ఉనాకోటి అంటే బెంగాలీలో కోటికి ఒకటి తక్కువ అని అర్థం. ఈ పేరుతోనే ఒక పర్యాటక ప్రాంతం ఉంది. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన త్రిపురలో ఉనాకోటి ఉంది. పురాణ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతం అందమైన ప్రకతికే కాకుండా అనంతమైన శిల్ప సంపదకు కూడా నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి శిల్ప సంపదను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 99,99,999 శిల్పాలు ఉన్నట్టు చెబుతారు. అందువల్లే ఈ ప్రాంతానికి ఉనాకోటి అని పేరు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం పర్యాటకంగా పేరు గడించలేకపోయింది. అయితే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి పై దష్టి సారించిన ప్రభుత్వం రూ.12 కోట్ల రుపాయలను విడుదల చేసింది. ఈ నిధులతో ఈ ప్రాంతంలో ఇటీవల అభివృద్ధి పనులను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది.

1.స్థానిక పురాణం ప్రకారం
Image Source:
స్థానిక పురాణ ప్రకారం లయకారకుడైన పరమశివుడికి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన వారణాసిని చూడటానికి కైలాసం నుంచి బయలు దేరాడు. అయితే అందరు దేవుళ్లు తాము కూడా వారణాసికి వస్తామమని చెబుతారు.

2. వారి కోరికను కాదనలేక
Image Source:
వారి కోరికను కాదనలేక పరమశివుడు తనతో పాటు సమస్త దేవతలను వారణాసికి తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు. ఒక శుభ ముహుర్తాన పరమశివుడితో పాటు అందరు దేవుళ్లు అంటే ముక్కోటి దేవతలు వారణాసికి బయలు దేరుతారు.

3. ఉనాకోటి ఉన్న ప్రాంతానికి
Image Source:
కైలాసం నుంచి కొండలు, కోనలు దాటుకొంటూ ప్రస్తుతం ఉనకోటి ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయానికి సూర్యాస్తమయం అవుతుంది. దీంతో రాత్రి బస అక్కడ చేస్తారు.

4.సూర్యోదయానికి ముందే
Image Source:
సూర్యోదయానికి ముందే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని అందరూ అంగీకరిస్తారు. ఈ సమయంలో శివుడు కలుగజేసుకొని సూర్యోదయానికి ముందేమనం వారణాసికి బయలుదేరాలని చెబుతాడు.

5. ప్రయాణ బడలిక వల్ల
Image Source:
అయితే ప్రయాణ బడలిక వల్ల దేవతలు సూర్యోదయానికి ముందు లేవలేకపోయారు. దీంతో అప్పటికే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న పరమశివుడికి దేవతలు నిద్రలేవలేదన్న విషయం తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

6.ఆగ్రహం వ్యక్త చేస్తాడు
Image Source:
తాను వద్దన్నా వారణాసికి బయలుదేరడమే కాకుండా మధ్యలో తాను చెప్పిన మాట పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను కోపంతో రగలిపోతాడు. దేవతలందరూ శిల్పాలుగా మారిపోవాలని శాపం పెడుతాడు.

7. ఒక్క శివుడు తప్ప
Image Source:
దీంతో ఒక్క శివుడు తప్ప మిగిలిన వారంతా శిలలుగా మారిపోతాడు. అందువల్లే ఇక్కడ కోటికి ఒకటి తక్కువగా విగ్రహాలు ఉన్నట్లు చెబుతారు.

8. మరో కథనం
Image Source:
ఈ విషయమై మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఒక ఈ ఉనాకోట వద్ద ఒక శిల్పా చార్యుడు ఉండేవాడు. అతను పరమ శివ భక్తుడు. ఎలాగైనా ప్రాణంతోనే కైలాసానికి వెళ్లి పార్వతి, శివుడి వద్ద ఉండిపోవాలని భావిస్తాడు.

9.ఘెర తపస్సు చేస్తాడు
Image Source:
ఇందు కోసం ఘోర తపస్సు చేస్తాడు. శివపార్వతులు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటారు. తాను ప్రాణంతో కైలాసానికి రావాలని కోరుకుంటున్నట్లు చెబుతారు. అయితే ఇది స`ష్టి ధర్మానికి విరుద్ధమని మరేదైనా వరం కోరుకోవాల్సిందిగా చెబుతారు.

10. ఒక్కరాత్రిలో
Image Source:
అయితే మొండివాడైన శిల్పా చార్యుడు తనకు అదే వరం ప్రసాదించాలని పట్టుపడుతాడు. దీంతో శివపార్వతులు ఒక్క రాత్రి లోపు ఒంటరిగా కోటి దేవతా విగ్రహాలను చెక్కితే ప్రాణంతో కైలాసానికి రావచ్చునని చెబుతారు.

11.99,99,999 విగ్రహాలు
Image Source:
దీంతో శిల్పాచార్యుడు కోటి విగ్రహాలను చెక్కడం మొదలు పెడుతాడు. సూర్యోదయం సమయానికి 99,99,999 శిల్పాలు చెక్కాడు. దీంతో గర్వం పెరిగిపోతుంది. మిగిలిన ఒక్క విగ్రహం బదులు తన విగ్రహం చెక్కడం మొదలు పెడుతాడు.

12. విగ్రహం పూర్తి కాదు
Image Source:
అయితే తెల్లవారినా కూడా ఆ విగ్రహం పూర్తి కాదు. దీంతో శివ పార్వతులు ప్రత్యక్షమయ్యి నీవు కోటి విగ్రహాలను చెక్కలేకపోయావని అందువల్ల కైలాసానికి తీసుకెళ్లలేమని చెబుతారు.

13. తన గర్వానికి తగిన శాస్తి జరిగినట్లు
Image Source:
తన గర్వానికి తగిన శాస్తి జరిగినట్లు భావించిన శిల్పాచార్యుడు తన శేషజీవితాన్ని ఇక్కడే శివ నామ స్మరణతో గడిపాడని చెబుతారు. ఇక్కడ ప్రక`తి రమణీయత కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

14. చుట్టూ జలపాతాలు
Image Source:
చుట్టూ జలపాతాలలు, పచ్చటి అడవుల మధ్య ఈ ఉన కోటి స్వర్గంలా అనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ తొంబై తొమ్మిది లక్షలా తొంబై తొమ్మిది వేలా, తొమ్మిది వందల తొంబై తొమ్మిది విగ్రహాల్లో చాలా వరకూ కొండను తొలిచి చెక్కినవి కొన్ని అయితే మరికొన్ని రాళ్లను విగ్రహాలుగా మలిచినవి మరికొన్ని.

15. కాలభైరవ విగ్రహం గురించి
Image Source:
ఇందులో ఉనాకోటి కాలభైరవ విగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ విగ్రహం పూర్తిగా కూడా ఉండదు. కేవలం తల భాగం మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క విగ్రహమే 10 అడుగుల ఎత్తు మేర ఉండటం విశేషం.

16. ఎన్నో విగ్రహాలు
Image Source:
ఇక వినాయక, కుమారస్వామి తదితర శివ గణాలకు చెందిన ఎన్నో విగ్రహాలను మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తంగా ప్రక`తి రమణీయతల మధ్య శిల్ప సౌదర్యం చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోతామంటే అతిశయోక్తి కాదేమో.

17. ఏప్రిల్, మే నెలల్లో
Image Source:
ఇక ప్రతి ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో నిర్వహించే అశోకాష్టమి మేళ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.

18 నాలుగు రెట్ల మంది పర్యాటకులు
Image Source:
మిగిలిన రోజులతో పోలిస్తే ఈ అశోకాష్టమి నిర్వహించే సమయంలో వచ్చే పర్యాటకుల సంఖ్య దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంటారు.

19. అగర్తలకు చేరుకొని
Image Source:
ఉనాకోటి త్రిపుర రాజధాని అగర్తలకు 178 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అగర్తలలో ఎయిర్ పోర్టు కూడా ఉంది. దీంతో ఇక్కడకు చేరుకొన్న పర్యాటకులు ఎక్కువగా ప్రైవేటు ట్యాక్సీలల్లో ఉనాకోటికి చేరుకొంటూ ఉంటారు.

20 అరగంట ప్రయాణం
Image Source:
అదే విధంగా ఉనాకోటి కైలాషర్ కు 8 కిలోమీటర్లు, శిల్చార్ కు 148 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉనాకోటికి దగ్గరగా దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ధర్మనగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి దాదాపు అర్థగంట ప్రయాణం చేసి ఉనాకోటిని చేరుకోవచ్చు.

21. నిర్లక్ష్యం వీడాలి.
Image Source:
ఈ విగ్రహానికి ఒక వైపున సింహం పై దుర్గామతా నిలుచొన్న విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది. అదే విధంగా భూమిలో సగం వరకూ కూరుకుపోయిన నంది విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా భూమిలోకి కూరుకుపోయిన విగ్రహాలను పర్యటకులకు అందుబాటులోకి తేవడం పట్ల స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది.



Click it and Unblock the Notifications













