బ్యూటీ ఆఫ్ గోరంఘాట్‌కు వెళ్లాల్సిందే..
భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. ఈ ప్రాంతం ఎన్నో చారిత్రక ప్రదేశాలకు, పురాతన కట్టడాలకు నిలయంగా ఉంది. కేవలం ఇక్కడ చారిత్రక కట్టడాలు మాత్రమే కాకుండా పచ్చదనంతో నిండిన పర్వతాలను కూడా చూడొచ్చు. సహజ సౌందర్యం నుండి కళా ప్రదర్శనల వరకు అనేక అందమైన ప్రదేశాలు ఈ ప్రాంతం సొంతం.
ఈ రాష్ట్ర అందాలను చూసేందుకు భారతీయులే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్ద సంఖ్యలో బారులు తీరుతారు. జైపూర్, జైసల్మేర్, మౌంట్ అబూ, ఉదయపూర్ రాజస్థాన్‌లోని అతి పెద్ద, ప్రసిద్ధ నగరాలుగా పేరుగాంచాయి. అయితే వీటీతో పాటు ఇక్కడ ప్రతి పర్యాటకుడి మనసు దోచే మరో అందమైన ప్రదేశం కూడా ఉంది. అచ్చం డార్జిలింగ్‌ను పోలే ప్రదేశం రాజస్థాన్‌లో ఉంది. ఆ ప్రదేశం బ్యూటీ ఆఫ్ నేచర్‌గా ప్రసిద్ధి చెందింది.

ఎడారిలో అద్భుతమైన హిల్ స్టేషన్...
రాజస్థాన్‌లో ఉన్నగోరం ఘాట్ ప్రకృతి అందాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. కాశ్మీర్‌లోని డార్జిలింగ్‌గా ఈ ప్రాంతం ప్రాముఖ్యత సంతరించుకుంది. జైపూర్ నుండి ఈ ప్రాంతం సుమారు 278 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉదయపూర్ నుండి ఈ ప్రాంతానికి వెళ్లాలనుకుంటే మాత్రం 130 కిలోమీటర్ల ప్రయాణించాల్సిందే. మార్వార్, మేవార్ సరిహద్దులో ఉన్న ఈ ఘాట్‌పై నిర్మించిన రైల్వే ట్రాక్ పర్యాటకులలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఖమ్లీ ఘాట్ గోరం ఘాట్ నుండి కొంచెం దూరంలోనే ఈ ప్రాంతం ఉంటుంది.

గోరం ఘాట్ రైల్వే ట్రాక్ చరిత్ర...
గోరం ఘాట్ రైల్వే ట్రాక్ చరిత్ర ఎంతో ఆసక్తికరమైనది, ప్రత్యేకమైనది. 1932లో గోరంఘాట్ రైలును బ్రిటిష్ వారు నిర్మించారని చరిత్ర చెబుతోంది. మేవార్, మార్వార్‌లను కలుపుతూ ఈ రైలు మార్గాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఈ రైల్వే ట్రాక్‌పైన అందమైన పర్వతాలతో పాటు, రైల్వే లైన్ మార్గంలో కొన్ని సొరంగాలు కూడా ఉన్నాయి. ఈ మార్గాలు దీని అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. అంతేకాదు, ఈ ప్రాంతంగుండా రైలు దాదాపు 172 చిన్నా, పెద్ద వంతెనల గుండా ప్రయాణిస్తుంది.

గోరం ఘాట్ అందం..
ఆరావళి పర్వతాల లోయలలో ఉన్న గోరం ఘాట్, దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పొచ్చు. ఈ ప్రదేశంలో రైలు ప్రయాణం పర్యాటకులకు ఎంతగానో నచ్చుతుంది. యాత్రికులు నడకమార్గం ద్వారా వెళ్లేందుకు ట్రాక్ పక్కన వంతెన కూడా ఉంటుంది. చాలా మంది ఈ వంతెనపై నిలబడి ఫోటోలు కూడా తీసుకుంటారు.
ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటటే, డార్జిలింగ్‌లో ఉండే టాయ్ ట్రైన్ ఇక్కడ ఉంది. కేవలం ఈ టాయ్‌ట్రైన్ అనుభూతిని పొందేందుకే కొంతమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. గోరం ఘాట్ ఒక హిల్ స్టేషన్. ఇక్కడ ఎటువంటి వసతి సౌకర్యం లేదు. కాబట్టి జోధ్‌పూర్ లేదా మార్వార్ జంక్షన్‌లో ఏదైనా హోటల్ లేదా ఆశ్రమాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కేఫ్‌లు లేదా రెస్టారెంట్‌లు ఏవీ లేవు. కాబట్టి ఖచ్చితంగా వెంట ఆహార పదార్థాలను కూడా తీసుకెళ్లడం ఉత్తమం. ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
ఎలా చేరుకోవాలి
గోరం ఘాట్ చేరుకోవాలంటే మూడు రైల్వేస్టేషన్లు అందుబాటులో కలవు. అవి మార్వార్ జంక్షన్, మావ్లీ జంక్షన్, ఫులాద్ జంక్షన్. ఇక్కడి నుంచి నేరుగా గోరం ఘాట్ చేరుకోవచ్చు. జైపూర్, ఉదయ్‌పూర్ లేదా జోధ్‌పూర్ మార్గాల నుంచి కానీ ప్రయాణం చేస్తే అక్కడ నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications













