Search
  • Follow NativePlanet
Share
» »ఆధ్యాత్మిక ఆవాసాలు - పంచ సరోవరాలు !

ఆధ్యాత్మిక ఆవాసాలు - పంచ సరోవరాలు !

By Mohammad

భారత దేశంలో దేవాలయాలు మాత్రమే హిందూ సంస్కృతిని తెలియజేస్తాయనటం ఎంతమాత్రం సబబు కాదు. నదులు, సరస్సులు కూడా హిందూ సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. అందుకే నదులలో, సరస్సులలో ఇప్పటికీ (మొన్న జరిగిన కృష్ణా పుష్కరాలతో సహా) స్నానాలు ఆచరిస్తుంటాం.

పురాణాలలో హిందూ సంస్కృతి గూర్చి వివరించేటప్పుడు సరస్సుల గురించి ప్రస్తావిస్తుంటారు పెద్దలు. ఇవి 5 ఉన్నాయని, వాటిలో ఒక్కసారి మునిగితే పాపాలన్నీ తొలగిపోతాయని, కష్టాలేవీ దరిచేరవని చెబుతారు. అంతటి ఆధ్యాత్మిక ఆవాసాలుగా గుర్తించబడిన ఆ పంచ సరోవరాల గురించి, వాటి ప్రశస్తి గురించి ఒకసారి తెలుసుందాం ..!

బిందు సరోవరం, భువనేశ్వర్

బిందు సరోవరం, భువనేశ్వర్

చిత్రకృప : Sourav Das

బిందు సరోవరం

భువనేశ్వర్ లోని బిందు సరోవరం మహాత్యమైనది. సరోవరం మధ్యలో విశాల మందిరం కలదు. మధ్యలోనే కాలుందా సరోవరం చుట్టూ ఇతర అనేక మందిరాలు ఉన్నాయి. అందులో శివపార్వతులు, నారాయణుడు, వినాయక దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అనేక తీర్థ స్థలాల నుండి తీసుకొచ్చిన నీటిని సరోవరం లో పోయటం వలన ఈ నీటికి అంతటి ప్రాధ్యాన్యం చేకూరింది.

మాతృగయగా ప్రసిద్ధి చెందిన సిద్ధపుర సరోవరం ఇక్కడ ఉన్న మరో బిందు సరోవరం. దీని యొక్క పురాతన పేరు 'శ్రీస్థలం'. దీనిలో మాతృశ్రాద్ధం నిర్వహిస్తారు. దక్షిణ తీరంలో కద్రమ మహర్షి, దేవహూతి మరియు కపిల ఋషుల విగ్రహాలు వుంటాయి. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, సిద్దేశ్వర, మహాదేవ మందిరం వల్లభాచార్య విగ్రహం ఇక్కడ ప్రధానమైనవి.

నారాయణ సరోవరం, కచ్

నారాయణ సరోవరం, కచ్

చిత్రకృప : Chandra

నారాయణ సరోవరం

గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉన్న అతి ప్రాచీన తీర్థ స్థలం నారాయణ సరోవరం. నారాయణ భగవాన్ స్వయంగా పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి దీని పుట్టించాడు. నారాయణుడు ఇక్కడ కొంతకాలం నివసించాడు కనుక దీనిని నారాయణ సరోవరం అని పిలుస్తారు. సరోవరం దగ్గర గోవర్ధనాథ్, నారాయణ భగవాన్ మందిరాలు ఉన్నాయి. 3 కి. మీ ల దూరంలో ఉన్న మహాదేవుని ఆలయం కూడా చూడదగ్గదే ! కార్తీక పౌర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది.

మానస సరోవరం, హిమాలయ పర్వతాలు

మానస సరోవరం, హిమాలయ పర్వతాలు

చిత్రకృప : Krish Dulal

మానస సరోవరం

హిమాలయ పర్వతాలలో పురాతన కాలం నుండి యాత్రికులను ఆకర్షిస్తున్న సరస్సు మానస సరోవరం. ఇక్కడ 'రాక్ష సతాల్' మరియు మానస సరోవర్ అనే రెండు సరస్సులు కలవు. రాక్ష సతాల్ లో రావణాసురుడు నిలబడి తపస్సు చేసాడని చెబుతారు.

మానస సరోవరం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. హంసలకు నిలయమైన ఈ సరస్సులోని నీరు స్నానాలు ఆచరించటానికి అనుకూలం. దీనికి 32 కి. మీ ల దూరంలో కైలాస పర్వతం కలదు.

కైలాస పర్వతం శివుని సన్నిధానం. కైలాస పర్వతం సాక్షాత్ శివ రూపమే దీనికి దగ్గరలో గౌరీ కుండం కలదు. ఇక్కడ సతీదేవి కుడి అరచేయి పడింది. అప్పటి నుండి ఇది శక్తి పీఠం గా పూజలు అందుకుంటున్నది.

పుష్కర్ సరోవరం, పుష్కర్

పుష్కర్ సరోవరం, పుష్కర్

చిత్రకృప : Felipe Skroski

పుష్కర్ సరోవరం

మహాభారతంలో పులస్త్యముని భీమినికి అనేక తీర్థాల గురించి వివరిస్తూ పుష్కర్ తీర్థం పవిత్రమైనదని చెబుతాడు. పుష్కర్ అనగా తీర్థాలకు గురువు. సృష్టి కర్త బ్రహ్మ నివాసం ఈ పుష్కర్. ఈ సరోవరాన్ని ఆయనే పుట్టించాడు. సరోవరం దగ్గరలో బ్రహ్మదేవాలయం, కపాలేశ్వర్ దేవాలయం, వరాహదేవాలయం ఉన్నాయి. సమీపంలోని సరస్వతి నదిలో స్నానం చేయటం కూడా పుణ్యమే! ఔరంగజేబు కాలంలో ఆలయాలు ధ్వంసమైయ్యాయి. ఆతరవాత ఆలయాలను క్రీ. శ.18 వ శతాబ్దంలో తిరిగి పునర్నిర్మించారు.

పంపా సరోవరం

పంపా సరోవరం

చిత్రకృప : Indiancorrector

పంపా సరోవరం

పంపా సరోవరం రామాయణం తో ముడిపడి ఉన్నది. రామలక్ష్మణులు విశ్రమించిన స్థలం ఇది. దక్షిణ భారతదేశంలో తుంగభద్రా నదికి దక్షిణాన కలదు. ఇక్కడే శబరి గుహ కూడా చూడవచ్చు. కిష్కింద, ఋష్యమూక పర్వతం ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+