో ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఇక‌, ఏడాది శ్రీ‌రాముని జన్మభూమి అయోధ్యలో మొదటి శ్రీరామ నవమి. శ్రీరామనవమి రోజు గర్భగుడిలో ఉండే రాముడి నుదుట సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ayodhyaramtempleonsriramnavam

అభిజిత్ లగ్నానికి కొద్దిసేపు ముందు.. కనిపించే అద్భుతం..

ప్ర‌తి ఏటా శ్రీ రామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ అద్భుతం జ‌రుగుఉంది. అభిజిత్ లగ్నానికి కొద్దిసేపు ముందు మొదలయ్యే సూర్య కిరణాల వెలుగు 6 నిమిషాల పాటు కొన‌సాగుతుంది. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ ని కూడా రూపొందించారు. సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -సీబీఆర్ఐ ఈ ఏర్పాట్లను చేసింది. ఇది సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. దీనికోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-ఐఐఏ సహాయం కూడా తీసుకున్నారు.

ఇందుకు అవసరమైన ప‌రిక‌రాల‌ను ఆప్టిక్స్‌ సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. సూర్య కిరణాలు రామచంద్రుడి నుదిటిపై ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. మూడో అంతస్తు నుంచి నేరుగా రామయ్య నుదుట కిరణాలు ప్రసరించేలా ఈ పరికరాలు అమ‌ర్చ‌డం జ‌రిగింది.

ప్రసార భారతి ద్వారా ప్రత్యక్ష ప్రసారం...

అయితే, ఈ ఏడాది శ్రీ‌రామనవమికి ​​సూర్యకాంతి బాల‌రాముడిపై పడే ఖగోళ కార్యక్రమం సాధ్యమవుతుందని ఆశిస్తున్న‌ట్లు రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. వీటికోసం తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రసార భారతి ద్వారా ఏప్రిల్ 17న ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న స్పష్టం చేశారు. ఆల‌య ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తైందని ఏప్రిల్ 17న భక్తులంతా రాముడి నుదుట సూర్యతిలకాన్ని చూడొచ్చ‌ని తెలిపారు.

More News

    Read more about: ayodhya uttarpradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+