Search
  • Follow NativePlanet
Share
» » బ్రహ్మ రాతతో సంబంధం లేకుండా మీ పిల్లల జాతకాలను మార్చి రాసే శ్రీ కృష్ణుడు ఇక్కడే

బ్రహ్మ రాతతో సంబంధం లేకుండా మీ పిల్లల జాతకాలను మార్చి రాసే శ్రీ కృష్ణుడు ఇక్కడే

మన్నార్ గుడిలోని రాజగోపాలస్వామి దేవాలయం గురించి కథనం

ద్వాపర యుగంలో కృష్ణావతారం తర్వాత ఆ మహావిష్ణువు ఇక్కడే బాల కృష్ణుడి రూపంలో తన భక్తులైన ఇద్దరు బుుషులకు ఇక్కడ దర్శనమిచ్చాడు. ఇలా శ్రీ కృష్ణ అవతారం తర్వాత ఆ రూపంలో దర్శనమివ్వడం చాలా అరుదైన విషయం.

అందుకు తగ్గట్లే ఈ దేవాలయంలోని విగ్రహం కూడా ఉంటుంది. చేతిలో ముల్లుగర్రతో పాటు ఏనుగు దంతం కూడా ఉండటం ఇక్కడ విశేషం. ఇక్కడ దేవాలయం చాలా విశాలమైనది. ఇక్కడ ఉన్న రాజగోపురం భారతదేశంలోని ఎతైన దేవాలయ గోపురాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఇక ఇక్కడ ఆ బాల గోపాలుడు పిల్లల జాతకాలను మార్చి వారిని సన్మార్గంలో నడిపిస్తాడని నమ్ముతారు. అందువల్లే లక్షల సంఖ్యలో ఇక్కడకు భక్తులు ప్రతి ఏడాది వస్తుంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయం గురించిన పూర్తి కథనం మీ కోసం.

తిరువరూరు జిల్లా

తిరువరూరు జిల్లా

P.C: You Tube

తమిళనాడులోని తిరువరూరు జిల్లాలోని మున్నార్ గుడి పట్టణంలో రాజగోపాలస్వామి దేవాలయం ఉంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తోంది. విశాలమైన కారిడార్ తో పాటు ఎతైన గోపురాలు ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం.

వసుదేవుడు

వసుదేవుడు

P.C: You Tube

మున్నార్ గుడి ప్రధానంగా కృష్ణ దేవాలయమైనా కూడా వసుదేవుడిని ప్రధానంగా పూజిస్తారు. అయితే ఉత్సవమూర్తిగా రాజగోపాలస్వామిని ఆరాధిస్తారు. ఇలా ఒక ఉత్సవ మూర్తి పేరుపై ఆలయం ఉండటం దక్షిణభారత దేశంలో ఇక్కడ మాత్రమే చూస్తాం.

పశుపాలకుడు

పశుపాలకుడు

P.C: You Tube

మున్నార్ గుడిలో కృష్ణుడు గోపాలకుడిగా ఉండటం మరొక విశేషం. ఇందుకు సంబంధించిన కథనం ప్రకారం కృష్ణ మేనమామ అయిన కంసుడు కృష్ణుడు, బలరాముడిని సంహరించేందుకు కువలయపీతం అనే ఒక బలిష్టమైన ఏనుగును పంపించాడు.

ఏనుగు దంతం

ఏనుగు దంతం

P.C: You Tube

ఆ ఏనుగు మొదట బలరాముడిని పై ఉరికి సంహరించేందుకు సిద్ధమయ్యింది. సమయంలో కృష్ణుడు ఆ ఏనుగు పైకి లంఘించి ఆ ఏనుగు దంతాన్ని విరిచేస్తాడు. అందువల్లే ఇక్కడ ఉన్న కృష్ణుడి విగ్రహంలో
ఒక చేతిలో ముల్లుకర్ర, మరో చేతిలో ఏనుగు దంతాన్ని చూడవచ్చు

విచిత్ర రూపం

విచిత్ర రూపం

P.C: You Tube

మున్నార్ గుడిలో ఉన్న రాజగోపాలస్వామి ఆలయంలోని విగ్రహం ఆకారాన్ని భారత దేశంలో మనం మరెక్కడా చూడలేము. చేతిలో ముల్లుకర్ర, తలకు పేట, దోవతి కట్టి అచ్చు పశుకాపరిలాగా ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు కనిపిస్తాడు. ఇక అదే విగ్రహంలో మనం ఒక ఆవు, రెండు దూడలను కూడా చూడవచ్చు.

బాల గోపాలుడిని చూస్తున్నట్లుగానే

బాల గోపాలుడిని చూస్తున్నట్లుగానే

P.C: You Tube

రాజగోపాలస్వామి విగ్రహాన్ని చూస్తున్నంత సేపు మనకు ఆ బాల గోపాలుడిని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక రకంగా ఇటువంటి అరుదైన విగ్రహాన్ని చూడటానికే ఎక్కువ మంది ఈ దేవాలయానికి వస్తారు.

మరో కథనం ప్రకారం

మరో కథనం ప్రకారం

P.C: You Tube

కృష్ణావతారం ముగిసిన తర్వాత కూడా తన భక్తులైన ఇద్దరు బుుషుల కోరిక మేరకు ఆ విష్ణుభగవానుడు తిరిగి వారికి బాల గోపాలుడిగా, పశు పాలకుడిగా మున్నార్ గుడిలో దర్శనమిచ్చాడని స్థల పురాణం చెబుతుంది. అందువల్లే ఇక్కడ ఉనక్న విగ్రహం బాలగోపాలుడి రూపంలో ఉందని స్థానికులు చెబుతారు.

కలియుగం మొదట్లో

కలియుగం మొదట్లో

P.C: You Tube

ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలయ్యే క్రమంలో కృష్ణుడి తల్లిదండ్రులు కంసుడు నిర్భంధించిన విషయం, వారికి జన్మించిన శ్రీ కృష్ణుడు యశోద వద్ద పెరగడం, అప్పుడు ఆ విష్ణువు బాల గోపాలుడిగా
మారి పశువులు మేపడం అటు పై కంసుడిని వధించడం, తదితర విషయాలన్ని గోపిలర్, గోపిరలయార్ అనే ఇద్దరు బుుషులకు తెలుస్తాయి.

ద్వారక వైపు ప్రయాణం

ద్వారక వైపు ప్రయాణం

P.C: You Tube

దీంతో ఆ బుుషులు ఇద్దరు ఆ శ్రీ కృష్ణుడిని దర్శించుకోవాలన్న కోరికతో ద్వారక వైపు ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రస్తుతం మున్నార్ గుడి ప్రాంతానికి చేరుకోగానే వారికి త్రిలోక సంచారి అయిన నారదుడు ఎదురయ్యి విషయం తెలుసుకొంటాడు.

ఆత్మత్యాగానికి

ఆత్మత్యాగానికి

P.C: You Tube

అటు పై వారికి శ్రీ కృష్ణు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లిన విషయం చెబుతారు. దీంతో వారిద్దరూ తీవ్రంగా బాధపడి ఆ వాసుదేవుడిని చూడని తమ జీవితం వ్యర్థమని పేర్కొంటూ ఆత్మాహుతికి సిద్ధపడుతారు. అప్పుడు నారదుడు వారిని వారించి ఆ శ్రీ కృష్ణుడి గురించి తపస్సు చేయాల్సిందిగా సూచిస్తాడు.

ఘోర తపస్సు

ఘోర తపస్సు

P.C: You Tube

దీంతో వారు ఆ శ్రీ కృష్ణుడి గురించి ఘోర తపస్సుచేస్తారు. వారి కోరికను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు ఇక్కడ పశు పాలకుడి రూపంలో దర్శనమిచ్చినట్లు పురాణాలు చెబుతాయి. అందువల్లే మున్నార్ గుడిలో బాల కృష్ణుడి రూపంలో విగ్రహం ఉందని చెబుతారు.

బాలారిష్టాలు

బాలారిష్టాలు

P.C: You Tube

ఇక్కడ సాక్షాత్తు ఆ మహావిష్ణువు బాల కృష్ణుడి రూపంలో ఉండటం వల్ల వివిధ వ్యాధులతో బాధపడుతన్న పిల్లలు ఈ విగ్రహ దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెబుతారు. అందువల్లే ఇక్కడకు వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులే ఉంటారు.

బ్రహ్మ రాతతో సంబంధం లేకుండా

బ్రహ్మ రాతతో సంబంధం లేకుండా

P.C: You Tube

ముఖ్యంగా ఈ స్వామిని దర్శించడం వల్ల పిల్లల జన్మ జాతకంతో సంబంధం లేకుండా వారి జాతకాలు మారిపోయి గొప్పగా వ`ద్ధఇలోకి వస్తారని భక్తులు నమ్ముతారు. అందువల్లే దేశ విదేశాల నుంచి ఇక్కడకు ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు తమ పిల్లలతో సహా ఇక్కడకు వస్తుంటారు.

16 గోపురాలు, 18 విమానాలు...

16 గోపురాలు, 18 విమానాలు...

P.C: You Tube

ఈ దేవాలయం అత్యంత విశాలమైనది. అంతే కాకుండా భారత దేశంలో అత్యంత ఎతైన గోపురాలు కలిగిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మొత్తం 16 గోపురాలు, 18 విమానాలు, 7 మంటపాలు, 9 తీర్థాలు
ఉన్నాయి. అందువల్ల ఈ దేవాలయం ఎంత విశాలమైనదో మీరే ఊహించుకోవచ్చు.

రథము కూడా

రథము కూడా

P.C: You Tube

తమిళనాడులోని తిరువరూరు రథాల తయారిలో దేశంలోనే పేరెన్నిక గన్నది. ఈ నేపథ్యంలోనే ఈ దేవాలయంలోని రథం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ జరిగే రథోత్సవం చూడటానికి దేశం నలుమూలల నుంచి ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

 హరిద్రా నది

హరిద్రా నది

P.C: You Tube

ఇక ఈ దేవాలయంలో ఉన్న తీర్థాలన్నీ హరిద్రా నదీ వల్ల ఏర్పడ్డాయి. ఈ నదిలో జమున, యుమున నదులు అంతర్భాగంగా ఉన్నాయని చెబుతారు. అందువల్లే ఇక్కడ ఉన్న తీర్థాలు అత్యంత విశిష్టమైనవి స్థానికుల నమ్మకం. ఇక్కడ ఉన్న తీర్థాల్లో పెద్ద తీర్థం భారత దేశంలోని విశాలమైన తీర్థాల్లో కెల్లా విశాలమైనదని చెబుతారు.

ఆరుసార్లు

ఆరుసార్లు

P.C: You Tube

వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ప్రతి నిత్యం ఆరుసార్లు పూజను నిర్వహిస్తారు. అదే విధంగా ఏడాది పాటు అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

18 విశిష్టమైనది

18 విశిష్టమైనది

P.C: You Tube

కృష్ణావతారానికి సంబంధించి 18 విశిష్టమైన సంఖ్యగా గుర్తిస్తారు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. అదే విధంగ భగవద్గీత అధ్యయనాలు కూడా 18. ఇలాగా మున్నార్ గుడిలో జరిగే బ్రహ్మోత్సవాలు దేశంలో ఎక్కడా జరగని విధంగా 18 రోజుల పాటు నిర్వహిస్తారు.

దక్షిణ ద్వారకా

దక్షిణ ద్వారకా

P.C: You Tube

నవరాత్రి ఉత్సవాలతో పాటు పలు హిందూ సంప్రదాయ ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఈ దేవాలయానికి వచ్చేవారి సంఖ్య మిగిలిన రోజులతో పోలిస్తే లక్షల సంఖ్యలో ఎక్కువగా ఉంటుంది. అందువల్లే కేరళలోని గురవాయూరు తో పాటు ఈ మున్నార్ గుడిని దక్షిణ ద్వారకా అని పిలుస్తారు.

చోళులు

చోళులు

P.C: You Tube

ఈ దేవాలం నిర్మాణంలో చోళ శైలి శిల్పకళ కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ దేవాలయం భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. కుళుతోంగ చోళుడు ఈ దేవాలయాన్ని మొదట నిర్మించగా అటు పై అనేక రాజవంశాల వారు ఈ దేవాలయం అభివ`ద్ధిలో పాలుపంచుకున్నారు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

మున్నార్ గుడి తిరువరూరు జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక చెన్నై నుంచి 310 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న మున్నార్ గుడికి వివిధ నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యం ఉంది. రైలు సౌకర్యం కూడా ఉంది. మున్నార్ గుడిలో ప్రతి రైలు ఆగుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+